వరంగల్ స్పోర్ట్స్/కేఎంసీ/ఎన్జీవోస్ కాలనీ/కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : దేశంలోని యువశక్తిని మేల్కొల్పిన స్వామి వివేకానందుడి స్ఫూర్తితో యువతరం జాతీయభావాన్ని పెంపొందించుకోవాలని వివేకానంద 150వ జయంతి ఉత్సవ సమితి జాతీయ ఉపాధ్యక్షుడు, అఖిల భారత సాహిత్య పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వివేకానందుడి 150వ జయంతి ఉత్సవాలలో భాగంగా నగరంలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ ద నేషన్’ పేరిట భారీ మారథాన్ నిర్వహించారు.
ఆర్ట్ కళాశాల నుంచి కలెక్టర్ కిషన్ యూత్ రన్‌ను జెండాఊపి ప్రారంభించారు. ఎస్‌డీఎల్‌సీఈ క్రాస్ నుంచి కేయూరిజిస్ట్రార్ ప్రొఫెసర్ సాయిలు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. రామస్వామి కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ప్రిన్సిపాల్ డాక్టర్ రాంచందర్ దరక్ జెండా ఊపిప్రారంభించారు. ఈ మూడు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువకులు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు. ముఖ్య వక్తగా విచ్చేసిన కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ చికాగోలో మహాసభలో వివేకానందుడు..
ప్రపంచానికి భారతదేశ ఖ్యాతిని తెలియజెప్పిన రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. సోదర, సోదరీమణులారా.. అనే మాటలతో ప్రారంభించిన ఆయన ప్రసంగాన్ని పాశ్యాత్యులు మొత్తం విన్నారన్నారు. అప్పటి నుంచే హిందూ, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత పాశ్చాత్యులకు కలిగిందన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువత దేశానికి కావాలని వివేకానందుడు పిలుపునిచ్చారన్నారు.
కానీ ఆయన కలలు కల్లలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామీజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నూతన ఉత్తేజంతో, జాతీయభావంతో దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన వివేకానందుడి ఫ్లెక్సీల వద్ద విద్యార్థులు, యువకులు పూలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డాక్టర్ విశ్వనాథం, జూలపల్లి కరుణాకర్, కానిగంటి విశ్వనాథ్‌జీ, బొల్లంపల్లి మురళీధర్‌రావు, బీజేపీ నాయకులు మార్తినేని ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశ భవిష్యత్‌ను నిర్ణయించేది యువతే
దేశ భవిష్యత్‌ను నిర్ణయించి పురోభివృద్ధి సాధించేందుకు యువకులే ముందు వరుసలో ఉండాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంచందర్ దరక్ సూచించారు. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ప్రారంభమైన రన్‌ఫర్‌ది నేషన్ మారథాన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాలు నిం డిన యువతీ యువకులు పెద్ద సంఖ్యలో మా రథాన్‌లో పాల్గొంటున్నారని, దేశ భవిష్యత్‌లో యువతే కీలకపాత్ర వహించాలని తెలిపారు. దే శ భవితకు యువత పరుగు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్ర ముఖ న్యాయవాదులు అల్లం నాగరాజు, గుడిమల్ల రవికుమార్, పీడీ ప్రభాకర్‌రెడ్డి, కళాశాలకు చెందిన మెడికోలు, నగరానికి చెం దిన ప్రముఖ యువకులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని కలెక్టర్ జి.కిషన్ పిలుపునిచ్చారు. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో వివేకానందుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ‘రన్ ఫర్ ది నేషన్’ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు కలెక్టర్ మాట్లాడుతూ యువత దేశ సేవలో భాగస్వాములు కావాలని స్వామి వివేకానందుడు యువతకు పిలుపునిచ్చారన్నారు. అభివృద్ధికి పునాది రాళ్లుగా యువత దోహదపడాలన్నారు. మనసు బాగుండాలంటే శరీరం కూడా బాగా ఉండాలన్నారు. శరీర దారుఢ్యానికే ఈ మారథాన్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
యువశక్తిని మేల్కొలిపిన వివేకానందుడు
Published Thu, Sep 12 2013 1:40 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM
Advertisement
Advertisement