NTR circle
-
బెజవాడలో వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆందోళన : అరెస్ట్
విజయవాడ : విజయవాడలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జ్ భవకుమార్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళనకు దిగారు. దీంతో పోలీసుల వారి ఆందోళనను భగ్నం చేశారు. భవకుమార్తోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పడమట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్లో వారిని వంగవీటి రాధా పరామర్శించారు. -
విడిపోతే.. బతుకంతా చీకటే
సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్రకు మద్దతుగా విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ జేఎసీ ఆధ్వర్యంలో ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు శనివారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి విద్యుత్ ఉద్యోగులు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయం, కృష్ణాపురం ఠాణా, గాంధీరోడ్డు మీదుగా నాలుగుకాళ్ల మండపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాలుగుకాళ్ల మండపం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. విద్యుత్ ర్యాలీ నిర్వహించిన పరిసర ప్రాంతాల్లో గాంధీరోడ్డు, తిలక్‌రోడ్డు, కృష్ణాపురం ఠాణా, టౌన్‌క్లబ్ ఏరియా, తీర్థకట్టవీధి, చిన్నబజారు వీధుల్లో విద్యుత్ నిలిపేశారు. విభజన వద్దు, సమైక్యాంధ్రాముద్దు అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో జేఎసీ నాయకులు అశోక్‌కుమార్, మునిశంకరయ్య, చలపతి, బాలాజి, పద్మావతీ మహిళా వర్సిటీ ప్రొఫెసర్ వరలక్ష్మి, మెడికల్ జేఏసీ డాక్టర్లు సుధారాణి, కృష్ణప్రశాంతి పాల్గొన్నారు. -
విభజనేందిరో.. మీ స్వార్థమేందిరో
సాక్షి, కర్నూలు: ఉద్యమం ఉప్పెనవుతోంది. సమైక్యవాదులు కదనరంగంలో నిర్విరామ పోరాటం సాగిస్తున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు వారి స్థాయిలో తీవ్రత పెంచుతున్నారు. గురువారం జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల కేంద్ర మంతి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ ఇళ్లను ముట్టడించారు. రాష్ట్రం ముక్కలవుతున్నా నాయకులు రాజీనామాలు చేయకుండా ఎందుకు పదవులు పట్టుకుని వేళాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతకు ముందు నగరంలో పెద్ద ఎత్తున మోటార్ సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. జేసీబీ యజమానులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో 50 జేసీబీలతో ర్యాలీ చేపట్టారు. పశు సంవర్ధక శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారపేటలోని పశు వైద్యశాల నుంచి రాజ్‌విహార్, ఎన్టీఆర్ సర్కిల్ వరకు జై సమైక్యాంధ్ర బెలూన్లతో భారీ ర్యాలీ చేశారు. ఎన్టీఆర్ సర్కిల్లో అరగంట పాటు మానవహారం నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. గ్రంథాలయ సంస్థ, కలెక్టరేట్లోని స్టేట్ ఆడిట్ అధికారులు, ఉద్యోగులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు మహా ర్యాలీ కొనసాగింది. జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ, కేంద్ర హోంమంత్రి షిండే, దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మలను దున్నపోతులపై ఉరేగించారు. న్యాయవాదుల నిరాహార దీక్షలో కేంద్ర మంత్రి కోట్ల, టీజీ, ఎమ్మెల్యే మురళి కనపడటం లేదంటూ పోస్టర్లు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వ అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో రాజ్‌విహార్ సర్కిల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు మాస్ డ్రిల్ చేపట్టారు. అధ్యాపకులు కర్రసాము, నాన్చాక్ విద్యలు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఆదోనిలో రెండో రోజు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో.. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలేనిరాహార దీక్షలకు మద్దతుగా దూదేకొండ గ్రామస్తులు 20 మంది దీక్షలో కూర్చొన్నారు. దేవనకొండలో తాపీ వర్కర్లు వివిధ వేషధారణల్లో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటంతో నోటికి నల్లగుడ్డ కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సోమప్ప సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. -
సమైక్య సెగ కేంద్రానికి తాకాలి
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వానికి సమైక్యాంధ్ర సెగ తాకే విధంగా చేస్తే తప్ప దిగి రాదని దూదేకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అక్బర్‌బాషా, జిల్లా అధ్యక్షుడు పీరయ్య అన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న దీక్షా శిబిరాలను సందర్శించి దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి అత్యధికంగా 33 ఎంపీ స్థానాలను ఇచ్చిన రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని సీడబ్ల్యుసీ నిర్ణయించడం శోచనీయమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని తీసుకుందని విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు తమ పదవులను కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారే తప్ప రాష్ట్ర విభజనను చిత్తశుద్ధితో అడ్డుకోవడం లేదని ఆరోపించారు. విభజన వల్ల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం సాగునీటి విషయంలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో సైతం అవకాశాలు కోల్పోవాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తన కుమారుడిని ప్రధానమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర విభజనకు పాల్పడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి బాదుల్లా, ఉపాధ్యక్షుడు ఓబులేసు, నాయకులు రాజా, బాలు, నజీర్, కుళాయప్ప, మహబూబ్‌బాషా, గిరి తదితరులు పాల్గొన్నారు.