విశాఖపట్నం/అక్కిరెడ్డిపాలెం: అధికార యంత్రాంగం కాస్త ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో రెండు వారాల తరువాత జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. షీలానగర్ ప్రాంతంలో క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తమిళనాడు నుంచి మతప్రచారానికి 10 మంది మహిళల బృందం గత నెలలో నర్సీపట్నానికి వచ్చింది. వారిలో ఇద్దరికి కరోనా సోకడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారిద్దరూ ఆదివారం డిశ్చార్జ్ అవ్వగా.. గతంలో వారితో సన్నిహితంగా మెలిగిన మహిళకు తాజాగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో కరోనో కేసుల సంఖ్య 21కి చేరుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి విశాఖలో తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో పాజిటివ్ కేసు నమోదుకావడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కొంత మంది మతప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి గత నెల 13న ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలులో విశాఖకు వచ్చారు.
వారు నగరంలోనే కాకుండా నర్సీపట్నంలో మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇంతలో వారికి కరోనా లక్షణాలు ఉండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు వారిని ప్రభుత్వ ఛాతి ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారౖణెంది. దీంతో ఆ ఇద్దరి మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారితో ప్రార్థనల్లో పాల్గొన్న, సన్నిహితంగా మెలిగిన వారిని అధికారులు గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. ఇందులో షీలానగర్ ప్రాంతంలో ఒక కళాశాలలో క్వారంటైన్ సెంటర్‌లో ఉంటున్న మహిళకు కరోనా లక్షణాలు బయటపడడంతో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో గీతం ఆస్పత్రికి తరలించారు.
దాదాపు రెండు వారాల తర్వాత విశాఖలో మరో కేసు బయటపడటంతో జీవీఎంసీ అధికారులు, వైద్యులు షీలానగర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని స్ప్రేయింగ్‌తో పాటు ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 21 పాజిటివ్ కేసులు నమోదవగా ఆదివారం ఇద్దరు డిశ్చార్జ్ అయినవారితో కలిపి మొత్తం 18 మందికి కరోనా నయమైంది. తాజాగా డిశ్చార్జ్ అయిన వారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కావడంతో లాక్‌డౌన్ కారణంగా ప్రసుత్తం వారిని అక్కడకు పంపించే అవకాశం లేకపోవడంతో గీతం ఆస్పత్రిలోనే వేరే చోట కార్వంటైన్‌లో ఉంచారు. ప్రస్తుతం గీతం ఆస్పత్రిలో ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నారు. షీలానగర్ క్వారంటైన్‌లో 60 మంది కరోనా అనుమానితులు ఉన్నారు.
జిల్లాకు 5 వేల టెస్ట్ కిట్లు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): కరోనా వైద్య పరీక్షల నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన లక్ష కిట్లలో జిల్లాకు 5 వేలు కేటాయించారని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం సిరిపురం వీఎంఆర్‌డీఏ చి్రల్డన్స్ ఎరీనాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తోందని, భారత జాతి మనుగడను నిలబెట్టే ధ్యేయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం శ్రమిస్తున్నాయన్నారు. సచివాలయ సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేసి అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారన్నారు. విశాఖలో కరోనా కేసులు తగ్గించి చూపిస్తున్నారన్న విమర్శలను ఆయన ఖండించారు.
ఇక్కడి వైద్యులు, జిల్లా యంత్రాంగం పనితీరు వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. వైద్యులు రేయింబవళ్లు పనిచేయడంతో కేసులు తగ్గడంతో పాటు పాజిటివ్ వచ్చిన వారు త్వరగా కోలుకుంటున్నారన్నారు. కానీ ఇవేవీ పట్టని ఎల్లో మీడియా తక్కువ కేసులను చూపిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాసు్కల కొరత లేదని స్పష్టం చేశారు.
రెడ్ జోన్లలో ఈ నెల 20 నుంచి ఎలాంటి మినహాయింపులు లేవని, మిగతా జోన్లలో కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటుతో మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. జీవీఎంసీ పరిధిలో 98 వార్డులు, నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో మెరుగైన సదుపాయాలు
కలి్పస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment