నెల్లూరు(వేదాయపాళెం),న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం విజయ దశమి సంబరాలు అంబరాన్నంటాయి. భక్తులు ఉదయం నుంచి ఆలయాలకు చేరుకుని పూజలు నిర్వహించారు. ఇళ్లు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. వాహనాలను శుభ్రం చేసి పూజలు చేశారు. నెల్లూరులోని పురమందిరం వద్ద ఉన్న జ్యోతి విఘ్నేశ్వరాలయంలో వందలాది వాహనాలు పూజలు అందుకున్నాయి. నవరాత్రులు ముగియడంతో టెంకాయలు కొట్టి, పూర్ణాహుతి సమర్పించే వారితో ఆలయాల్లో ఆధ్యాత్మికత శోభిల్లింది.
నేడు కూడా దశమిపూజలు
విజయదశమి పర్వదిన వేడుకలు జిల్లాలో సోమవారం కూడాజరగనున్నాయి. దశమి గడియలు ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమవడంతో అప్పటి నుంచి పూజలు మొదలుపెట్టారు. సోమవారం ఉదయం 11 గంటల వరకు దశమి గడియలు ఉండడంతో పూజలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం జిల్లాలోని ప్రధాన కూడళ్లు జనంతో రద్దీగా మారాయి.
‘దశమి’ సంబరం
Published Mon, Oct 14 2013 2:23 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement