విశాఖలో పట్టాలు తప్పిన గూడ్స్ | vishaka-kirandul passenger canceled | Sakshi
Sakshi News home page

విశాఖలో పట్టాలు తప్పిన గూడ్స్

Published Wed, Jun 17 2015 10:17 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

vishaka-kirandul passenger canceled

విశాఖ: విశాఖపట్నం జిల్లా కరకవలస- బొర్రా రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం ఉదయం గూడ్సు రైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన గూడ్సురైలు బొర్రా ర్వేస్టేషన్ దాటగానే పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాలు తప్పి అడ్డంగా పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే తూర్పు మధ్య రైల్వే అధికారులు, సిబ్బంది వచ్చి రైలు మార్గాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడినందున విశాఖపట్నం నుంచి కొరడోల్ వెళ్లే ప్యాసింజర్ రైలును రద్దుచేశారు. పట్టాలు సరిచేసిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement