రాజమండ్రిలో రెండిళ్లలో చోరీ | Two houses robbed in rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో రెండిళ్లలో చోరీ

Published Sun, Feb 15 2015 12:03 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Two houses robbed in rajahmundry

రాజమండ్రి: రాజమండ్రి నగరంలో దొంగలు హల్చల్ సృష్టించారు. స్థానిక సుబ్రహ్మణ్యనగర్లోని రెండు ఇళ్లలో చోరీ చేసి.. సుమారు 12 తులాల బంగారం, 400 గ్రాముల వెండి ఆభరణాలను దొంగిలించారు. సుబ్రహ్మణ్యనగర్లో నివాసం ఉంటున్న స్వామి ఈ నెల 11న వైజాగ్ వెళ్లి ఆదివారం ఇంటికి తిరిగి వచ్చారు.

ఇంటి తలుపులు తీసి ఉండే సరికి దొంగతనం జరిగిందని భావించారు.  కాగా, స్వామి పక్క ఇంటి తాళం పగిలి ఉండటంతో ఆ ఇంట్లోను చోరీ జరిగిందని  భావించిన స్వామి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement