
సాక్షి, విశాఖపట్నం: ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి ఆదివారం ఉదయం బయలుదేరిన కాసేపటికే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. బ్రేక్ పట్టేయ డంతో బీ1 బోగీ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. రైలు నుంచి అంతా దిగిపోయారు. సిబ్బంది వెంటనే రైలు ని లిపివేసి మంటలు ఆర్పేశారు. సమస్య పరిష్కరించడంతో రైలు యథావిధిగా విశాఖకు పయనమైంది. కాగా, ప్రమా ద సంఘటన టీవీల్లో చూసి విశాఖ నగరం ఉలిక్కిపడింది. నగరంలోని ప్రయాణికులు బంధువులు ఆందోళన కు గురయ్యారు.
ట్రైన్‌లో వస్తున్న తమ బంధువుల పరిస్థితి ఎలా ఉంది, తమవాళ్లు ఏమయ్యారోనని ఆరా తీసేందుకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చాలా మంది చేరుకున్నారు. రైల్వే స్టేషన్‌కు ఉదయం నుంచి ఫోన్లు వెల్లువెత్తాయి. ఎవరికీ చిన్నపాటి గాయం కూడా కాలేదని సమాచారం అందించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రైన్ నిర్వహణపై ఆది నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నా ఈస్ట్‌కోస్ట్ అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది మే 21న కూడా ఏపీ ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సమీపంలో హెటెన్షన్ వైరు నుంచి మంటలు వ్యాపించి బీ6, బీ7 కోచ్‌లలో అగ్రి ప్రమాదంలో చిక్కుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment