నాని, బోండాపై చర్యలు తీసుకోండి: ఏపీసీసీ
Published Sun, Mar 26 2017 6:05 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
విజయవాడ: ఏపీ రవాణాశాఖ కమిషనర్‌పై దాడిచేసిన ఎంపీ కేశినేని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమపై చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే అధికారులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కమిషనర్ తాను నోరు తెరిస్తే చాలా అక్రమాలు బయటపడతాయని అన్నారు. ఆ నిజాలేంటో చెప్పాలి. ఏ ఒత్తిడితో వాస్తవాలను అణచివేస్తున్నారో చెప్పాలన్నారు. వనజాక్షిపై దాడి చేసిన వారిని వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి రవాణా శాఖ కమిషనర్‌పై దాడి చేసినవారిని కూడా వెనకేసుకొస్తారా లేక చర్యలు తీసుకుంటారా అని గౌతమ్ ప్రశ్నించారు.
Advertisement
Advertisement