సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్రకు మద్దతుగా విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ జేఎసీ ఆధ్వర్యంలో ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు శనివారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి విద్యుత్ ఉద్యోగులు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయం, కృష్ణాపురం ఠాణా, గాంధీరోడ్డు మీదుగా నాలుగుకాళ్ల మండపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
నాలుగుకాళ్ల మండపం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. విద్యుత్ ర్యాలీ నిర్వహించిన పరిసర ప్రాంతాల్లో గాంధీరోడ్డు, తిలక్‌రోడ్డు, కృష్ణాపురం ఠాణా, టౌన్‌క్లబ్ ఏరియా, తీర్థకట్టవీధి, చిన్నబజారు వీధుల్లో విద్యుత్ నిలిపేశారు. విభజన వద్దు, సమైక్యాంధ్రాముద్దు అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో జేఎసీ నాయకులు అశోక్‌కుమార్, మునిశంకరయ్య, చలపతి, బాలాజి, పద్మావతీ మహిళా వర్సిటీ ప్రొఫెసర్ వరలక్ష్మి, మెడికల్ జేఏసీ డాక్టర్లు సుధారాణి, కృష్ణప్రశాంతి పాల్గొన్నారు.
విడిపోతే.. బతుకంతా చీకటే
Published Sun, Sep 15 2013 3:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement