
మండలాలకూ వీడియో కాన్ఫరెన్స్: సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టవ్యాప్తంగా అన్ని మండలాల్లోని అధికారులతో రాజధాని నుంచే నేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 1,126 మండల కార్యాలయాలు, 23 జిల్లాల్లోని ప్రధాన ప్రణాళికాధికారి కార్యాలయాలు, అన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్, ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు.
మీ-సేవలో 3 కోట్ల లావాదేవీల మైలురాయి దాటిన సందర్భాన్ని పురస్కరించుకుని మీ-సేవ చిహ్నాలతో కూడిన టీషర్టు, టోపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్‌జాజు కూడా పాల్గొన్నారు.