వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూరదృష్టి గల నాయకుడని ఆ పార్టీ నేత, కడప నగర మాజీ మేయర్ రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూరదృష్టి గల నాయకుడని ఆ పార్టీ నేత, కడప నగర మాజీ మేయర్ రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. మంగళవారం రవీంద్రనాథ్ రెడ్డి అనంతపురం విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో 14 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే తెలంగాణ అంశం తెరపైకి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.ఆ మహానేత మృతితో తెలంగాణ తెరపైకి వచ్చిందని తెలిపారు.