
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల పాటు విశాఖ హోరెత్తింది. విశాఖ ఉత్సవ సంబరం.. అంబరాన్ని తాకింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌దీప కాంతులతో.. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. వీనుల విందైన ఎస్‌ఎస్ థమన్ మ్యూజికల్ నైట్‌తో ఉత్సవ్ ముగింపు అదిరిపోయింది. రెండు రోజుల పాటు కన్నుల పండువగా సాగిన ఉత్సవ్‌ని లక్షలాది మంది ప్రజలు వీక్షించి ఆనంద పరవశులయ్యారు. డాక్టర్ వైఎస్సార్ సెంట్రల్ పార్కులో నిర్వహించిన ఫ్లవర్ షోని తిలకించేందుకు ఆదివారం దాదాపు లక్ష మంది వచ్చారు. తీరంలో ఎస్‌ఎస్ థమన్ మ్యూజికల్ నైట్ ఉర్రూతలూగించింది. సుమ యాంకరింగ్‌తో మెస్మరైజ్ చెయ్యగా.. త్రీ ఓరీ లైవ్ బ్యాండ్ మొదలవగానే ప్రేక్షకులు స్టెప్పులతో అదరగొట్టారు. సినీనటుడు వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్‌చంద్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment