* విద్యా సంవత్సరం ముగుస్తున్నా జీతాలకు నోచుకోని వైనం
* కాంట్రాక్ట్ లెక్చరర్లకూ ఐదు నెలలుగా జీతాలు నిల్
శ్రీకాకుళం న్యూకాలనీ: సర్కారీ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లగా పనిచేస్తున్న వారు ఏడాదిగా జీతాలకునోచుకోలేదు. దీంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడంతో గెస్ట్ లెక్చరర్లకు ఏడాదిగా, కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఐదు నెలలుగా జీతాల్లేవు.
జిల్లాలో పరిస్థితి ఇలా
జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో కలిపి సుమారు 61 లెక్చరర్ల పోస్టులకు అధ్యాపకులు లేకపోవడంతో ఆ ఖాళీలను గత విద్యాసంవత్సరం మాదిరీగానే అతిథి అధ్యాపకులు (గెస్ట్ లెక్చరర్లు)తో భర్తీ చేయాలని ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ భావించారు. దీంతో విశ్రాంత అధ్యాపకులతోపాటు గతం లో ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసిన, అనుభవజ్ఞులైన అధ్యాపకులను కమిషనర్ సూచనల మేరకు నియమించారు.
పీరియడ్‌కు రూ.150 చొప్పున నెలకు గరిష్టంగా రూ.10 వేలకు మించకుండా గౌరవ భృతి చెల్లిస్తామంటూ.. డెమో ఇచ్చిన తర్వాత విద్యార్థుల సమ్మతి మేరకు వారిని నియమించారు. 2015 జూలై నెలాఖరు నుంచి ఆగస్ట్ నెల వరకు ఈ నియామకాలు జరిగాయి. సంక్రాంతికి రెండు నెలల జీతాలు చెల్లిస్తామంటూ బిల్లులు, వర్క్‌డన్ స్టేట్‌మెంట్లు సిద్ధం చేయించా రు. తీరా ప్రభుత్వం నుంచి నిధులు రాక ఉసురుమనిపించా రు. కళాశాలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలంటూ అక్కడి ప్రిన్సిపాళ్లు మెళికలుపెట్టిన భరించారు. అనుభవంతో విద్యార్థులకు క్లాసులు చెప్పి, సకాంలో సిలబస్‌లు సైతం ముగించారు. పరీక్షలకు సిద్ధం చేశారు. ఇన్నిచేసినా విధుల్లో చేరిన గెస్ట్ లెక్చరర్లకు ఇంతవరకు దమ్మిడీపైసా కూడా చెల్లించలేదు.
కాంట్రాక్ట్ లెక్చరర్లదీ అదేదారి..
జిల్లాలోని 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 390 మంది వరకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు సైతం గత ఐదు నెల లుగా జీతాలు చేతికందక అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు కేటాయింపు జరగకపోవడమే జీతాలు చెల్లించకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అం తర్జాతీయస్థాయిలో విద్యప్రమాణాలు అందిస్తామని డాబు లు చెబుతున్న సర్కారు కనీసం జీతాలను సైతం సకాలంలో చెల్లించకపోతుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నెలాఖరులోగా చెల్లిస్తాం
గెస్ట్ లెక్చరర్లకు ఇంతవరకు జీతాలు చెల్లింపులు కాని మాట వాస్తవమే. ప్రభుత్వ నుంచి నిధులు కేటాయిం పులు జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య. వీరితోపాటు కాంట్రాక్ట్ లెక్చరర్లకు పెండింగ్‌లో ఉన్న జీతాలను త్వరలో చెల్లిస్తాం. బిల్లులు పెట్టాలని ప్రిన్సిపాళ్లకు ఇప్పటికే సూచిం చాం. ఈ నెలాఖరులోగా కచ్చితంగా చెల్లింపులు చేస్తాం.
- ఆర్.పున్నయ్య, డీవీఈవో, ఇంటర్మీడియెట్ విద్య
అతిథి అధ్యాపకులకు అన్యాయం!
Published Sat, Mar 12 2016 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM
Advertisement
Advertisement