అనంతపురం జిల్లా గుంతకల్లు వివేకానంద ఎంబీఏ కళాశాలలో చదువుతున్న సురేష్, చిరంజీవి అనే యువకులు సోమవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హాల్‌టికెట్ మరిచిపోయినవారు బైక్‌పై చిప్పగిరి గ్రామానికి వెళుతుండగా బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిరంజీవిని గుంతకల్లు ఆస్పత్రిలో చేర్చారు.