జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్‌ | Two Places Repolling in PSR nellore | Sakshi
Sakshi News home page

జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్‌

Published Thu, Apr 18 2019 12:49 PM | Last Updated on Thu, Apr 18 2019 12:49 PM

Two Places Repolling in PSR nellore - Sakshi

సాక్షిప్రతినిధి, నెల్లూరు:  జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించారు.  జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో అటకానితిప్ప గ్రామంలోని పోలింగ్‌ బూత్‌ నంబరు 197లో,  కోవూరు నియోజకవర్గం పల్లెపాళెంలోని ఇస్కపల్లిలో ఉన్న పోలింగ్‌ బూత్‌ నంబరు 41లో రీపోలింగ్‌కు సిఫారసు చేశారు. ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఆరుగురు ఉద్యోగులపైన చర్యలకు సిఫార్సు చేశారు. అయితే జిల్లాలో రీపోలింగ్‌ నిర్వహించడానికి  సంబంధించి ఎన్నికల సంఘం నుంచి జిల్లా యంత్రాంగానికి ఇంకా ఆదేశాలు అందలేదు. రెండు పోలింగ్‌బూత్‌ల్లో సుమారు 1,600 ఓట్లు ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement