
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా 1996 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి జీ.వాణీమోహన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె జమ్మూ కశ్మీర్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు పరిశీలకులుగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమె సహకార శాఖ కమిషనర్‌గా, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో– ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రశాంత వాతావరణంలో వాటిని నిర్వహించడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment