నరకయాతన
నరకయాతన
పుట్టూరు(పార్వతీపురం రూరల్), : వేసవి రాకముందే పుట్టూరు గ్రామస్తులు తాగునీటికి ఇబ్బంది పడుతున్నా రు. గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం నుంచి అరకొర నీరు సరఫరా అవుతుండడంతో బిందెడు నీటికోసం గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. సంవత్సరం కిందట రూ.12 లక్షలతో గ్రామంలో రక్షిత మంచినీటి పథకం నిర్మించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ట్యాంకులోకి నీరు సక్రమంగా చేరడం లేదు. దీంతో కుళాయిల ద్వారా కూడా అరకొర నీరే సరఫరా అవుతోంది. గ్రామంలో సుమారు మూడు వేల మంది ప్రజలున్నారు. బోర్లు కూడా లేకపోవడం తో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ బోర్లపై ఆధారపడా ల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి నీటి పథకాని కి మరమ్మతులు చేపట్టి సరిపడా తాగునీ రు సరఫరా చేయాలని పలుమార్లు అధికారులు, పాలకులను కోరినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి మంచి నీటి పథకానికి మరమ్మతులు చేపట్టాల ని ప్రజలు కోరుతున్నారు.