హైదరాబాద్: కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓ పరీక్ష ప్రారంభమయింది. 1657 వీఆర్వో పోస్టులకు 13 లక్షల 13 వేల దరఖాస్తు చేసుకున్నారు. 4305 వీఆర్‌ఎ పోస్టులకు 69 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 239 పట్టణాల్లో 3687 కేంద్రాల్లో వీఆర్వో పరీక్ష, 195 కేంద్రాల్లో వీఆర్‌ఎ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
వీఆర్వో పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12 వరకు జరుగుతుంది. మధ్యాహ్నం మూడు నుంచి 5 గంటల వరకు వీఆర్ఏ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు 65 వేల మందిని పర్యవేక్షకులుగా నియమించారు.737 ప్రత్యేక ఫ్లయింగ్ స్వాడ్స్ బృందాలు పని చేస్తున్నాయి. 25 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. అక్రమాలకు తావు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 20న ఫలితాలను విడుదల చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలాఖరులోగా పోస్టింగ్ ఇస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఓ పరీక్ష ప్రారంభం
Published Sun, Feb 2 2014 10:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement