‘విజ్ఞాన్’ విజయోత్సాహం | 'Vigyan' victorious | Sakshi
Sakshi News home page

‘విజ్ఞాన్’ విజయోత్సాహం

Published Tue, Jun 10 2014 2:20 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

'Vigyan' victorious

ఎంసెట్ ఫలితాలలో విజ్ఞాన్ జూనియర్ కళాశాలల విద్యార్థులు అద్భుత ప్రతిత చూపినట్లు యాజమాన్యం తెలిపింది. 93 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్లు వివరించింది. గుంటూరు జిల్లాలోని వడ్లమూడి, పలకలూరు, ఎల్‌ఐసీ కాలనీ, హైదరాబాద్‌లోని కొండాపూర్, నిజాంపేట్, విశాఖపట్నంలోని అన్ని ప్రాంగణాలోనూ తమ విద్యార్థులు ఇదే స్థాయి ఫలితాలు సాధించినట్లు పేర్కొంది. తరగతి గదిలో 30 నుంచి 35 మంది విద్యార్థులు మాత్రమే ఉండటం, అన్ని వసతులతో కూడిన సువిశాల ప్రాంగణాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడి లేని బోధన ద్వారా ఉత్తమ ఫలితాలు దక్కించుకున్నట్లు విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య చెప్పారు.

జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, జేఈఈ మెయిన్స్‌లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. 30 ఏళ్లుగా ఇంటర్ విద్యలో విజ్ఞాన్ సాధిస్తున్న అపూర్వ విజయాలకు తమ విద్యా ప్రణాళికే కారణమని చెప్పారు. విజ్ఞాన్ సత్తా చాటిన విద్యార్థులు, ప్రేరణగా నిలిచిన అధ్యాపకులకు లావు రత్తయ్య, వైస్ చైర్మన్‌లు లావు శ్రీకృష్ణదేవరాయలు, రాణి రుద్రమదేవి అభినందనలు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement