
'చంద్రబాబు దొరికారు.. కేసీఆర్ దొరకలేదు'
ఢిల్లీ:ఓటుకు కోట్లు కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) వేస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దొరకలేదని దిగ్విజయ్ ఎద్దేవా చేశారు. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో మాట్లాడింది చంద్రబాబా కాదా అన్నది ఆయనే స్పష్టం చేయాలన్నారు.