‘కిడ్నాప్’తో తల్లడిల్లుతున్న రెండు కుటుంబాలు | "Two families suffer kidnap | Sakshi
Sakshi News home page

‘కిడ్నాప్’తో తల్లడిల్లుతున్న రెండు కుటుంబాలు

Published Wed, Jul 30 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

‘కిడ్నాప్’తో తల్లడిల్లుతున్న రెండు కుటుంబాలు

‘కిడ్నాప్’తో తల్లడిల్లుతున్న రెండు కుటుంబాలు

విజయవాడ సిటీ/రామవరప్పాడు : జిల్లాలోని నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన గోగి నేని లాల్‌బహదూర్ శాస్త్రి, వసుమతి దంపతులు మూడు దశాబ్దాలుగా విజయవాడలో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు ప్రతీష్‌చంద్ర సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని తొలుత కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఇంజనీర్‌గా పని చేశా రు. సంస్థ ఆదేశాల మేరకు సౌత్ ఆఫ్రికా, సూడాన్ దేశాల్లో జరిగిన నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను మూడేళ్లపాటు నిర్వహించారు.

అక్కడ జాతుల మధ్య వైరం కారణంగా తరుచూ  దాడులు జరిగేవి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ప్రతీష్‌చంద్రను ఇక్కడికి పిలిపించారు. కొంతకాలం పాటు ఇంటి వద్దనే ఉన్న ప్రతీష్.. మూడు నెలల కిం దట హైదరాబాద్ కేంద్రంగా నిర్మాణ పనులు చేసేట్టే పృథ్వీ కన్‌స్ట్రక్షన్స్‌లో ఇంజినీర్‌గా చేరా రు. నూజివీడు ప్రాంతానికే చెందిన తాం డవకృష్ణ, రాఘవేంద్రరావు(రఘు) అప్పటికే  ఇదే సంస్థలో పనిచేస్తున్నారు.

విధుల నిర్వహణ లో భాగంగా నాగాలాండ్ రాజధాని కోహిమా లో ఉంటూ వీరు సంస్థ తరఫున జాతీయ రహదారి నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీష్‌చంద్ర, రఘు  స్వస్థలానికి వచ్చేందుకు ఈ నెల 27వ తేదీ రాత్రి దిమ్మాపూర్ చేరుకున్నారు. అక్కడ వీరిని నాగా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.
 
ఈ విషయం తెలిసిన వెంటనే శాస్త్రి భార్య కుప్పకూలిపోయారు. అప్పటి నుంచి పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా రోదిస్తోంది. విషయం మీడియా ద్వా రా తెలిసి బంధువులు, స్నేహితులు, స్థానికు లు వచ్చి  ఓదార్చే ప్రయత్నాలు చేస్తున్నారు.  
 
ఇదీ జరిగింది
 
ప్రతీష్ సోదరుడు జగదీష్‌బాబు ఇటీవల బీటెక్ పూర్తి చేసుకొని ఉన్నత చదువుల కోసం ఆగస్టు ఏడో తేదీన అమెరికా వెళుతున్నారు. ఇతనికి వీడ్కోలు పలికేందుకు విజయవాడ వచ్చేందుకు నిర్ణయించుకున్న ప్రతీష్ 28వ తేదీ ఉదయం రైలు ఎక్కాల్సి ఉంది. దీంతో తమ గ్రామానికి చెందిన మిగిలిన ఇద్దరితో కలిసి 27వ తేదీ రాత్రి దిమ్మాపూర్ చేరుకున్నా డు. ఇది తెలిసిన నాగా రెవల్యూషనరీ ఫ్రంట్(ఎన్‌ఆర్ ఎఫ్) తీవ్రవాదులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి తాండవకృష్ణ అ క్కడి నుంచి పరారవ్వగా, మిగిలిన ఇద్దరిని తీవ్రవాదులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ప్రతీష్ కుటుంబ సభ్యులకు తెలియపరిచారు.

ఇందుకోసం..
 
నాగాలాండ్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లు స్థానికంగా ప్రాబల్యం పొందిన తీవ్రవాద గ్రూపులకు కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. చెక్‌బమా నుంచి కిలోమి వరకు రోడ్డు నిర్మాణ బాధ్యతలను తొలుత రత్న కన్‌స్ట్రక్షన్స్ తీసుకుంది. ఆ సమయంలో స్థానిక నా గా రివల్యూషనరీ ఫ్రంట్(ఎన్‌ఆర్‌ఎఫ్) తీవ్రవాదులతో నగదు ఇచ్చే ఒప్పందం చేసుకుం ది. ఆ మొత్తం సుమారు రూ.20 కోట్లు అని తెలుస్తోంది. తదుపరి ఇక్కడి నిర్మాణ బాధ్యతలను పృథ్వీ కన్‌స్ట్రక్షన్స్‌కు సబ్ కాంట్రాక్టు ఇ చ్చిన రత్న కన్‌స్ట్రక్షన్స్.. తీవ్రవాదులకు ఇస్తానన్న మొత్తం ఇవ్వలేదు.

అప్పటి నుంచి పలుమార్లు హెచ్చరించినా రత్న సంస్థ నిర్వాహకు లు ఖాతరు చేయలేదు. దీంతో తీవ్రవాదులు   పృథ్వీ సంస్థ ఇంజినీర్లను కిడ్నాప్ చేశారు. రత్న కన్‌స్ట్రక్షన్స్ సంస్థ జనరల్ మేనేజర్ కె.సి.పంతోని తమకు అప్పగిస్తే వీరిని వదిలేస్తామ ని ఫోన్‌ద్వారా తెలియజేసినట్టు కుటుంబ సభ్యులు చెపుతున్నారు.  దీనిపై గత రెండు రోజులుగాసాగుతున్న చర్చలు సానుకూల ధోరణిలో ఉన్నాయని వారు మంగళవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు.
 
ఒక్కగానొక్క కుమారుడిని వదిలిపెట్టండి

నూజివీడు/ నూజివీడు రూరల్ : నూజివీడుకు చెందిన చింతక్రింద రాఘవేంద్రరావు(25) అలియాస్ రఘు నాగాలాండ్ లో కిడ్నాప్‌నకు గురవడంతో అతడి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రఘు కిడ్నాప్ గురించి టీవీల్లో చూసిన తరువాతే వారికి తెలిసింది. ముగ్గురు ఆడపిల్లల తరువాత రఘు పుట్టాడు.

రఘుకు నాలుగేళ్ల వయస్సు ఉన్నపుడే అతడి తండ్రి బాబూరావు మృతిచెందారు. దీంతో ఒక్కగానొక్క కుమారుడైన అతడిని తల్లి అల్లారుముద్దుగా చూసుకునేవారు. రఘు బీకాం కంప్యూటర్స్ వరకు చదివాడు. 2013 నుంచి ప్రధ్వీ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సైట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. రఘు కిడ్నాప్‌కు గురైన సంగతి అతని తల్లి ప్రభావతికి కుమార్తెలు తెలియనివ్వలేదు. ఇద్దరు కుమార్తెలు నూజివీడులోనూ, చిన్నకుమార్తె నల్లగొండలో ఉంటున్నారు. మూడు రోజుల క్రితమే రఘు తల్లి చిన్నకుమార్తె దగ్గరకు వెళ్ళింది. రఘు 2013లో సెప్టెంబరు నెలలో ఇంటికి వచ్చి అక్టోబర్ నాలుగో తేదీన తిరిగి నాగాలాండ్ వెళ్ళాడు.

కోహిమాలో ఉంటూ కంపెనీ పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లివస్తుంటాడు. కోహిమాకు సమీపంలోని దిమాపూర్‌లో ఉండగా ఈనెల 27వ తేదీ రాత్రి కిడ్నాప్‌కు గురైనట్లు టీవీల ద్వారా తెలుసుకున్నారు. ఉన్నది ఒక్కడివే.. అంత దూరంలో ఏం ఉద్యోగం, ఇక్కడికి వచ్చేయమంటూ కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నారు. 8 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, డబ్బు అందగానే వచ్చేస్తానని తల్లికి, అక్కలకు చెప్తున్నాడు. ఇంతలోనే కిడ్నాప్‌కు గురికావడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.   వారం రో జుల క్రితం ఒకసారి మాట్లాడాడని రెండో అక్క అనిత పేర్కొంది.
 
27న బయలుదేరుతున్నామని చెప్పాడు
 
ఈనెల 27న రఘుతోపాటు మరో ఇద్దరు కలసి బయలుదేరి వస్తున్నామని ఈనెల 23న ఫోన్‌లో చెప్పాడని రఘు స్నేహితు డు ఉదయ్ పేర్కొన్నాడు. మిగిలిన ఇద్దరికి ట్రైన్ టికెట్లు కన్‌ఫర్మ్ అయ్యాయని, తను మాత్రం తత్కాల్‌లో బుక్‌చేశానని, వెయిటింగ్ లిస్టులో ఉందని, అయినప్పటికీ ట్రైన్ ఎక్కి టీసీని మెయింటెన్ చేసుకుంటానని చెప్పాడని, ఇంతలోనే ఈ విధంగా జరిగిందని వాపోయాడు.
 
ప్రభుత్వం పట్టించుకోవాలి
 
ఒక్కగానొక్క కుమారుడు బ్రతుకుదెరువు కోసం వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంటున్నాడని, అతనిని తీవ్రవాదులు కి డ్నాప్ చేసిన నేపథ్యంలో వారి చెర నుంచి ప్రభుత్వం బాధ్యత తీసుకుని విడిపించాలని కుటుంబ సభ్యులుకోరుతున్నారు. ఇదిలా ఉండగా, గోగినేని ప్రతీష్‌చంద్ర నాగాలాండ్‌లో కిడ్నాప్ అవడంతో మండంలోని అతడి స్వస్థలమైన గొల్లపల్లిలోని బంధువులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నా రు.  
 
 లైటు కూడా లేదట

 అక్కడ వీరిని నిర్భంధించిన గదిలో ఫ్యాన్ కాదు కదా లైటు కూడా లేదంట. కిడ్నాపర్లను నిర్బంధించేందుకు ప్రత్యేకంగా జైలు ఏర్పాటు చేసినట్టు మా అబ్బాయి చెప్పాడు. జైల్లో మాదిరి సెంట్రీ అక్కడ కాపలా ఉన్నాడంట. వీరితో పాటున్న తాండవకృష్ణ పారిపోవడంతో కోపం వచ్చి కొట్టినట్టు మా అబ్బాయి చెప్పాడు. ‘సెంట్రీ మంచోడు అనుకుంటా.. గంట గంటకూ తమతో ఫోన్లో మాట్లాడిస్తున్నాడు. వీలైనంత తొందరగా తీసుకెళ్లండి’ అని మా అబ్బాయి ప్రాథేయపడుతున్నాడు.
 - గోగినేని లాల్‌బహదూర్ శాస్త్రి, ప్రతీష్‌చంద్ర తండ్రి
 
 కప్పం కట్టాల్సిందే
 నాగాలాండ్‌లో నిర్మాణ పనులు సహా ఏ వ్యాపారాలు చేయాలన్నా తీవ్రవాద సంస్థలకు కొంత నగదు కమీషన్ ఇవ్వాలి. ఎన్‌ఆర్‌ఎఫ్ సహా ఐదు తీవ్రవాద గ్రూపులు అక్కడ ఉన్నాయి. ప్రాంతాల వారీగా ప్రాబ ల్యం ఉన్న వీరికి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి.
 - నళినీమోహన్, వైష్ణవీ కన్‌స్ట్రక్షన్స్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement