కూసుమంచి/మోతె, న్యూస్‌లైన్: తమ వివాహేతర సంబంధానికి ఇరు కుటుంబాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో తట్టుకోలేని బావ-మరదలు (తమ్ముడి భార్య) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కోక్యాతండాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు...
కోక్యాతండా చెందిన ఎర్రనాగుల నాగేశ్వరరావు (వెంకటి-38) ఆటో న డుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇతను అదే తండాలో ఉంటు న్న తన తమ్ముడి భార్య విజయ(32) తో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఈ విషయమై రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరి గాయి. తన తండ్రికి, పిన్నికి మధ్య వివాహేతర సంబంధంతో మనస్థాపం చెందిన నాగేశ్వరరావు కుమార్తె ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మృతి తరువాత.. నాగేశ్వరరావు కుటుంబం ఇల్లు ఖాళీ చేసి కొన్ని నెలలుగా కూసుమంచిలో అద్దె ఇంటిలో ఉంటుంది. అదే సమయంలో, విజయ కూడా తన పుట్టింటికి వెళ్లి, కొన్ని రోజుల తరువాత తిరిగొచ్చింది.
మూడు రోజుల కిందట నాగేశ్వరరావు కోక్యాతండాకు వెళ్లాడు. అక్కడ అతనికి, అతని తమ్ముడికి మధ్య గొడవ జరిగింది. విజయ ఆదివారం ఉద యం కూసుమంచి వచ్చింది. ఆమెను నాగేశ్వరరావు తన ఆటోలో నల్గొండ జిల్లా మోతె మండ లం ఉర్లుగొండలోని నర్సింహస్వామి గుట్టపైకి తీసుకెళ్లాడు. అక్కడ వా రిద్దరూ పురుగుల మందు తాగారు. అనంతరం నాగేశ్వరరావు తన స్నేహితుడు హుస్సేన్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపాడు. హుస్సేన్ వెంట నే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రా ణాపాయ స్థితిలో ఉన్న వారిద్దరినీ 108 అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందా రు. మృతదేహాలను మార్చురీలో ఉం చారు.
ఇద్దరి ఆత్మహత్య
Published Mon, Jan 6 2014 2:40 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement