మళ్లీ ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం:అశోక్ బాబు | we ready to fight back over bifurcation, says ashok babu | Sakshi
Sakshi News home page

మళ్లీ ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం:అశోక్ బాబు

Published Thu, Nov 14 2013 5:21 PM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

మళ్లీ ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం:అశోక్ బాబు

మళ్లీ ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం:అశోక్ బాబు

హైదరాబాద్: విభజన బిల్లు రాజ్యాంగ విరుద్దంగా జరుగుతోందని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిచి అన్ని అంశాలపై ఏకాభిప్రాయం లేదని, కేంద్రం దూకుడుగా వ్యవరించి రాష్ట్ర విభజనను చేస్తోందన్నారు.ఈ నెల 16వ తేదీన జీఓఎం అంశాలపై హైదరాబాద్ లో ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అశోక్ బాబు తెలిపారు. కాగా, 24 వ తేదీన ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యి తదుపరి కార్యచరణను చర్చిస్తామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరోకసారి ముందుకు తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముసాయిదా బిల్లు వచ్చినప్పుడు సుప్రీం కోర్టులో కేసు వేస్తామన్నారు. రాష్ట్ర విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే, అసెంబ్లీ ప్రారంభం రోజునే సమ్మె ప్రారంభిస్తామని అశోక్ బాబు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement