
ఏపీ డీజేపీ ఠాకూర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ : విధి నిర్వహణలో అమరులైన వారి సంస్మరణ కోసం రేపు విజయవాడలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ డీజీపీ ఆర్వీ ఠాకూర్ తెలిపారు. ప్రతీ ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. దానిలో భాగంగానే గత వారం రోజులుగా రాష్ట్రంలో విద్యార్థులకు వ్యసరచన వంటి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. దేశ వ్యాప్యంగా ఈ ఏడాది వివిధ ఘటనల్లో 440 మందికి పైగా మృతి చెందారని.. వీరిలో ఆరుగురు తెలుగు వారు ఉన్నారని డీజీపీ ప్రకటించారు. అమరులైన కుటుంబాలకు 3.85 కోట్లు అందజేశామని తెలిపారు.
పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నామని, హెల్త్ క్యాంపులను నిర్వహించి అనేక మందికి ఆరోగ్యాలను కాపాడే చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. హోంగార్డ్స్ సంక్షేమం కోసం, ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలో పోలీస్ వెల్‌నెస్ సెంటర్లు, ఫిట్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment