తెలంగాణ ప్రభుత్వంపై న్యాయపోరాటం: రావెల
తెలంగాణ ప్రభుత్వంపై న్యాయపోరాటం: రావెల
Published Wed, Jul 2 2014 4:16 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే తెలంగాణ ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని రావెల హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఇకమీదట పటిష్టంగా అమలు చేస్తామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే విత్తనాల సబ్సీడిని పెంచే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోందని రావెల కిషోర్ బాబు అన్నారు.
Advertisement
Advertisement