భద్రాచాలం: భద్రాదిలో కోలువైన శ్రీరాములవారి పుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకుగానూ, తమ మెక్కులను తీర్చుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. పవిత్రమైన గోదావరి నదిలో స్నానమాచరిస్తే సర్వపాపాలు నశించడమే కాకుండా పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారి కృపకు పాత్రులైందుకు భక్తులందరూ గోదావరిలో స్నానాలు ఆచరిస్తుంటారు.
తాజాగా శనివారం భద్రచలంలో గోదావరిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు నీటి ప్రవాహానికి గల్లంతై మృతిచెందారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరొక మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.