
సాక్షి, అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తే నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ జవాబిచ్చారని చంద్రబాబునాయుడు సంబరపడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘అదిరిందయ్యా చంద్రం’ అన్నారని చంకలు గుద్దుకుంటున్నారని ట్వీట్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన సలహా ఏమిటంటే కరోనా లెక్కలపై డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలట.. అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన కొంప ముంచిన బోర్డును కేంద్రంలో కూడా అమలు చేయాలని చెప్పాడట. వాళ్లూ మునగాలని కోరుకుంటున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.
‘ప్రధాన మంత్రి కార్యాలయానికి మీరు రాసిన లేఖ అందింది. ప్రస్తావించిన అంశాలను పరిశీలించాల్సిందిగా నా సహచరులను కోరతానంటూ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాసిన జవాబును ప్రదర్శించే దౌర్భాగ్యం ఏమిటి బాబూ? ఎవరు రాసినా వాళ్లిలాగే ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు చేస్తారు. నాకు రిప్లై ఇచ్చారహో అని మొత్తుకున్నట్టుగా ఉంది’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment