రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సాంకేతిక కారణాల దృష్ట్యా న్యూఢిల్లీ – విశాఖపట్నం మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 16న రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్‌చార్జ్ పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని విజ్ఞప్తి చేశారు.
గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
తాటిచెట్లపాలెం (విశాఖ): విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే (12727) గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు విశాఖ నుంచి శుక్రవారం సాయంత్రం 5.20కి హైదరాబాద్‌కు బయల్దేరింది. ప్లాట్‌ఫాం దాటిన వెంటనే కేరేజ్ అండ్ వేగన్ రోలింగ్ సిబ్బంది అప్పారావు, వెంకటరావు.. గార్డ్ బోగీలో ఉన్న హ్యాండ్ బ్రేక్ పట్టేయడాన్ని గుర్తించారు. ఈ బ్రేక్ పట్టేయడం వల్ల అప్పటికే ట్రాక్ కొన్ని మిల్లీమీటర్ల మేర గాడి తప్పింది. విషయాన్ని రోలింగ్ సిబ్బంది సూపరిండెంట్ ఇంజనీర్ అచ్యుతరావుకు తెలిపారు. ఆయన వాకీ టాకీ ద్వారా గోదావరి ఎక్స్‌ప్రెస్ గార్డును, డ్రైవర్‌ను అప్రమత్తం చేసి వెంటనే రైలును ఆపాలని ఆదేశించారు. సాంకేతిక సిబ్బంది అక్కడికి చేరుకుని హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి, వాక్యూమ్ క్లియర్ చేసి రైలును పంపించారు.
గార్డ్ బోగీ బ్రేక్ పట్టేసిన చిత్రం
Comments
Please login to add a commentAdd a comment