ఇదీపాయే! | united agitation become severe | Sakshi
Sakshi News home page

ఇదీపాయే!

Published Wed, Mar 12 2014 3:49 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

united agitation become severe

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర : విభజన అనంతరం పార్టీ జెండాను భుజానికెత్తుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి కూడా దక్కకుండాపోయింది. విభజన అనంతరం సీఎం కుర్చీ దక్కించుకునే ప్రయత్నం చేసిన ఆనంకు బీసీ కోటాలో రఘువీరారెడ్డి పీసీసీ చీఫ్ పదవి ఎగరేసుకుపోవడం మింగుడుపడని అంశం. కొణిజేటి రోశయ్యను సీఎంగా తప్పించిన సమయంలో మంత్రి హోదాలో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి సీఎం పదవి కోసం గట్టిగానే ప్రయత్నించారు.
 
 అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పదవి ఎగరేసుకుపోయారు. దీంతో అసంతృప్తి చెందిన ఆనంకు ఆర్థిక శాఖను ఇచ్చి పార్టీ హైకమాండ్ జోకొట్టింది. రాష్ర్ట విభజన అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆనం మరోసారి సీఎం పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారు. కొందరు సహచర మంత్రులతో కలసి రాష్ట్రపతి పాలన విధించవద్దని సోనియాకు విన్నవించుకున్నారు.
 
 పార్టీ హైకమాండ్ రాష్ట్రపతి పాలనకే నిర్ణయం తీసుకోవడంతో ఆనం ఆశలు ఆవిరయ్యాయి. సీమాంధ్రకు ప్రత్యేకంగా పీసీసీని నియమిస్తే ఆ అవకాశమైనా తనకు దక్కించుకునేందుకు ఆనం ఆశపడ్డారు. రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పవచ్చనుకున్నారు. అయితే బీసీ కోటా లో మాజీ మంత్రి రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి తన్నుకుపోవడంతో ఆనం రామనారాయణరెడ్డికి మరోసారి ఆశాభంగం ఎదురైంది. అయితే ఏపీ మేనిఫెస్టో కమిటీ చైర్మనగా ప్రకటించి చల్లబరిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement