విశాఖ రోడ్లు దేశంలోనే బెస్ట్‌ | Visakha Roads is the best in the country | Sakshi
Sakshi News home page

విశాఖ రోడ్లు దేశంలోనే బెస్ట్‌

Published Thu, Feb 6 2020 6:35 AM | Last Updated on Thu, Feb 6 2020 6:35 AM

Visakha Roads is the best in the country - Sakshi

ట్వీట్‌లో పోస్ట్‌ చేసిన విశాఖ బీచ్‌రోడ్డు ఫొటో

సాక్షి, విశాఖపట్నం : అందాల నగరి విశాఖపట్నం అంటే.. ఇష్టపడని వారుండరు. అందుకే.. ఏపీ, తెలంగాణ బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌ విశాఖ నగర అందానికి, ఇక్కడి రహదారులకు సలాం చేస్తున్నారు. అంతే కాదు.. విశాఖ వస్తున్న బ్రిటన్‌ దంపతులకు సైతం ఇదే విషయాన్ని బల్లగుద్ది మరీ చెప్పారు. ‘ద ట్రాన్స్‌ ఇండియా ఛాలెంజ్‌’లో భాగంగా బ్రిటన్‌కు చెందిన అలన్‌ బ్రాత్‌వెయిట్, పాట్‌ బ్రాత్‌వెయిట్‌ దంపతులు క్వీన్‌బీ కారులో భారత యాత్ర చేపట్టారు. ముంబై నుంచి బయలుదేరి హైదరాబాద్, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, అహ్మదాబాద్, న్యూఢిల్లీ వంటి ప్రధాన నగరాల్ని చుట్టేస్తున్నారు. రెండు రోజుల్లో విశాఖ చేరుకోనున్న ఈ దంపతులకు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ హై కమిషనర్‌ విశాఖ గొప్పదనానికి ఎవరైనా దాసోహం అనాల్సిందేనని కితాబిచ్చారు. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
‘రెండు రోజుల్లో క్వీన్‌ బీ విశాఖ బీచ్‌ రోడ్డులోకి ప్రవేశించనుంది. మీరు ట్రాన్స్‌ ఇండియా ఛాలెంజ్‌లో తిరుగుతున్న నగరాలన్నింటిలోనూ విశాఖ రోడ్లు ది బెస్ట్‌ అని నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. మీరు నా మాటతో ఏకీభవిస్తారు. అంతటి అందమైన నగరంలో రెండు రోజుల్లో పర్యటించనున్న మీరు విశాఖ రోడ్ల గురించి నా మాటలతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. మీ తీర్పు కోసం ఎదురు చూస్తుంటాను’ అంటూ ట్వీట్‌ చేశారు. విశాఖ బీచ్‌ రోడ్డు ఫొటోతో పాటు బ్రాత్‌వెయిట్‌ దంపతుల ఫొటోను ట్వీట్‌లో పోస్ట్‌ చేశారు. అండ్రూ ఫ్లెమింగ్‌ ట్వీట్‌కు విశేష స్పందన వస్తోంది. రీట్వీట్స్‌ చేస్తున్న చాలామంది.. ఫ్లెమింగ్‌ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement