సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభ ఏర్పాట్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పార్టీ జిల్లా నేతలతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమై చర్చించారు. సభను విజయవంతం చేయాల్సిన ఆవశ్యకతను గురించివారికి వివరించారు. జగన్‌తో సమావేశం ముగిశాక జిల్లా నేతలందరూ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై కార్యాచరణను రూపొందించుకున్నారు. పార్టీ నేతలు బి.జనార్దన్‌రెడ్డి, వడ్డేపల్లి నర్సింగ్‌రావు, జంపన ప్రతాప్, పి.శ్రీనివాసులునాయుడు, కె.అమృతాసాగర్, రాచమల్ల సిద్ధేశ్వర్, దేప భాస్కర్‌రెడ్డి, సంజీవరావు, ధన్‌పాల్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కొలను శ్రీని వాస్‌రెడ్డి, రూపానందరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, ఇ.సి.శేఖర్‌గౌడ్, ఎ.విష్ణువర్థన్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, వెంకటప్రసాద్, సరోజ్‌రెడ్డి, సునీతారెడ్డి, రాజేందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, దశరథ్‌గౌడ్, ఎ.శ్రీనివాసరావు, ఓబుళరెడ్డి, వెంకట్రావ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.