స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరణ | we dont have intention to remove speaker: ys jaganmohan reddy | Sakshi
Sakshi News home page

స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరణ

Published Fri, Mar 27 2015 1:32 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరణ - Sakshi

స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరణ

హైదరాబాద్: స్పీకర్పై అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు  జగన్మోహన్రెడ్డి సభలో మాట్లాడుతూ స్పీకర్ను దించేయాలన్న ఉద్దేశ్యంతో అవిశ్వాస తీర్మానం పెట్టాలని అనుకోలేదని అన్నారు. సభ తీరు, సభలో జరిగిన వ్యవహారాలు తమను తీవ్రంగా బాధపెట్టాయని, సభాపతి స్థానంలో ఉన్న మీరు(స్పీకర్) మాకు న్యాయం చేస్తారని అనుకున్నామని చెప్పారు. తమ దగ్గర ఉన్న సభ్యులు 67మందేనని, వారితో మేం స్పీకర్ను పదవిలోనుంచి దించేయాలని మేం అనుకోలేదని చెప్పారు.

గతంలో చంద్రబాబునాయుడు ఇలా వ్యవహరించారో లేదో తెలియదని ప్రస్తుతం సభలో పరిస్థితులు, పరిణామాలు మాత్రం తమను తీవ్రం బాధించాయని చెప్పారు. స్పీకర్గా తమ పేరును ప్రతిపాదించిన వెంటనే ఏకగ్రీవంగా అంగీకరించామని, సాంప్రదాయబద్ధంగా నడుచుకుని తమను సీట్లో కూర్చోబెట్టామని గుర్తుచేశారు. తమపై మాకు ఎంతో విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పారు. తమతో బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు సంప్రదింపు జరిపారని సభలో తెలియజేశారు. ఆయన ప్రతిపాదనకు తాము అంగీకరిస్తున్నట్లు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మళ్లీ తాము బాధపడకుండా చూసుకుంటారనే విశ్వాసంతోనే అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకుంటున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement