నామినేషన్ ఉపసంహరించుకున్న స్వతంత్ర అభ్యర్థి
ఒంగోలు టౌన్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ద్విముఖ పోటీ నెలకొంది. జిల్లాలోని ఒక స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుఫున అట్ల చినవెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ తరుఫున మాగుంట శ్రీనివాసులరెడ్డిలతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా అట్ల పెద శ్రీనివాసరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. స్వతంత్ర అభ్యర్థి అట్ల పెద శ్రీనివాసరెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ హరిజవహర్‌లాల్ ప్రకటించారు. జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి 992 మంది ఓటర్లు ఉన్నారు.
మునిసిపల్ వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కో ఆప్షన్ సభ్యులతో కలుపుకుంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 496 మంది కాగా తెలుగుదేశం పార్టీకి 457 మంది మద్దతు ఉంది. అవసరమైన బలం లేకపోయినా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో టీడీపీ అభ్యర్థిని నిలిపింది. అభ్యర్థులు ఇద్దరూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ స్థానానికి ద్విముఖ పోటీ
Published Sat, Jun 20 2015 8:32 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement