నాగులాపురం (చిత్తూరు) : డెంగ్యూ బారిన పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నాగులాపురం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని వీర కుప్పం గ్రామానికి చెందిన ప్రవీణ(8) గత వారం రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతోంది. దీంతో కుటుంబసభ్యులు చైన్నై ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. సోమవారం మధ్యాహ్నం మృతిచెందింది. ఇదిలా ఉండగా.. చెన్నాపట్టు గ్రామానికి చెందిన శ్రావణి(3) డెంగ్యూతో బాధపడుతూ ఈ రోజు మృతిచెందింది.