DGP Thakur
-
‘పోలీస్ జాగిలం కూడా సైనికుడిలా పని చేస్తుంది’
సాక్షి, అమరావతి : మంగళగిరి ఆరవ బెటాలియన్‌లో జాగిలాల శిక్షణ ముగింపు సభకు ముఖ్య అతిథిగా డీజీపీ ఠాకూర్ హాజరయ్యారు. 18వ బ్యాచ్ కింద 30జాగిలాలకు వివిధ అంశాల్లో పోలీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ ఠాకూర్ మాట్లాడుతూ..'శిక్షణ పొందిన జాగిలాలు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. జాగిలాలకు మంచి శిక్షణ అందించిన వారిని అభినందిస్తున్నా. పోలీస్ విధుల్లో సిబ్బందే కాదు.. జాగిలాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవడంలో జాగిలాల పని తీరు అభినందనీయం. ఆధారాలు లేని ఎన్నో కేసులను కూడా జాగిలాల కారణంగా చేధించారు. బాంబులను పసిగట్టి, నిర్వీర్యం చేసేందుకు జాగిలాలు ఎంతో సహకరిస్తాయి. సమాజంలో ప్రజల భద్రతలో పోలీస్ జాగిలం కూడా సైనికుడిలా పని చేస్తుంది. 30జాగిలాలకు శిక్షణ పూర్తి కావడంతో వివిధ విభాగాలకు అప్పగిస్తున్నాం' అని తెలిపారు. -
సిటీ బస్సులో కాల్పులు
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భద్రతా విధులు నిర్వర్తించే ఓ హెడ్ కానిస్టేబుల్ విచక్షణ కోల్పోయాడు. సిటీ బస్సులో ఫుట్‌బోర్డుపై ప్రయాణించడమే కాకుండా లోపలకు జరగాలంటూ కోరిన సహచర ప్రయాణికుడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో అనాలోచితంగా తన సర్వీస్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. రంగంలోకి దిగిన హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు. విచక్షణ కోల్పోయి... ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన శ్రీనివాస్ నాయుడు (59) ఆ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా డెప్యుటేషన్‌పై ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో (ఏపీ ఐఎస్‌డబ్ల్యూ) విధులు నిర్విర్తిస్తున్నాడు. ఏపీకి చెందిన ప్రముఖులకు, రాజకీయ/కీలక కార్యాలయాలకు ఈ విభాగం భద్రత కల్పిస్తుంటుంది. ఏడాదిగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలసి కూకట్‌పల్లిలో ఉంటున్నారు. గురువారం ఉదయం విధులకు హాజరైన శ్రీనివాస్... తన జీతం డబ్బు డ్రా చేసుకోవడానికి 10.30 గంటలకు పంజాగుట్టలో ఉన్న ఆంధ్రా బ్యాంక్‌కు వెళ్లారు. అక్కడ పని ముగించుకొని తిరిగి విధులకు వెళ్లేందుకు పంజాగుట్ట హిమాలయ బుక్‌హౌస్ వద్ద ఉన్న బస్టాప్‌లో కంటోన్మెంట్ డిపోకు చెందిన 47సీ (సికింద్రాబాద్ నుంచి మణికొండ) రూట్ నంబర్ బస్సు ఎక్కారు. అయితే ఆయన బస్సు ఫుట్‌బోర్డుపైనే నిలబడి ఉండటంతో మరో స్టాప్ వద్ద ఓ చానల్ కెమెరామెన్ బస్సు ఎక్కుతూ శ్రీనివాస్‌ను లోపలకు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో శ్రీనివాస్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి తన నడుముకు ఉన్న .9 ఎంఎం సర్వీస్ పిస్టల్ తీసి పైకి గురిపెట్టి బెదిరింపు ధోరణిలో ట్రిగ్గర్ నొక్కారు. అప్పటికే ఆ ఆయుధం కాగ్ (తూటా పేలేందుకు సిద్ధమై ఉండటం) అయి ఉండటంతో ట్రిగ్గర్ నొక్కగానే పెద్ద శబ్దం చేస్తూ టాప్‌లో నుంచి దూసుకుపోయింది. అయితే బస్సు టైరు పేలిందేమోనని డ్రైవర్ బస్సును పక్కకు ఆపగా శ్రీనివాస్ వెంటనే బస్సు దిగి పంజాగుట్ట చౌరస్తా వైపు పరిగెత్తారు. బస్సులో వచ్చిన శబ్దంపై సహచర ప్రయాణికుల్ని ఆరా తీయగా ఓ వ్యక్తి కాల్పులు జరిపారని, బస్సు టాప్‌లోంచి తూటా దూసుకుపోయిందని వారు చూపించారు. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ దుస్తులు వేసుకొని పోలీస్‌లా ఉన్నారని తెలిపారు. దీంతో డ్రైవర్, కండక్టర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు మణికొండ వరకు వెళ్లి ప్రయాణికుల్ని గమ్యస్థానానికి చేర్చి తిరిగి డిపోకు చేరుకున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. బస్సు పైకప్పులోకి దూసుకెళ్లిన బుల్లెట్, బస్సు దిగి పరిగెడుతున్న శ్రీనివాస్ సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు... ఈ ఘటనపై దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు కండక్టర్, డ్రైవర్‌తోపాటు సదరు చానల్ కెమెరామెన్‌ను కూడా విచారించారు. కాల్పులు జరిపింది పోలీసు విభాగానికి చెందిన వ్యక్తిగా అనుమానించారు. హిందూ శ్మసాన వాటిక వద్ద బస్సు దిగిన ఆ వ్యక్తి తిరిగి వెనక్కి వచ్చినట్లు తేలడంతో ఆ మార్గంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో రికార్డు అయిన అనుమానితుడి ఫీడ్ నుంచి ఫొటోలు సంగ్రహించారు. వాటి ఆధారంగా అతడిని ఏపీ ఐఎస్‌డబ్ల్యూకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ నుంచి సర్వీస్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ డిసెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఈలోగా ఇలా కేసులో చిక్కుకోవడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై ఆరా తీసిన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకుర్ జనాల మధ్య శ్రీనివాస్ కాల్పులు జరపడం చట్టారీత్యా తీవ్ర నేరంగా అభివర్ణించారు. నిందితుడిపై శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
డీజీపీని తప్పిస్తేనే సజావుగా ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ తొత్తుగా పనిచేస్తున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను తప్పిస్తేనే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్‌కు వైఎస్సార్సీపీ విన్నవించింది. టీడీపీకి సహకరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై తాము పూర్తిగా సంతృప్తి చెందలేదని తెలిపింది. తాము చేసిన ఫిర్యాదుల్లో సింహభాగాన్ని ఈసీ ఆమోదించలేదని పేర్కొంది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో కూడిన ఫుల్ బెంచ్‌తో భేటీ అయ్యారు. అధికార పార్టీకి సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకొనే విషయంలో తాము చేసిన ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకోలేదని, దీనిపై పునరాలోచన చేయాల్సిందిగా నేతలు విజ్ఞప్తి చేశారు. తాము చేసిన ఫిర్యాదుల్లో ప్రధానంగా రాష్ట్ర డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ యోగానంద్, శాంతిభద్రతల డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, దామోదర్, ప్రకాశం జిల్లా కలెక్టర్, చిత్తూరు, గుంటూరు జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తేనే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించారు.. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను నిలుపుదల చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించారని సమావేశం అనంతరం మీడియాతో మాట్లా డుతూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక భాగం కాదన్న తీరుగా ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలనే బేఖాతరు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పలువురు పోలీసు ఉన్నతాధికారుల బదిలీలపై ఆదేశాలు ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎస్, డీజీపీ ఠాకూర్, ఏబీ వెంకటేశ్వరరావు నలుగురు సమావేశమై చర్చించుకొని.. ఈసీ ఆదేశాలు నిలుపుదల చేస్తూ జీవో జారీ చేశారన్నారు. టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్న డీజీపీ ఇటీవల తన కారులో రూ.35 కోట్ల డబ్బును అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకు తరలించారని కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్‌కు ఫిర్యాదు చేసినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. చంద్రబాబు నీచ సంస్కృతికి నిదర్శనం.. దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో అనైతిక పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏపీలో జనసేన, ప్రజాశాంతి పార్టీలతో అనైతిక పొత్తు పెట్టుకొని వైఎస్సార్ సీపీ ఓట్లు చీల్చేందుకు కుట్ర పన్నారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. మా అభ్యర్థుల పేర్లను పోలిన వారినే పోటీకి దింపారు.. చంద్రబాబు, కేఏ పాల్ కుమ్మక్కై వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చే కుట్ర పన్నారని ఈసీ ఫుల్ బెంచ్‌కు వివరించినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే 35 అసెంబ్లీ, 4 లోక్‌సభ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిలబెట్టిన అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న వారినే ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీకి దింపారని, చంద్రబాబు డబ్బుకు అమ్ముడుపోయిన కేఏ పాల్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశామన్నారు. దీన్ని అడ్డుకొనేందుకు వెంటనే ప్రజాశాంతి పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును రద్దు చేయాలని కోరామన్నారు. -
బాబు డైరెక్షన్లోనే డీజీపీ యాక్షన్!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏమాత్రం సానుకూలత కనిపించకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్న అధికారపక్షం పోలీసుల సాయంతో ఒడ్డున పడాలని తాపత్రయ పడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయాన్ని తన కనుసన్నల్లో పెట్టుకుని వ్యవహారాలు చక్కపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) ఆర్పీ ఠాకూర్ పూర్తిగా సీఎం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారు. సీఎం సూచనలకు అనుగుణంగా పోలీసు యంత్రాంగం అధికార పార్టీ సేవలో కొనసాగేలా ఆదేశాలు ఇస్తున్నారు. ఉదయం 10.30 గంటలకే పోలీసు ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్‌కు చేరుకుంటున్న డీజీపీ రాత్రి 9.30 గంటల వరకు బయటకు రాకుండానే పోలీసు వర్గాలను టీడీపీకి సేవలు అందించేలా నడిపిస్తున్నారు. పైకి తనకు ఎలాంటి సంబంధం లేదనే కలరింగ్ ఇస్తూ లోలోన టీడీపీకి సానుకూలంగా వ్యవహారాలను చక్కబెడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు నియమించిన సొంత సామాజికవర్గం అధికారి.. డీజీపీ వెన్నంటి ఉండి ఈ పనులను చక్కపెడుతున్నారు. ‘కోఆర్డినేషన్’తో ముందుకు.. చంద్రబాబు అధికారం చేపట్టాక ఏసీబీ డీజీగా నియమితులైన ఠాకూర్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ మెప్పు పొందారు. అదే సమయంలో మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించడంతో పట్టుబట్టి ఆయన్ను డీజీపీ పోస్టులో వేయించారు. అయితే ఎన్నికల వేళ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో ఓటమి భయం వెంటాడుతున్న చంద్రబాబు పోలీస్ బాస్‌ను తమ డైరెక్షన్లో నడిచేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికలకు తొమ్మిది నెలలముందే పక్కా స్కెచ్‌తో డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా శాంతిభద్రతల కో ఆర్డినేషన్ పోస్టును కొత్తగా సృష్టించి అందులో తమ సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ) ఘట్టమనేని శ్రీనివాస్‌ను నియమించారు. ఆ ప్రకారం డీఐజీ ఘట్టమనేని ద్వారా పాలకపక్షానికి అనుకూల నిర్ణయాలను డీజీపీ ద్వారా అమలు చేయిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఉదయం పదిన్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు పోలీసు ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ నుంచి బయటకు రాకుండానే డీజీపీ రాష్ట్రంలోని పోలీసులు టీడీపీకి సేవలందించేలా నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. నేరుగా సీఎం చంద్రబాబుకు టచ్‌లో ఉంటున్న ఘట్టమనేని శ్రీనివాస్ అక్కడినుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా డీజీపీతో జిల్లాలవారీగా ఆదేశాలిచ్చేలా సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఠాకూర్ కోసం చంద్రబాబు ఢిల్లీ స్థాయి లాబీయింగ్.. శాంతిభద్రతల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన డీజీపీ ఠాకూర్ ఏకపక్ష ధోరణిపై ఫిర్యాదులు వెల్లువెత్తడం తెలిసిందే. డీజీపీగా ఉన్న అతి తక్కువ కాలంలోనే ఠాకూర్ వివాదాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వ ఏజెంటు మాదిరిగా వ్యవహరిస్తున్నారనే అపప్రథను మూటగట్టుకున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై డీజీపీ వాస్తవాలు తెలుసుకోకుండా చేసిన వ్యాఖ్యలు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయన్న విమర్శలు రావడం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్‌లో పార్కు స్థలం ఆక్రమణ, నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం విషయాల్ని హైకోర్టు తప్పు పట్టడమూ విదితమే. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేసిన ఠాకూర్ పూర్తిగా పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, గవర్నర్, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఠాకూర్పైన, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, శాంతిభద్రతల కో ఆర్డినేషన్ ఐజీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ యోగానంద్లపైన ఫిర్యాదులు చేసిన సంగతి తెల్సిందే. ఇంత జరిగినా ఠాకూర్‌ను కాపాడుకునేందుకు అధికారపక్షం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆయనపై ఇప్పటికే వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఇందుకు సంబంధించి కొద్ది రోజులక్రితం ఎన్నికల సంఘం ఏపీలో డీజీ కేడర్ జాబితాను పంపించాలని రాష్ట్రాన్ని కోరినట్టు తెలిసింది. ఇప్పటికే ఏజీ డీజీపీగా ఆర్పీ ఠాకూర్ ఉన్నప్పటికీ ఎన్నికలసంఘం మళ్లీ డీజీ జాబితాను అడగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎన్నికల సమయంలో తన మనిషిగా ఠాకూర్ ఉంటేనే బాగుంటుందని భావిస్తున్న చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. డీజీపీ నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టు జరిగేలా సీఎం చంద్రబాబు గతేడాది పోలీస్ యాక్ట్‌ను సవరించారు. అదే ధీమాతో ఎం.మాలకొండయ్యను, ఆ తరువాత ఠాకూర్‌ను రాష్ట్ర సర్కారు డీజీపీలుగా నియమించుకుంది. కానీ డీజీపీల నియామకం విషయంలో కొద్ది రోజులక్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగానే స్పందించింది. డీజీపీలను రాష్ట్రాలు నేరుగా నియమించుకోవడానికి వీలులేదని, సీనియారిటీ ప్యానల్ పంపి యూపీఎస్సీ ద్వారానే నియమించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏపీ నుంచి సీనియర్ ఐపీఎస్ జాబితాను గుట్టుచప్పుడు కాకుండా యూపీఎస్సీకి పంపించారు. అందులో ఠాకూర్ పేరును ముందుపెట్టి, మరో నలుగురితో జాబితాను పంపించారు. చంద్రబాబు ఢిల్లీలో తనకున్న పరిచయాలను పణంగా పెట్టి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. -
ఎన్నికలయ్యే వరకు డీజీపీని తొలగించండి
సాక్షి, అమరావతి: డీజీపీ ఆర్.పి.ఠాకూర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, ఆయన డీజీపీగా కొనసాగితే సామాన్యులు సజావుగా ఓటు హక్కును వినియోగించుకోలేరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలయ్యే వరకు ఠాకూర్‌ను డీజీపీ విధుల నుంచి తప్పించాలని కోరారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో దివ్వేదిని కలిసి పలు ఆధారాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందచేశారు. హైదరాబాద్‌లో ఒక పార్క్ స్థలాన్ని కబ్జా చేసిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఆయన్ని డీజీపీగా సీఎం నియమించారని, ఈ పదవి చేపట్టిన నాటి నుంచి ఆయన అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి జరిగిన వెంటనే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే ఇది ఆ పార్టీ సానుభూతిపరులే ప్రచారం కోసం చేశారంటూ ఒక బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఒక పార్టీ కార్యకర్తలాగా వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్న డీజీపీ ఠాకూర్ హయాంలో ఎన్నికలు ప్రజాస్వామికంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని, ఎన్నికలయ్యేంత వరకు ఆయన్ను పదవి నుంచి తప్పించాలన్నారు. నిబంధనావళికి విరుద్ధంగా విధుల్లో ఖాకీలు..: కాగా, ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా విధుల్లో ఉన్న కొందరు పోలీసు అధికారులపై అంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ విభాగం ద్వివేదికి ఫిర్యాదు చేసింది. ఒంగోలు డీఎస్పీ రాధేష్ మురళి, ఏలూరు రూరల్ సీఐ వైవీ లచ్చునాయుడు, నందిగామ రూరల్ ఏఎస్ఐ నూతలపాటి నాగేశ్వరరావు, కోడూరు ఎస్ఐ ఎస్.ప్రియకుమార్, ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్స్ శివనాగరాజు, ఎస్ చిరంజీవిరావు, పి.హరిబాబులపై క్రిమినల్ స్వభావం, అవినీతి ఆరోపణలకు సంబంధించి కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఇలా కేసుల్లో ఉన్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని నిబంధనలు స్పష్టం చేస్తుండటంతో వీరిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి, కృష్ణా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కోటంరాజు వెంకటేష్‌శర్మ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. -
డీజీపీ ఠాకూర్‌పై వేటు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్.. ప్రభుత్వ, అధికార పార్టీ అనుకూల వైఖరి, ఏకపక్షధోరణి చివరకు ఆయన సీటుకే ముప్పుతెచ్చేలా పరిణమించింది. ఇటీవలి కొన్ని కీలక పరిణామాలు, ఆయనపై వచ్చిన ఫిర్యాదులతో ఎన్నికలకు ముందు ఆయన్ను డీజీపీగా తప్పించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే ఏపీలోని డీజీ కేడర్ పోలీసు అధికారుల జాబితాను పంపించాలని కొద్దిరోజుల క్రితం ఈసీ రాష్ట్రాన్ని కోరినట్టు తెలిసింది. ఏపీ డీజీపీగా ఆర్పీ ఠాకూర్ వ్యవహరిస్తుండగా ఈసీ డీజీల జాబితాను కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసీ కోరడంతో ఏపీలోని డైరెక్టర్ జనరల్ (డీజీ) కేడర్ అధికారుల జాబితాను ప్రభుత్వం పంపించక తప్పలేదు. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన, ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న డి. గౌతమ్ సవాంగ్, సీఆర్పీఎఫ్ డీజీ (ఢిల్లీ)గా డిప్యుటేషన్ పై ఉన్న వీఎస్కే కౌముది, జైళ్ల శాఖ డీజీ వినయ్‌రంజన్ రే, 1987 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఎన్వీ సురేంద్రబాబు, రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ పేర్లతో కూడిన జాబితా ఈసీకి చేరినట్టు సమాచారం. -
చంద్రబాబు అండతోనే డీజీపీ అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండదండలతోనే రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు అవినీతి, అక్రమాలకు వత్తాసు పలుకుతున్నందునే.. ప్రతిగా డీజీపీ అక్రమాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్కే బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. పిల్లల పార్కు ఆక్రమణపై హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ డీజీపీ ఠాకూర్ ఇంకా పదవిలో కొనసాగడమేమిటని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతం మంగళగిరిలో ఓ రైతు తెలియక భవనం నిర్మిస్తే సీఆర్డీఏ అధికారులు ఆ నిర్మాణాన్ని తొలగించారని.. అయితే డీజీపీ ఠాకూర్ మాత్రం హైదరాబాద్‌లో పిల్లల పార్కును ఆక్రమించి మరీ భవనాన్ని నిర్మించారని తెలిపారు. సీఎం చంద్రబాబు కరకట్టలను ఆక్రమించి నిర్మించిన భవనంలో ఉండగా, తాను పిల్లల పార్కును ఆక్రమించడంలో తప్పేముందని డీజీపీ భావించినట్లున్నారని ఎద్దేవా చేశారు. రాష్టంలో ఎంతో మంది సమర్థులైన పోలీసు అధికారులు ఉండగా ఠాకూర్‌ను డీజీపీగా, ఏసీబీ డీజీగా జోడు పదవుల్లో కొనసాగించడం వెనుక మర్మమేమిటని చంద్రబాబును నిలదీశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై విచారణ కూడా మొదలుకాక ముందే అది సానుభూతి కోసమే చేశారంటూ డీజీపీ ఠాకూర్ ప్రకటించడం కేసు నుంచి సీఎం చంద్రబాబును కాపాడేందుకేనని స్పష్టం చేశారు డీజీపీ నిర్మించిన అక్రమ నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి సేకరించారన్న వాస్తవాలను త్వరలో బయటపెడతానని ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు మంగళగిరి పోలీస్ స్టేషన్లో 2014 నుంచి 2019 వరకు పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్ల వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను డీజీపీ ఠాకూర్ వేధిస్తూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. డీజీపీ ఠాకూర్ అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే ఆళ్ల ప్రకటించారు. డీజీపీ ఠాకూర్ అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రులకు ఫిర్యాదు చేస్తానని ఆయనకు శిక్షపడే వరకూ విశ్రమించబోనని తేల్చిచెప్పారు. తాజా రాజకీయ పరిణామాలపై విలేకరుల అడిగిన ప్రశ్నలపై ఎమ్మెల్యే ఆర్కే స్పందిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని ప్రకటించారు. పార్టీ నిర్ణయానికి తాను సహా పార్టీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉంటామన్నారు. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు.. సీఎం-డీజీపీ భేటీ
సాక్షి, అమరావతి : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం అడుగడునా అడ్డుతగులుతోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు డీజీపీ ఠాకూర్ భేటీ అయ్యారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై జరిగిన హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించడం, హైకోర్టులో వేసిన పిటిషన్ చర్చించినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం రేపు హైకోర్టులో పిటిషన్ వేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన విచారణకు ఏపీ సిట్ అధికారులు సహకరించకపోవడంపై ఆగ్రహించిన ఎన్ఐఏ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. -
నెత్తుటి సిరాతో.. ‘జిత్తుల’ లేఖ
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణను వ్యతిరేకిస్తూ ఈ కేసు సంగతి తామే చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని దబాయించేలా టీడీపీ సర్కారు లేఖ రాయడంపై రాజకీయ పరిశీలకులు, న్యాయ నిపుణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఈ దారుణ హత్యా యత్నం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయని పేర్కొంటున్నారు. ఎయిర్పో ర్టులో భద్రత బాధ్యత కేంద్రానిది, విచారణ మాత్రం తాము చూసుకుంటామంటూ సీఎం వింత వ్యాఖ్యలు చేయడంపై అంతా విస్తుపోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభమై చురుగ్గా సాగుతుండటంతో తమ బండారం బయటపడుతుందనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇలా వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు అంశం కేంద్ర పరిధిలోకి రాదని, ఇది చాలా చిన్న కేసు అని బుకాయించేలా ప్రధానికి శనివారం రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. దీన్ని కేంద్ర, రాష్ట్ర సంబంధాలుగా చిత్రీకరిస్తూ రాష్ట్రం అధికారాలపై దురాక్రమణగా సీఎం అభివర్ణించడాన్ని తప్పుబడుతున్నారు. విమానాశ్రయాల్లో స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, విదేశీ చొరబాట్లపైనే ఎన్ఐఏ విచారణ జరపాలని చట్టంలో ఉందటూ సీఎం చంద్రబాబు వక్రీకరిస్తూ అవాస్తవాలు చెప్పడం గమనార్హం. చిన్న కేసులు, ఆర్థికపరమైన కేసులు మినహా హత్యాయత్నాలు, హత్యలు, లాంటి తీవ్రమైన కేసుల విచారణను ఎన్ఐఏ చేపట్టకూడదని చెప్పడం చంద్రబాబుకే సాధ్యమని పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు. కేసును నీరుగార్చేలా సీఎం, డీజీపీ వ్యాఖ్యలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో పక్కా ప్రణాళిక ప్రకారమే హత్యాయత్నం జరిగిందని కేసుపై తొలుత దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు సైతం హైకోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఎయిర్‌పోర్టులో ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే డీజీపీ, మంత్రులు, టీడీపీ నేతలు స్పందిస్తూ దీన్ని అభిమాని చేసిన దాడిగా చిత్రీకరిస్తూ వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు కేంద్ర సంస్థతో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ న్యాయ పోరాటం చేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ కేసు విచారణను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయడాన్ని నివేదించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించలేరని తెలిపింది. కేంద్ర పౌర విమానయాన భద్రతా చట్టం, ఎన్ఐఏ చట్టాలను ఉటంకిస్తూ ఈ కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని కోరింది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ కేంద్ర హోంశాఖ స్పందనను కోరింది. విమానాశ్రయంలో జరిగిన ఈ హత్యాయత్నం కేసును చట్ట ప్రకారం ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ న్యాయస్థానానికి తెలియచేయడం, రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ చురుగ్గా విచారిస్తుండటంతో కుట్రదారులు ఆందోళన చెందుతున్నట్లు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్ఐఏ దర్యాప్తు చేయాల్సిందేనంటున్న చట్టం నిజానికి విమానాశ్రయంలో హత్యాయత్నాలు, హత్యలు, దాడుల కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు చేపట్టకూడదని ఎన్ఐఏ చట్టం సెక్షన్ 6 స్పష్టం చేస్తోంది. ఇక విమానాశ్రయంలో ఏదైనా ఆయుధం, వస్తువుతో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడితే ఎన్ఐఏ విచారణ పరిధిలోకి వస్తాయని పౌర విమానయాన భద్రతా చట్టంలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ చర్యలు భారత సమాఖ్య వ్యవస్థ విధానానికి విరుద్ధమని చంద్రబాబు అవాస్తవాలు చెప్పడం సీఎం స్థాయిని దిగజార్చిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎలా దర్యాప్తు చేపడుతుందని చంద్రబాబు తన లేఖలోప్రధానిని ప్రశ్నించారు. విమానాశ్రయం అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ. అక్కడ జరిగిన హత్యాయత్నం కేసు విచారణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకే వస్తుందన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు గుర్తించలేదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మాలేగావ్ అల్లర్ల కేసులో ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌పై ఎన్ఐఏ ఉన్నతాధికారి ఒకరు ఒత్తిడి తెచ్చారంటూ ఓ ప్రతికలో వచ్చిన వార్తను చంద్రబాబు ప్రస్తావిస్తూ ఎన్ఐఏ నిబద్ధతను ప్రశ్నించారు. మరి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం సానుభూతికోసమేనంటూ స్వయంగా సీఎం చంద్రబాబుతోపాటు డీజీపీ బహిరంగ వ్యాఖ్యలు చేసిన తరువాత రాష్ట్ర పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు ఎలా నిర్వహిస్తారని నిపుణులు నిలదీస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏ విచారణ పరిధిలోకే వస్తుందని కేంద్ర పౌర విమానయాన భద్రతా చట్టం–1982, ఎన్ఐఏ చట్టాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. విమానాశ్రయాల్లో భద్రత, రక్షణకు విఘాతం కలిగించే నేరాలపై దర్యాప్తు బాధ్యత పూర్తిగా ఎన్ఐఏదేనని పౌర విమానయాన భద్రతా చట్టంలోని సెక్షన్ 3(ఎ), 5(ఎ)లు స్పష్టం చేస్తున్నాయి. విమానాశ్రయాల్లో భద్రతకు భంగం కలిగించే చర్యలు, హత్యాయత్నాలు, దాడులు తదితర కేసులను ఎన్ఐఏ విచారించాలని వివరంగా పేర్కొన్నారు. ఏదైనా విమానాశ్రయంలో ఎవరైనా చట్ట విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ఏదైనా ఆయుధాన్నిగానీ వస్తువునుగానీ ఉపయోగించిన కేసులను ఎన్ఐఏ విచారించాలి. హింసాత్మక చర్యలకు పాల్పడి ఎవరినైనా గాయపరిచినా, హత్యలకు పాల్పడినా ఆ కేసులు ఎన్ఐఏ దర్యాప్తు పరిధిలోకే వస్తాయి. కుట్ర కోణాన్ని వెలికి తీసే సెక్షన్లను చేర్చకుండా... ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం తన కనుసన్నల్లో మెలిగే వారికి దీన్ని అప్పగించి వ్యూహాత్మకంగా విచారణను నీరుగార్చేందుకు యత్నించింది. 2018 అక్టోబరు 25వతేదీ మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో నిందితుడు శ్రీనివాసరావు హత్యాయత్నానికి ఒడిగట్టాడు. అయితే ప్రాథమిక విచారణ కూడా పూర్తికాకముందే అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకే డీజీపీ ఠాకూర్ విలేకరుల సమావేశం నిర్వహించి ‘సానుభూతి కోసమే నిందితుడు శ్రీనివాసరావు జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు’ అని ప్రకటించేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రులు అదే మాట చెప్పుకొచ్చారు. సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ‘సానుభూతి కోసమే ఈ హత్యాయత్నం చేయించారు’ అని బాధ్యతారాహిత్యంగా కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ప్రకటన చేశారు. విమానాశ్రయంలోని తన రెస్టారెంట్లో నిందితుడికి ఏడాదికిపైగా ఆశ్రయం ఇచ్చిన టీడీపీ నేత హర్షవర్థన్ చౌదరిని సిట్ అధికారులు సరిగా విచారించ లేదు. నిందితుడు శ్రీనివాసరావుకు ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్(ఏఈపీ) జారీకి అవసరమైన నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)కు సంబంధించి కూడా విశాఖ పోలీస్ కమిషనర్ తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఛేదించేందుకు అవసరమైన ‘సెక్షన్ 120–బి’ చేర్చనేలేదు. హత్యాయత్నం కేసులో అసలు సూత్రధారుల పాత్ర బట్టబయలు కాకుండా కేవలం శ్రీనివాసరావుకే పరిమితం చేసేలా ప్రభుత్వ ముఖ్యనేత ఆదేశాలతో పోలీసులు కథ నడపడం తెలిసిందే. -
ప్రతిపక్ష నేత హత్యకు కుట్ర కేసులో... 10 అంకాలు
అక్టోబరు 25, 2018.. మ.12.45 గం.–12.48 గం. : విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై నిందితుడు జునుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మ.1.30గం. : డీజీపీ ఆర్పీ ఠాకూర్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నిందితుడు పేరు, ఊరు వెల్లడించి అతను వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు, జగన్ అభిమాని అని ప్రకటించారు. ప్రచారం కోసమే హత్యాయత్నం చేశాడని వెల్లడించారు. మ.2గం. : వైఎస్జగన్ బొమ్మతో ఉన్న ఫ్లెక్సీని ముగ్గురు మంత్రులు మొబైల్లో చూపించారు. (సా.4 గంటలు దాటిన తర్వాత సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4.30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. సీఆర్పీసీ–156 ప్రకారం.. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత విచారణకు అవకాశం ఉంటుంది. సా.4.30 వరకు నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వలేదని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. స్వయంగా సీఎంయే నిందితుడిని 4.30 తర్వాత కస్టడీలోకి తీసుకున్నామని చెబితే... అంతకు 3 గంటల ముందే డీజీపీ, మంత్రులు అన్ని వివరాలు ఎలా చెప్పగలిగారు?) మ.3.30గం. : తూర్పుగోదావరి జిల్లా ఠాణేలంకలోని నిందితుడు శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న స్థానిక టీడీపీ నేతలు. శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అని ప్రకటన. మారుమూల ఉన్న ఆ ఇంటికి అంత తక్కువ సమయంలో ఎలా చేరుకోగలిగారు? రాత్రి 7గం. : సీఎం చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సానుభూతి కోసమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం నాటకం ఆడారని ప్రకటించారు. 1.ఏడాదిన్నర క్రితమే హత్యకు కుట్ర.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను హతమార్చడానికి చేసిన కుట్రకు బీజం.. హత్యాయత్నం జరగడానికి ఏడాదిన్నర ముందే ప్రారంభమైంది. జగన్ గొంతులో కత్తిదింపి అంతమొందించడానికి నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును ఏడాదిన్నర క్రితమే ఎంపిక చేసుకుని ఆ కుటుంబానికి ‘అన్నీ’ సమకూర్చారన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఆ కుటుంబం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని తమ స్వగ్రామం ఠానేలంకలో చకచకా ఇంటిని నిర్మిస్తుండటం ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఆ ఇంటి నిర్మాణానికి అధికార పార్టీ నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం.. ఠానేలంకలోని నిందితుడి కుటుంబం నిర్మిస్తున్న ఇంటిని చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా రోజువారీ కూలీ మీద జీవనం సాగిస్తున్న కుటుంబం ఉన్నట్లుండి ఇంటి నిర్మాణానికి రూ.20 లక్షలు వ్యయం చేయడానికి సిద్ధపడటం అనుమానాలను రేకెత్తిస్తోంది. నిందితుడి కుటుంబం ఠానేలంక గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణం చేపట్టి 60 శాతానికి పైగా పూర్తిచేసింది. ఇప్పటివరకు రూ.12 లక్షలు ఖర్చు చేశామని నిందితుడి తల్లి సావిత్రమ్మ చెప్పారు. ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణ పథకం కింద అందింది రూ.2 లక్షల లోపే. మిగతా రూ.10 లక్షలు వారి చేతి నుంచే పెట్టారు. ప్రశ్న : విపక్ష నేతను హత్య చేయడానికి రూపొందించిన ప్రణాళికలో నిందితుడు శ్రీనివాసరావును ‘ఇన్స్ట్రుమెంట్’గా వాడటానికి అప్పుడే ఎంపిక చేసుకున్నారని ‘ఇంటిగుట్టు’ చెప్పకనే చెబుతోంది. నిందితుడి కుటుంబానికి ఉన్నట్లుండి అంత సొమ్ము ఎలా వచ్చిందనే దిశగా ‘సిట్’ దర్యాప్తు ఎందుకు చేయలేదు? 2.నిందితుడి కుటుంబం పక్కా టీడీపీ.. పీఎంఏవై–ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద ఠానేలంకలో 143 ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తే.. అవన్నీ టీడీపీ కార్యకర్తలకు, ఆ పార్టీ సానుభూతిపరులకే దక్కాయి. ఈ పథకంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు వాటిని మంజూరు చేయకపోవడం గమనార్హం. ప్రతిపక్షానికి చెందిన 16 మందికి అన్ని అర్హతలున్నాయని అధికార యంత్రాంగం నిర్ధారించిన తర్వాత కూడా ఇళ్లు మంజూరు చేయలేదు. ‘నిందితుడి కుటుంబం వైఎస్సార్సీపీ అయితే ఇల్లు వచ్చేదా? ఇంటి నిర్మాణంలోనూ నిబంధనలను ఉల్లంఘించినా.. వైఎస్సార్సీపీకి చెందిన కుటుంబమే అయితే టీడీపీ వాళ్లు చూస్తూ ఊరుకునే వారేనా?’.. అని నిందితుడు శ్రీనివాసరావు బాబాయి, టీడీపీ నాయకుడు, గ్రామ ఉప సర్పంచ్‌గా పనిచేసిన జనుపల్లి నాగేశ్వరరావు ప్రశ్నించడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు.. తమకు అన్ని అర్హతలున్నా ఇళ్లు మంజూరు చేయలేదని, నిర్మాణ సామగ్రి సమకూర్చుకున్న తర్వాత మంజూరు జాబితాలో తమ పేర్లు లేకుండా తొలగించారని వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెల్లడించారు. శ్రీనివాసరావు కుటుంబం టీడీపీనే అంటూ ఇటు నిందితుడి బాబాయి నాగేశ్వరరావు చెప్పడం, తమకు అన్ని అర్హతలున్నా కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే ఏకైక కారణంతోనే ఇళ్లు ఇవ్వలేదని మిగతా వారంతా చెప్పడం ద్వారా శ్రీనివాసరావు కుటుంబానిది ఏ పార్టీ అనే విషయం స్పష్టమవుతోంది. నిందితుడి స్నేహితులు, ఇరుగుపొరుగు వారూ.. శ్రీనివాసరావు కుటుంబం టీడీపీనే అని చెప్పారు. వైఎస్సార్సీపీ అయితే రెండు ఇళ్లు ఇస్తారా? మా రోడ్డులో ఇళ్లు కట్టుకునే వాళ్లకు లోన్ ఇవ్వలేదు. పిల్లర్లలోనే ఇళ్లు ఆగిపోయాయి. ఇలాంటి (శ్రీనివాసరావు కుటుంబానికి) వాళ్లకు రెండు లోన్లు ఇచ్చారు. ఒకసారి ఆ పార్టీ, మరోసారి ఈ పార్టీ అంటూ సుబ్బరాజు (శ్రీనివాసరావు సోదరుడు) అంటున్నారు. టీవీల్లో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. సుబ్బరాజు వాళ్లకు 2 లోన్లు ఎలా ఇచ్చారో తెలుసుకోండి. అందరూ బేస్మట్టం వేసుకుని లోన్లు కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరికీ వైఎస్సార్సీపీ అని ఇవ్వలేదు. మరి సుబ్బరాజు వాళ్లకు 2 లోన్లు ఎలా ఇచ్చారు? కనుక్కోండి. కాగిత బాబూజీ వైఎస్సార్సీపీ అని లోన్ ఇవ్వలేదు. సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటున్నాడు. మరి సుబ్బరాజుకు రెండు ఎలా ఇచ్చారు? ముందేమో టీడీపీ, తర్వాత ఎవరికి పడితే వారికి వేస్తాం. ఇప్పుడు వైఎస్సార్సీపీ అంటున్నారు. ప్రజలకు అంతా అర్థం అవుతోంది. వాళ్లలో పశ్చాత్తాపంలేదు. మేం హడలిపోతున్నాం. వాళ్లేమో డేర్‌గా మాట్లాడుతున్నారు. మాకేమీ అర్థం కావడంలేదు. – జనుపల్లి నాగేశ్వరరావు (శ్రీనివాసరావు బాబాయి, ఠానేలంకకు ఉప సర్పంచ్‌గా పనిచేశారు. టీడీపీ నాయకుడు) ఏకగ్రీవంగా ఎన్నికైనా వైఎస్సార్సీపీ అని ఇల్లు ఇవ్వలేదు లోన్ పెట్టుకుంటే పార్టీవల్ల ఇవ్వడంలేదు. మా లోను కాగితాలు పక్కనబెట్టేశారు. ఏకగ్రీవంగా నన్ను ఠానేల్లంక పంచాయితీలో 8వ వార్డు మెంబర్‌గా ఎన్నుకున్నారు. మూడుసార్లు పంచాయితీకి వెళ్లి అప్లై చేశాను. పంచాయితీలో కనీసం కాగితాలు కూడా లేకుండా చేశారు. ఇల్లు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నాం. మా వార్డులో అంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నా నాకు మాత్రం ఇంటి లోను ఇవ్వడం లేదు. నా మరిది రాంబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్‌గా ఉన్నారని నాకు ఇల్లు ఇవ్వబోమంటున్నారు. అదేమని అడిగితే మీ పార్టీ వాళ్లకు ఇళ్లు ఇవ్వబోమని చెబుతున్నారు. – నక్కా అమృతవల్లి, బలుసుల్లంక, ముమ్మిడివరం ప్రశ్న : ఠానేలంకలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల్లో ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయలేదు. ఇల్లు మంజూరైన నిందితుడు శ్రీనివాసరావు మాత్రం వైఎస్సార్సీపీ అని టీడీపీ ప్రచారం చేస్తోంది. దీనివెనక ఉన్న అంతరార్థం ఏమిటి? 3.తర్వాత అంకం ‘ఫ్లెక్సీ నాటకం’.. ఇంటి నిర్మాణానికి అన్ని రకాలుగా సహకారం అందించిన తర్వాత నిందితుడు, కుట్ర సూత్రధారుల మధ్య పరస్పరం నమ్మకం ఏర్పడి ఉండవచ్చు. తర్వాత అంకంలో.. నిందితుడిని జగన్ అభిమానిగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నంలో ‘ఫ్లెక్సీ నాటకం’ మొదలుపెట్టారు. కుట్రను అమలుచేయడానికి ఎంపిక చేసుకున్న జనుపల్లి శ్రీనివాసరావును జగన్ అభిమానిగా చిత్రీకరించడానికి వీలుగా 2018 జనవరి 1న నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీని.. సూత్రధారుల సూచనలకు అనుగుణంగా ఠానేలంకలో ఏర్పాటుచేశారు. హత్యాయత్నం జరిగిన గంట వ్యవధిలోనే.. ఎక్కడో మారుమూల గ్రామంలో దాదాపు 10 నెలల క్రితం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ సమాచారాన్ని పోలీసులు వెల్లడించడం వెనక.. ‘సూత్రధారుల ప్రణాళిక’ ఉందనేది స్పష్టం. ప్రశ్న : జగన్ మీద హత్యాయత్నం జరిగిన గంట వ్యవధిలోనే నిందితుడు జగన్ అభిమాని అని, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ (2018 జనవరి 1న) ఫ్లెక్సీ కూడా వేయించారని పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ఫ్లెక్సీ పీడీఎఫ్ కాపీని పోలీసులు విడుదల చేశారు. హత్యాయత్నం జరిగిన గంట వ్యవధిలోనే.. 10 నెలల క్రితం వేయించిన ఫ్లెక్సీ గురించి పోలీసులకు ఎవరు చెప్పారు? పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు? దొంగలను పట్టించిన ‘రోజాపూలు’ హత్యాయత్నం జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీలో రోజాపూలు లేవు. ‘రోజాపూలు లేకుండా ఫ్లెక్సీ పీడీఎఫ్‌ను జనుపల్లి శ్రీనివాసరావు ఆమోదం కోసం లేపాక్షి ప్రింటర్స్‌లో పనిచేస్తున్న చైతన్య స్నేహితుడు 2017 డిసెంబర్ 30న చైతన్య (శ్రీనివాసరావుకు బంధువు)కు మెయిల్ పంపించాడు. అయితే, శ్రీనివాసరావు నేరుగా పి.గన్నవరంలోని లేపాక్షి ప్రింటర్స్‌కు వచ్చి మెయిల్లో పంపించిన ఫ్లెక్సీ నమూనాకు కొద్దిపాటి మార్పులు చేశాడు. రోజాపూలు ఉండాలని ఫ్లెక్సీలో పెట్టించాడు. రోజాపూలు పెట్టిన తర్వాత ఫ్లెక్సీ నా ప్రింటర్స్లోనే ప్రింట్ చేసి పట్టుకెళ్లాడు’ అని చెప్పారు. –ఫ్లెక్సీని ప్రింట్ చేసిన లేపాక్షి ప్రింటర్స్ యజమాని అయ్యప్ప ఫ్లెక్సీ చిరిగిపోతే రోజాపూలు అంటించారు లేపాక్షి ప్రింటర్స్ యజమాని అయ్యప్ప చెబుతున్న దానికి, నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు చెబుతున్న విషయానికి పొంతనలేదు. ‘ఫ్లెక్సీ కట్టిన తర్వాత అది చిరిగిపోయింది. ఫ్లెక్సీ చిరిగిపోయిందని శ్రీనివాసరావు బాధపడి.. చినిగిన చోట రోజాపూలు బొమ్మతో ప్యాచ్ అతికించాడు. అందువల్ల పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీ పీడీఎఫ్ కాపీలో రోజాపూలు లేవు. పోలీసులకు లభించిన ఫ్లెక్సీలో రోజాపూలున్నాయి’. – సుబ్బరాజు (శ్రీనివాసరావు అన్న) అయ్యప్ప మాటలపైనా అనుమానాలు.. నిందితుడు శ్రీనివాసరావు స్వయంగా తమ ఆఫీసుకు వచ్చి రోజాపూలు పెట్టించుకుని ఫ్లెక్సీ ప్రింట్ తీసుకెళ్లాడని లేపాక్షీ ప్రింటర్స్ యజమాని అయ్యప్ప చెప్పారు. మరి రోజాపూలతో ఉన్న ఫ్లెక్సీ పీడీఎఫ్ కాపీ చూపించమని అడిగినప్పుడు.. ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టం) పోయిందని, అందువల్ల 2017 డిసెంబరు ఫైళ్లు పోయాయని చెప్పారు. నిజానికి.. అయ్యప్ప చెబుతున్న మాటల్లో వాస్తవంలేదు. ‘ఓఎస్ పోతే.. మొత్తం ఫైళ్లు పోతాయి. ఒక నెల, ఒక వారం ఫైళ్లు మాత్రమే పోయే అవకాశం లేదు’ అని ఐటీ నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా డిసెంబర్ ఫైళ్లు మాత్రమే పోయాయని చెప్పడం అనుమానాలకు దారితీస్తోంది. ‘ఎస్ఆర్టి ప్రింటర్స్’ కథ ఏమిటి? పోలీసులు బయటపెట్టిన ఫ్లెక్సీ.. ఎస్ఆర్టీ ప్రింటర్స్‌లో ప్రింట్ చేయించినట్లు ఫ్లెక్సీ కింద ముద్రించారు. ఎస్ఆర్టీ ప్రింటర్స్ అనేది ఎక్కడా లేదు. ఆ ప్రింటర్స్ పేరిట ఫ్లెక్సీలో ఇచ్చిన ఫోన్ నంబర్ లేపాక్షి ప్రింటర్స్ యజమాని అయ్యప్పది. ఇదే విషయాన్ని అయ్యప్పను అడిగితే.. ‘నా దగ్గర పనిచేసే కుర్రాడు తెచ్చుకునే ఆర్డర్స్ (వ్యాపారం)కు ఎస్ఆర్టీ ప్రింటర్స్ అని వేస్తామ’ని సమాధానం ఇచ్చారు. మరి ఫోన్ నంబర్ ఆ కుర్రాడిది కాకుండా.. యజమాని నంబర్ ఎందుకు పెట్టారనే ప్రశ్నకు సమాధానంలేదు. ప్రశ్న : ఫ్లెక్సీ ప్రింట్ చేసిన లేపాక్షి ప్రింటర్స్ యజమాని.. ఫ్లెక్సీలో రోజాపూలున్నాయని చెప్పారు. నిందితుడు సోదరుడు అందుకు భిన్నంగా.. ఫ్లెక్సీలో రోజాపూలు లేవు.. ఫ్లెక్సీ చినిగిపోతే ప్యాచ్‌లాగా రోజాపూలు బొమ్మ అతికించారని చెప్పారు. పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీ పీడీఎఫ్‌లో రోజాపూల బొమ్మ లేదు. పోలీసులు కనుక్కున్నామని చెబుతున్న ఫ్లెక్సీలో మాత్రం రోజాపూల బొమ్మ ఉంది. నిందితుడు కట్టిన ఫ్లెక్సీ ఒకే ఒకటి. ఈ పొంతనలేని సమాధానాలే చెబుతున్నాయి కదా ఇందులో ఏదో మతలబు దాగి ఉందని? ఈ దిశగా ఎందుకు విచారణ చేయలేదు? 4.కుట్ర అమల్లో తదుపరి ఘటం.. విమానాశ్రయ ప్రవేశం కుట్ర అమలుకు విమానాశ్రయాన్ని ఎన్నుకోవడం వెనకా సూత్రధారులు పెద్ద కసరత్తే చేశారు. ప్రజల్లో జగన్ మీద పాశవిక దాడి చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతో.. పెద్దగా జనంలేని ప్రాంతాన్ని కుట్రదారులు ఎంపిక చేసుకున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతమైతే.. హత్య తర్వాత పరిణామాల్లో తమ చేతులకు మట్టి అంటకుండా బయటపడొచ్చనే ఆలోచన కుట్రదారులకు ఉందని స్పష్టమవుతోంది. విమానాశ్రయంలోకి నిందితుడిని తీసుకెళ్లడానికి ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని, టీడీపీ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడు హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి మార్గం సుగమం చేశారు. నిందితుడు శ్రీనివాసరావు మీద ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైన విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా.. నిందితుడికి ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) జారీ వెనక టీడీపీ నేతల ఒత్తిడి ఉందని అనుకోవచ్చు. దరఖాస్తుదారుడికి నేర చరిత్రలేదని నిర్ధారించడానికి మొట్టమొదట చేసే పని.. సొంత ఊరు పోలీస్‌స్టేషన్‌లో వాకబు చేయడం. సంబంధిత జిల్లా ఎస్పీకి లేఖ రాసి దరఖాస్తుదారుడి నేర చరిత్ర తెలుసుకుంటారు. దాడి చేయడం, చంపుతానని బెదిరించిన ఘటనలో ముమ్మిడివరంలో శ్రీనివాసరావు మీద కేసు నమోదైంది. నేర చరిత్రను దాచి, నిందితుడికి ఎన్వోసీ తెప్పించి నిందితుడిని విమానాశ్రయ ప్రవేశం చేయించడంలో సూత్రధారులు విజయవంతమయ్యారు. ముమ్మిడివరం పీఎస్‌లో కేసు 2017 మార్చి 2న ముమ్మిడివరం పోలీసుస్టేషన్లో నిందితుడు శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. ఓ వివాహ వేడుకలో తనపై దాడిచేసి కొట్టి, చంపుతానని శ్రీనివాసరావు బెదిరించడంతో కాగిత వెంకటేష్ అనే వ్యక్తి కేసు పెట్టారు. క్రైమ్ నెంబర్ 48/2017, సెక్షన్ 323, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఎ–4గా శ్రీనివాసరావు పేరు ఉంది. 41ఎ సీఆర్పీసీ కింద శ్రీనివాసరావుకు పోలీసులు నోటీసు జారీచేసి విచారించారు. కోర్టులో చార్జిషీటు కూడా పోలీసులు దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ముమ్మిడివరం పీఎస్‌లో 2017 ఏప్రిల్ నుంచి ఎస్ఐగా పనిచేస్తున్నాను. నేను శ్రీనివాసరావుకు ఎన్ఓసీ ఇవ్వలేదు. అంతకుముందు ఏం జరిగిందో తెలీదు – ముమ్మడివరం ఎస్ఐ పి. ప్రభాకర్ ప్రశ్న : రక్షణ శాఖ ఆధీనంలోని విమానాశ్రయం(విశాఖ విమానాశ్రయం పౌర విమానయాన శాఖ పరిధిలోది కాదు) లోకి ప్రవేశానికి వీలుగా ఎన్వోసీ జారీచేయడంలో నిందితుడి నేర చరిత్రను పోలీసులు దాచి పెట్టడం వెనక ఉన్న సూత్రధారులు ఎవరు? పోలీసులు ఈ దిశగా ఎందుకు విచారణ చేయడంలేదు? సూత్రధారుల బండారం బయటపడుతుందనే ఎన్వోసీ జారీలో నిబంధనలను పాటించలేదనే విషయాన్ని ‘సిట్’ పట్టించుకోవడంలేదా? 5.నిందితుడిపై హర్షవర్ధన్ చౌదరికి ఎంత ప్రేమ శ్రీనివాసరావు మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని అని పోలీసులు పదే పదే చెప్పుకొచ్చారు. హర్షవర్ధన్‌కి ఉన్న పార్టీ (టీడీపీ) నేపథ్యం చూస్తే.. పొరపాటున కూడా తన సంస్థల్లో తన పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. మరి శ్రీనివాసరావుకు ఎలా ఇచ్చారు? రెస్టారెంట్లో పనిచేస్తున్న అందరికంటే శ్రీనివాసరావుకే ఎక్కువ వేతనం ఇచ్చి ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించడానికి కారణమేంటి?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే కుట్ర కోణం సులభంగానే అర్థమవుతుంది. తమ కుట్రను అమలుచేయడానికి ఎంపిక చేసుకున్న శ్రీనివాసరావుకు సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు మిగతా సిబ్బంది కంటే ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని నిందితుడ్ని ‘ప్రత్యేకంగా’ చూశారు. ప్రశ్న : అంత ప్రత్యేకంగా చూడటానికి కారణాలను ‘సిట్’ ఎందుకు అన్వేషించలేదు? అలా అన్వేషిస్తే సూత్రధారులెవరో తేలిపోతుందని పలువురు పోలీసు అధికారులు, విమానశ్రయం ఉన్నతాధికారులు ‘సాక్షి’ బృందానికి చెప్పారు. 6.మట్టుబెట్టేందుకే మాటేశారు.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో అనధికారికంగా ఓ వ్యక్తి ఒక్కరోజైనా ఉండగలడా?.. ఏమాత్రం సాధ్యం కాదు. కానీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఏకంగా ఏడాదిపాటు ఉన్నాడు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేష్ చంద్ర నివేదిక బహిర్గతం చేసింది. విమానాశ్రయంలో ప్రవేశానికి ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ (ఏఈపీ) తప్పనిసరి. మరి శ్రీనివాసరావుకు ఏఈపీ ఎవరిచ్చారు.. ఎలా ఇచ్చారో తెలియజేయాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి బీసీఏఎస్‌ను కోరారు. దీనిపై బీసీఏఎస్ డీజీ ఇచ్చిన సమాధానంతో అసలు కుట్ర కోణం బట్టబయలైంది. అసలు శ్రీనివాసరావుగానీ అతని తరఫున రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్గానీ ఏఈపీ కోసం దరఖాస్తు చేయనేలేదని ఆయన వెల్లడించారు. కాబట్టి తాము ఏఈపీ జారీ చేయలేదని చెప్పారు. కాగా, నిందితుడు శ్రీనివాసరావు విమానాశ్రయం డి–జోన్లో పనిచేసేందుకు 2018 అక్టోబరు 1 నుంచి 30 వరకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తాత్కాలిక ఏఈపీ జారీచేశారని కూడా ఆయన తెలిపారు. ఇక్కడే అసలు మతలబు ఉంది. వాస్తవం ఏమిటంటే, నిందితుడు శ్రీనివాసరావు దాదాపు ఏడాదిగా విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. సిట్ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. కేవలం 2018, అక్టోబరు నెలకు మాత్రమే అనుమతి ఉన్న అతను ఏడాదిగా విమానాశ్రయంలో ఎలా కొనసాగారు? అనుమతిలేని వ్యక్తి విమానాశ్రయంలో ఏడాదిగా దర్జాగా తిరుగుతుంటే విమానాశ్రయ భద్రతా విభాగం అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరికి విమానాశ్రయ ప్రధాన భద్రతా అధికారి వేణుగోపాలరావుతో సన్నిహిత సంబంధాలు ఉండటంతోనే సాధ్యమైందని సందేహాలు బలపడుతున్నాయి. 7.తాత్కాలిక ఏఈపీ కట్టుకథేనా!? శ్రీనివాసరావుకు 2018 అక్టోబరు 1 నుంచి 30వరకు ఇచ్చామని చెబుతున్న తాత్కాలిక ఏఈపీ కూడా సందేహాస్పదమే. ఏఈపీ జారీకి కేంద్ర విమానయాన సంస్థ మార్గదర్శకాలను నిర్దేశించింది. ప్రైవేటు వ్యక్తులకు ఒక రోజు నుంచి 3 రోజులకు ఒక కేటగిరీ, 4 రోజుల నుంచి 90 రోజులకు మరో కేటగిరీ కింద ఏఈపీలు కేటాయిస్తారు. నెల రోజులకు తాత్కాలిక ఏఈపీ అన్నది ఏఏఐ మార్గదర్శకాల్లో లేదు. మరి నిందితుడికి అక్టోబరు నెల రోజులకు తాత్కాలిక ఏఈపీ ఎలా జారీచేశారు? అంటే.. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన తరువాత కేసును తప్పుదారి పట్టించేందుకే అప్పటికప్పుడు తాత్కాలిక ఏఈపీ అన్నది సృష్టించారని తేటతెల్లమవుతోంది. అనామకుడైన శ్రీనివాసరావుకు అంతటి పరపతి ఉండదు కదా. మరి దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? మొదటి నుంచి శ్రీనివాసరావుది రెస్టారెంట్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉండే బీ షిఫ్ట్ డ్యూటీ. జగన్‌గారిపై దాడి చేసిన రోజు మాత్రం ఉదయమే విధుల్లోకి వచ్చినా.. రెస్టారెంట్లోనే ఉన్న హర్షవర్ధన్ చౌదరి నిందితుడు శ్రీనివాస్‌ను ఎందుకు ప్రశ్నించలేదు? శ్రీనివాసరావు ఉద్యోగం అసిస్టెంట్ కుక్ అయితే సర్వీస్ అసిస్టెంట్ చేసే పని అతను చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? వీఐపీ లాంజ్‌లోకి సర్వీస్ అసిస్టెంట్‌గా వెళ్లడానికి ఎవరు అనుమతించారు? జగన్‌తో సెల్ఫీ కోసం అని శ్రీనివాసరావు చెప్పాడనుకున్నా.. అతని వద్ద కెమెరా ఫోన్ లేదని రెస్టారెంట్లో ఉన్న వారందరికీ తెలుసు. అప్పుడైనా కెమెరా ఫోన్ లేకుండా సెల్ఫీ ఏమిటని అడగాలి? కనీసం అప్పటివరకు అక్కడే ఉన్న హర్షవర్ధన్ చౌదరిని అయినా ప్రశ్నించాలి. కానీ, సిట్ ప్రశ్నించలేదు? ఎందుకు? గత రెండున్నర నెలలుగా జగన్‌గారు ఎయిర్‌పోర్ట్‌కు ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీ స్థానిక వార్డు అధ్యక్షుడు శ్రీధర్ ఇంటి నుంచి కాఫీ వచ్చేది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఆయన నేరుగా విమానం దిగి బయటకు వచ్చి పాదయాత్ర జరిగే ప్రాంతానికి వెళ్లిపోతారు. హైదరాబాద్‌కు వెళ్లేటప్పుడు కాస్త సమయముంటే వీవీఐపీ లాంజ్‌కు వెళ్లి పార్టీ నేతలతో భేటీ అవుతారు. అయితే, ఘటన జరిగే వారం ముందే జగన్‌గారికి బయటి నుంచి కాఫీ తీసుకురావడం కుదరదని ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) వేణుగోపాల్ అడ్డుకున్నారు. కాఫీ ఫ్లాస్క్ స్వాధీనం చేసుకుని సీరియస్ అయ్యారు. పక్కనే ఉన్న రెస్టారెంట్ నుంచే తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇలా అన్న రెండో వారమే ఆ రెస్టారెంట్ నుంచి శ్రీనివాసరావు వచ్చి కత్తి దూశాడు. రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగిందని తెలుస్తున్నా ఈ దిశగా కనీస విచారణ ఎందుకు జరగలేదు? అక్టోబరు 25న వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగే సమయానికి సరిగ్గా పది నిమిషాల ముందే హర్షవర్ధన్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లడం, ఘటన తర్వాత.. ‘శ్రీనివాసరావు చాలా మంచోడండీ.. అమాయకుడండీ, ఏదో అభిమానంతో పిచ్చి పనిచేసుంటాడు’.. అని హర్షవర్ధన్ చౌదరి వకాల్తా పుచ్చుకోవడం వెనక ఉద్దేశం ఏమిటి? హర్షవర్ధన్‌ను సిట్ కనీసం ప్రశ్నించడానికి కూడా ఎందుకు సాహసించలేకపోయింది? సీఎస్‌వో వేణుగోపాల్ మొదటి నుంచి టీడీపీ తొత్తుగా ఉంటూ వైఎస్సార్సీపీ నేతలపై వ్యతిరేకత ప్రదర్శిస్తుంటాడనేది ఎయిర్‌పోర్ట్‌లో అందరికీ తెలుసు. గతంలో ఓసారి ఎంపీ విజయసాయిరెడ్డి పట్ల కూడా ఒకింత దురుసుగా ప్రవర్తించిన దాఖలాలున్నాయి. టీడీపీ నేతలతో అంటకాగే వేణుగోపాల్.. హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరికి కుట్రకోణంలో సహకరించాడన్న వాదనలకు బలం చేకూరుస్తోంది. మరి ఈ ఇద్దరిని నిందితులుగా సిట్ ఎందుకు చేర్చలేదు? అలా చేస్తే కుట్ర మొత్తం బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలకు భయమా? హర్షవర్ధన్ చౌదరినిగానీ, సీఎస్‌వో వేణుగోపాల్నుగానీ ఇంతవరకు ప్రశ్నించలేదు. అనుమానపు వేళ్లన్నీ వారిద్దరినీ చూపిస్తుంటే పోలీసులు వారిని ఎందుకు పిలిచి విచారించలేదు? జగన్‌పై హత్యాయత్నం జరిగిన వీఐపీ లాంజ్‌లో సీసీ కెమెరాలు లేవని అధికారులు చెబుతున్నారు. కానీ, ఫ్యూజన్ ఫుడ్స్ మొత్తం సీసీ టీవీ నిఘాలోనే ఉంది. నిందితుడు ఉపయోగించిన కత్తిని వాటర్ బాటిల్, నాప్కిన్ చాటుగా తెచ్చాడని చెబుతున్నారు. మరి రెస్టారెంట్లోనే భద్రపరిచిన కత్తిని అక్కడే నాప్కిన్లో పెట్టి తీసుకువచ్చినప్పుడు సీసీ ఫుటేజీ ఉంటుంది. కానీ, పోలీసులు ఎందుకు ఫ్యూజన్ రెస్టారెంట్ జోలికి వెళ్లలేదు? 8.ఎన్వోసీ పోలీసుల సృష్టేనా? విమానాశ్రయంలో పనిచేసే వ్యక్తులకు ఎలాంటి నేరచరిత్ర లేదని నిర్ధారిస్తూ ఇచ్చిన ఎన్వోసీ తప్పనిసరిగా ఉండాలి. దాని ఆధారంగానే విమానాశ్రయంలో ప్రవేశానికి ఏఈపీ జారీచేస్తారు. నిందితుడు శ్రీనివాసరావు ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం చేసిన వెంటనే అందరి మదిలో మెదిలిన ప్రశ్న. ‘అతనికి ఎన్వోసీ ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు’? అని. అందులోనూ శ్రీనివాసరావుపై అతని స్వస్థలంలో ఓ క్రిమినల్ కేసు నమోదై ఉంది. మరి అతనికి ఎన్వోసీ ఎలా ఇచ్చారన్నది కీలకంగా మారింది. హత్యయత్నం కేసులో కుట్ర కోణాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు పోలీసుల ద్వారా కట్టుకథకు తెరతీశారు. మొదట శ్రీనివాసరావుకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులే ఎన్వోసీ ఇచ్చారని విశాఖ పోలీసులు చెప్పారు. తాము ఎన్వోసీ ఇవ్వలేదని ముమ్మడివరం ప్రస్తుత ఎస్సై, గతంలో పనిచేసిన ఎస్సై కూడా తెలిపారు. దాంతో విశాఖ పోలీసులు మరో కథ వినిపించారు. శ్రీనివాసరావు విశాఖలో నివసిస్తున్నందున ఆ పరిధిలోని విమానాశ్రయ పోలీస్‌స్టేషన్ నుంచి ఎన్వోసీ తీసుకున్నాడని విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా చెప్పారు. కాగా, ఢిల్లీలోని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డీజీ కుమార్ రాజేష్ చంద్ర వెల్లడించిన సమాచారంతో అసలు వాస్తవం బట్టబయలైంది. ఎంపీ విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక వివరణలో.. అసలు శ్రీనివాసరావు పేరిట తమకు ఎన్వోసీ రాలేదని ఆయన వెల్లడించడం గమనార్హం. విమానాశ్రయంలో ప్రవేశానికి అవసరమైన ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ కోసం శ్రీనివాసరావుగానీ, రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరిగానీ దరఖాస్తు చేయనేలేదని తెలిపారు. ఏఈపీ కోసం దరఖాస్తు చేయనప్పుడు ఎన్వోసీ సమర్పించాల్సిన అవసరమే ఉత్పన్నం కాదని కుండబద్దలు కొ ట్టారు. అంటే శ్రీనివాసరావు పేరిట (బీసీఏఎస్)కి ఎలాంటి ఎన్వోసీ సమర్పించలేదని స్పష్టమవుతోంది. మరి శ్రీనివాసరావు పేరిట విశాఖ పోలీసులు ఎన్వోసీ ఇచ్చారని పోలీస్ కమిషనర్ చెప్పడం వెనుక లోగుట్టు ఏమిటి? ఈ హత్యాయత్నం వెనుక ఎవరి పాత్రను కప్పిపుచ్చేందుకు పోలీసులు ఈ కట్టుకథ వినిపించారు? ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పకపోవడం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్రను చెప్పకనే చెబుతోంది. 9.సీసీ కెమెరాలు ఆఫ్.. కుట్ర ఆన్.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించగానే సూత్రదారులు, పాత్రధారులు తమ కుట్ర కార్యాచరణను వేగవంతం చేశారు. ఆయన హత్యకు కార్యస్థలిగా ఎంపిక చేసుకున్న విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆపేశారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు హైకోర్టులో విచారణ సందర్భంగా విమానాశ్రయంలో మూణ్ణెళ్లుగా సీసీ కెమెరాల ఫుటేజీలేదని సిట్ పోలీసులే చెప్పారు. అంటే ఆగస్టు నుంచి సీసీ కెమెరాలు పనిచేయడంలేదని స్పష్టమైంది. వైఎస్ జగన్ పాదయాత్ర 2018, ఆగస్టు 14న విశాఖ జిల్లాలో ప్రవేశించింది. అప్పటి నుంచి ఉత్తరాంధ్రలో పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రతివారం విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగించాలి. దాంతో ఆయన్ని విమానాశ్రయంలో అంతమొందించాలన్న కుట్రకు ముందస్తు వ్యూహంలో భాగంగానే సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే జగన్‌పై హత్యాయత్నం కుట్ర ఆధారసహితంగా బట్టబయలయ్యేదని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. హత్యాయత్నం చేసిన అక్టోబరు 25న నిందితుడు శ్రీనివాసరావు విమానాశ్రయంలో ప్రవేశం, అతనికి సహకరించిన మరికొందరి చర్యలు, వీఐపీ లాంజ్ వద్ద నిందితుడి ప్రవర్తన.. అదను చూసి కత్తిదూయడం, ఆ వెంటనే అతనికి సహకరించిన వారి స్పందన మొదలైన దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యేవి. ఈ కుట్రకు సహకరించిన వారేవరో తెలిసేది. వారిని విచారిస్తే ప్రభుత్వ పెద్దల బండారం బహిర్గతమయ్యేది. ఇది ఊహించే ప్రభుత్వ పెద్దలు సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని పోలీసు ఉన్నతాధికారి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రశ్న : పక్కా పన్నాగంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం ఎవరికి సాధ్యం? సీసీ కెమెరాలు 3 నెలలుగా పనిచేయకున్నా భద్రతా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? దీని వెనుకున్న పెద్దలెవరు? సహకరించిన అధికారులెవరు? రెస్టారెంట్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్‌తో విమానాశ్రయ భద్రతా అధికారి వేణుగోపాల్‌కు ఉన్న సాన్నిహిత్యం ప్రభావమెంత? 10.హత్యాయత్నం గురితప్పింది.. ‘సిట్’ విచారణ దారి తప్పింది కుట్ర పన్ని ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎప్పటి లాగే ఆ గురువారం (అక్టోబరు 25న) కూడా విశాఖ విమానాశ్రయానికి వచ్చిన జగన్.. వీఐపీ లాంజ్‌లో ఉన్నప్పుడు శ్రీనివాసరావు వచ్చి పదునైన కత్తిని జగన్ గొంతులోకి దించే లక్ష్యంతో పాశవిక దాడికి పాల్పడ్డారు. కత్తి గొంతులో దిగి ఉంటే.. ప్రాణం దక్కడం అనుమానమే. అదృష్టవశాత్తూ..జగన్ పక్కకు వంగడంతో గొంతులో దిగాల్సిన కత్తి గురితప్పి భుజంలో దిగింది. దీంతో జగన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కత్తిపోటు గురితప్పడంతో.. కుట్ర సూత్రధారుల బండారం బయటకు రాకుండా ‘సిట్’ దర్యాప్తును ప్రభుత్వ పెద్దలు దారి తప్పించారు. ఈ విచారణ దారి తప్పడంతో ఎన్నో అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు, విమానాశ్రయ అధికారులకూ ఎన్నో సందేహాలు ఏర్పడ్డాయి. వారికి ఉన్న అనుమానాలను ‘సాక్షి’ బృందంతో పంచుకున్నారు. వారి అనుమానాలు ఇవీ.. డీజీపీ, మంత్రులు, సీఎం మాటలకు అర్థాలే వేరులే.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద విశాఖపట్నం విమానాశ్రయంలో అక్టోబరు 25 గురువారం మధ్యాహ్నం 12.45–12.48 మధ్య హత్యాయత్నం జరిగింది. ప్రతిపక్ష నేతను హతమార్చడానికి పాశవిక దాడి జరిగితే తక్షణ విచారణ చేపట్టి నిగ్గుతేల్చాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. హత్యాయత్నం జరిగిన తర్వాత నిందితుడిని సీఐఎస్ఎఫ్ తన కస్టడీలోకి తీసుకుంది. ప్రశ్న–1: వైఎస్ జగన్ మీద హత్యాయత్నం జరిగిన 40 నిమిషాల్లోనే (అప్పటికి నిందితుడు సీఐఎస్ఎఫ్ కస్టడీలో ఉన్నాడు. సీఎస్ఐఎఫ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. నిందితుడిని విచారించలేదు) మధ్యాహ్నం 1.30కు డీజీపీ మీడియాతో మాట్లాడారు. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు, జగన్ అభిమాని అని చెబుతూ అతని పేరు, ఊరు ప్రకటించారు. ప్రచారం కోసమే హత్యాయత్నం చేశాడని వెల్లడించారు. పోలీసుల కస్టడీలోకి రాకముందే నిందితుడి వివరాలు ఎలా వెల్లడించగలిగారు? విచారణ మొదలుపెట్టకముందే హత్యాయత్నం వెనక ఉద్దేశాన్ని ఎలా చెప్పారు? డీజీపీ ప్రెస్మీట్లో చెప్పిన విషయాలకు ఆధారమేమిటి? ప్రశ్న–2: డజీపీ మీడియా సమావేశం ముగిసిన వెంటనే.. మ.2 గంటలకు ముగ్గురు మంత్రులు లైవ్‌లోకి వచ్చారు. నిందితుడి వివరాలతో పాటు జగన్ బొమ్మతో ఉన్న ఫ్లెక్సీని మొబైల్లో చూపించారు. హత్యాయత్నానికి 10 నెలల ముందు ఎక్కడో మారుమూల గ్రామంలో వేసినట్లుగా చెబుతున్న ఫ్లెక్సీ మంత్రులకు ఎలా వచ్చింది? నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకోకముందే.. విచారణ ప్రారంభం కాకముందే నిందితుడి పేరు తప్ప మరే వివరాలు వెల్లడించకముందే నిందితుడి గ్రామం, ఫ్లెక్సీ, ఏ పార్టీ అనే విషయాలు మంత్రులు ఎలా చెప్పగలిగారు? నిందితుడు వెల్లడించకముందే ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసిపోవడం ఎలా సాధ్యం? మంత్రులు అచ్చెన్నాయుడు, ఆదినారాయణరెడ్డి, నక్కా ఆనందబాబు తదితరులు మీడియా ముందుకు వచ్చారు. హత్యాయత్నం జరిగిన ప్రాంతం కాని, హత్యాయత్నానికి ఒడిగట్టిన నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామంగాని ఆ మంత్రులకు చెందిన జిల్లాల్లో లేవు. వారి శాఖలకూ సంబంధంలేదు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారా? వారికి సమాచారం ఎవరు చెప్పారు? ప్రశ్న–3: సా.4 గంటలు దాటిన తర్వాత సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4.30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. సీఆర్పీసీ–156 ప్రకారం.. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత విచారణకు అవకాశం ఉంటుంది. సా.4.30 గంటల వరకు నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వలేదని సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారు. నిందితుడిని 4.30 తర్వాత కస్టడీలోకి తీసుకున్నామని ఆయనే చెబితే... అంతకు 3 గంటల ముందే డీజీపీ, మంత్రులు అన్ని వివరాలు ఎలా చెప్పగలిగారు? ప్రశ్న–4: సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ చేసిన ఫిర్యాదులో నిందితుడిది ఏ ఊరనే విషయంలేదు. వారి కస్టడీలో ఉన్న నిందితుడి వివరాలు సీఐఎస్ఎఫ్కు తెలియలేదు. మరి ప్రభుత్వ పెద్దలకు ఎలా తెలిశాయి? హత్యాయత్నంపై టీడీపీ నేతలకు ముందే సమాచారం? వైఎస్ జగన్‌పై జనుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడిన వెంటనే ఠానేలంకలోని నిందితుడి ఇంటి ముంగిట స్థానిక టీడీపీ నేతలు వచ్చి వాలిపోయారు. హత్యాయత్నం జరిగిన (అక్టోబరు 25వ తేదీ, గురువారం) వెంటనే టీవీల్లో చూసి అదే గ్రామానికి చెందిన జనుపల్లి ఇంటిపేరు ఉన్న వారిలో చాలామంది.. ఈ శ్రీనివాస్ ఎవరు అని బంధువులకు ఫోన్లుచేసి ఆరా తీస్తుండగానే తమకు ముందుగానే తెలిసినట్లుగా టీడీపీ నేతలు నిందితుడు ఇంటి వద్ద వాలడం.. నిందితుడికి అధికార పార్టీ పెద్దలతో ఉన్న సంబంధాలను స్పష్టంచేస్తోందని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగిన వెంటనే నిందితుడు శ్రీనివాసరావు ఇంటి వద్దకు చేరిన టీడీపీ నాయకులు (ఫైల్) మీడియా కంటే ముందుగానే అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు.. శ్రీనివాసరావు జగన్ అభిమాని అంటూ వారే మీడియా ముందుకు వచ్చి చెప్పారు. స్థానికులు ఎవరైనా మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగానే.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు, కేశవస్వామి దేవస్థానం చైర్మన్ నడింపల్లి శ్రీనివాసరాజు, ఠానేలంక గ్రామ టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేశ్వరావు, జన్మభూమి కమిటీ సభ్యుడు ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకుడు ఇసుకపట్ల ఈశ్వర్‌కుమార్‌లు ముందుకు వచ్చారు. వీరితో పాటు టీడీపీ నేత ఇసుకపట్ల వెంకటేశ్వరావుతో పాటు పలువురు కార్యకర్తలు మీడియా ముందు నిలబడి వారే ఇరుగుపొరుగు వ్యక్తుల్లా మాట్లాడారు. టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాసరావు జగన్ అభిమాని అంటూ పదేపదే చెప్పడం కనిపించింది. శ్రీనివాసరావు కుటుంబీకుల కంటే టీడీపీ నేతలే మీడియా ముందుండటం కొసమెరుపు. వారన్నట్టుగానే శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ మనిషి అయితే టీడీపీ నేతలు భుజాలు తడుముకొంటున్నట్లుగా అక్కడకు ఎందుకు వచ్చారు? జగన్ మీద హత్యాయత్నానికి తెగబడింది వైఎస్సార్సీపీ అభిమాని అని టీడీపీ ప్రచారం చేస్తోంది. మరి నిందితుడి ఇంటికి అంత వేగంగా టీడీపీ నేతలు వచ్చి వాలడం ఎందుకు? వారికేం సంబంధం ఉందని వచ్చారు? ప్రచారం కోసమే వైఎస్సార్సీపీ అభిమాని జగన్ మీద దాడిచేశారని డీజీపీ ప్రకటించారు. దాన్ని నిజమని భావిస్తే.. టీడీపీ నేతలు నిందితుడి ఇంటికి వెళ్లరు. వెళ్లాల్సిన అవసరమూలేదు. కానీ, అందుకు భిన్నంగా టీడీపీ నేతలు అక్కడకు వెళ్లడం, నిందితుడి కుటుంబం వైఎస్సార్సీపీ అని పదేపదే మీడియాకు చెప్పడానికి ప్రయత్నించడం వెనక ఉద్దేశాలను వెలికి తీయడానికి సిట్ బృందం ఎందుకు ప్రయత్నించలేదు? నిందితుడు ఇంటికి వెళ్లమని వారికి ఎవరి నుంచి ఆదేశాలు అందాయి? టీడీపీ పెద్దల్లో ఎవరు వారికి సూచించారు? ఈ అంశాన్ని నిగ్గు తేల్చడానికి వారి కాల్‌డేటా పరిశీలిస్తే ఇట్టే తేలిపోతుంది. కానీ, సిట్ ఈ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయలేదు? వాళ్ల కుటుంబం టీడీపీ అని అంటుంటారు జగన్ పార్టీ వాళ్లకు ఇంటి లోన్లు మంజూరు చేయలేదు. మా బంధువుకు ఇవ్వలేదు. ‘జనుపల్లి’ వాళ్లలో టీడీపీ వాళ్లు ఉన్నారు. వాళ్లకు లోన్లు వచ్చాయి. వాళ్ల కుటుంబం కూడా టీడీపీ అని అంటుంటారు. వాళ్ల చిన్నాన్న నాగేశ్వరరావు టీడీపీయే. మా అబ్బాయి వెంకటేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం పెళ్లిలో మా అబ్బాయి వెంకటేష్‌ను శ్రీనివాస్, అతని స్నేహితులు కలిసి కొట్టారు. అంతకు పదిహేను రోజుల క్రితం మా అబ్బాయి పడిపోతే చెయ్యి విరిగిపోయింది. రాజేష్ అన్న కుర్రాడు వచ్చి మీ అబ్బాయిని కొట్టిపడేశామని చెప్పాడు. పెద్దల్లో పెట్టినా కూడా ఎవరూ స్పందించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాం. గోపాలం, జనుపల్లి నాగేశ్వరరావు అనేవాళ్లు వచ్చి కేసు రాజీ చేసుకోవాలని కోరారు. కానీ, కేసు వెనక్కి తీసుకోలేదు. వాళ్ల చిన్నాన్న గ్రామ పంచాయితీ వైస్ ప్రెసిడెంట్. టీడీపీ నేత. వాళ్ల కుటుంబం కూడా టీడీపీ అని అంటుంటారు. – కాగిత వెంకటేష్ తల్లి సీతారత్నం, శ్రీనివాసరావుపై గతంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి కేస్ క్లోజ్ అంటున్నారు కేసులు కొట్టేశారని చెప్పుకుంటున్నారు. ప్లీడర్లు వస్తున్నారు. బెయిల్ ఇప్పిస్తామని వీళ్లని అడుగుతున్నారట. విమానాశ్రయంలో ఉద్యోగం కోసం ఎలా వెళ్లాడో మాకు తేలీదు. ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడని టీవీలో చూసిన తర్వాతే మాకు తెలిసింది. సర్వశిక్షాభియాన్‌లో ఔట్ సోర్సింగ్ టీచర్ పోస్టు కోసం కాకినాడ వెళ్తే.. నా రెజ్యూమ్‌లో ఇంటి పేరు జనుపల్లి అని చూసి ఆ అబ్బాయి (శ్రీనివాస్) మీకు ఏమవుతాడు అని అడుగుతున్నారు. మీకు ఉద్యోగాలు రావు అంటున్నారు. –టీడీపీ ఉపసర్పంచ్ నాగేశ్వరరావు (నిందితుడు బాబాయి) కుమార్తె నాగమణి వాడివల్ల మూడు జీవితాలు నాశనమవుతున్నాయి ఆ దుర్మార్గుడు మమ్మల్ని ఇరికించాడు. మా కూతురు వాళ్ల ఇంటిలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడితే దానితో ఎవరికో చేశాడు. పోలీసులు నా కూతురుకు ఫోన్‌చేసి రావాలన్నారు. ఆ ఫోన్లోని సిమ్ పోలీసులు తీసుకున్నారు. వాడు ఫోన్ వాడటంవల్ల మూడు జీవితాలు నాశనమవుతున్నాయని బాధపడుతున్నాం. ఎంతో జాగ్రత్తగా ఉండేవాళ్లం. కానీ, వీడివల్ల అంతా ఏడుస్తున్నాం. నా కొడుకైనా.. ప్రాణం తీసేసినా తప్పులేదు. సామాన్యమైన పని చేయలేదు. – శ్రీనివాస్ పిన్ని (పక్క ఇల్లు) నిందితుడు స్నేహితుడు ఉన్నట్లుండి ధనవంతుడయ్యారు నిందితుడు శ్రీనివాసరావు నాలుగో అన్నకు తోడల్లుడు, తనకు స్నేహితుడు అయిన ఈశ్వరరావు గత ఏడాది కాలంలో లక్షాధికారి అయ్యాడు. ట్రాక్టర్, టాటా ఏస్, ఇండికా కారు, పల్సర్ బైక్ కొనుగోలు చేయడంతో పాటు శానపల్లిలంక (ఈశ్వరరావు సొంత గ్రామం)లో హైస్కూల్ ప్రహరీ గోడ కాంట్రాక్టును స్థానిక ఎమ్మెల్యే సిఫార్సులో సొంతం చేసుకున్నాడు. ఈ కాంట్రాక్టు విలువ రూ.14 లక్షలు. ఊర్లో బెల్ట్‌షాప్ నడుపుతూ పొట్టపోసుకునే వ్యక్తి హఠాత్తుగా అన్ని వాహనాలు కొనగడం, పి.గన్నవరం ఎమ్మెల్యే పులిపర్తి నారాయణమూర్తి సిఫార్సుతో రూ.14 లక్షల విలువైన కాంట్రాక్టు పొందడం సాధారణ విషయం కాదు. నిందితుడికి టీడీపీ నేతలతో ఉన్న సంబంధాలే అందుకు కారణం అని గ్రామస్తుల అనుమానం. శ్రీనివాసరావు బినామీగా ఈశ్వరరావు వ్యవహరించాడని అంటున్నారు. శ్రీనివాస్ అన్న సుబ్బరాజుది టీడీపీ అంటారు ‘జనుపల్లి శ్రీనివాస్ అన్నయ్య సుబ్బరాజుది టీడీపీ అంటారు. నాతో పాటు మరో ముగ్గురు స్నేహితులు ప్రభాకర్, చిట్టి, వెంకట దుర్గాప్రసాద్‌లను సిట్ అధికారులు ముమ్మిడివరం పిలిచి విచారించారు. స్నేహితులమని మమ్మల్ని పిలిచారు. శ్రీనివాస్ ఎటువంటి వాడు, అతని మనస్తత్వం ఎటువంటిది. ఎలా ఉండేవాడని అడిగారు. ఊళ్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. రెండు నెలల క్రితం కనిపించాడు. ఒరేయ్ అంటే ఒరేయ్ అనుకునే వాళ్లం. రావడం, వెళ్లిపోవడం తప్ప ఎక్కువ రోజులు ఇక్కడ ఉండేవాడు కాదు. – మెల్లం రాజు, సిట్ విచారణ ఎదుర్కొన్న శ్రీనివాసరావు స్నేహితుడు పిల్లల్ని వీధిలో పెట్టాడు.. అభిమానైతే పొడిచేస్తాడా? ఇంట్లో పిల్లలందరినీ వీధిలో పెట్టాడు. అభిమానైతే కత్తితో పొడిచేస్తాడా? ఏదో జరిగింది? వెనకెవరో ఉండి ఉంటారు. ఫ్లెక్సీలు ఎవరు బాగా వేస్తారని మా అబ్బాయి గిడ్డి చైతన్యను అడిగినప్పుడు పి.గన్నవరంలో తనకు తెలిసిన ఫ్లెక్సీలు తయారుచేసే షాపు ఒకటి ఉందని.. దాని అడ్రసు ఇచ్చాడు. పి.గన్నవరంలోని ఫ్లెక్సీల షాపు అతనికి మా అబ్బాయి ఫోన్‌చేసి శ్రీనివాసరావు వస్తాడు.. ఫ్లెక్సీ వేసిపెట్టు అని మాత్రమే చెప్పాడు. శ్రీనివాసరావుకు, మా అబ్బాయికి అంత స్నేహం లేదు. ఫ్లెక్సీ షాపు గురించి వివరాలు అడగడం.. అది శ్రీనివాసరావుకు చెప్పడం.. ఫ్లెక్సీ షాపు వాడు ‘ఫ్రూఫ్ ఫ్లెక్సీ’ని మా అబ్బాయి సెల్‌కు పంపించడంతో మా వాడు పోలీసుల విచారణ ఎదుర్కోవలసి వచ్చింది. – సిట్ విచారణ ఎదుర్కొన్న గిడ్డి చైతన్య తల్లి శ్రీనివాస్ ఫోన్లో నెంబర్లున్న యువకులను విచారించారు జగన్‌గారిపై హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావు ఇంటి పేరుతో ఉన్న తామంతా బంధువులేమే. అయితే, శ్రీనివాసరావు ఫోన్లో ఫీడ్ అయిన నెంబర్ల ఆధారంగా వాడి వయస్సుతో సమానంగా ఉన్న తమ ఊరు ముఖ్యంగా పెదపేట యువకులను సిట్ పోలీసులు విచారించారు. – జనుపల్లి సతీష్, సిట్ విచారణ ఎదుర్కొన్న శ్రీనివాస్ స్నేహితుడు -
పోలీసు నియామక నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: రాష్ట్రంలో 3,057 మంది పోలీసుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ సోమవారం ఈ మేరకు నోటిఫికేషన్ వివరాలు వెల్లడించారు. 2016లో 5,516 మంది కానిస్టేబుళ్లు, 707 మంది ఎస్ఐ, ఏఎస్ఐలను, 16 మంది అసిస్టెంట్ జైలర్లు, 265 జైలు వార్డర్లు, నలుగురు అసిస్టెంట్ మాట్రిన్లను నియమించినట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,234 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో కొత్తగా 3,057 పోస్టులు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించామని వివరించారు. సివిల్ ఎస్ఐ 150, ఏఆర్ ఆర్ఎస్ఐ 75, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ 75, డిప్యూటీ జైలర్ 14, వార్డర్ 123, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 20, ఫైర్‌మెన్ 400, సివిల్ కానిస్టేబుల్ 1,600, ఏఆర్ కానిస్టేబుల్ 300, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 300 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు చెప్పారు. వెబ్సైట్లో ‘ఎస్ఎల్పీఆర్బీ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ ద్వారా ఆన్లైన్లో ఎస్ఐ, ఆర్ఎస్ఐ, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ పోస్టులకు ఈనెల 24వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ సూచించారు. వీరికి డిసెంబర్ 16న రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో, తుది పరీక్ష ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వారికి వచ్చే ఏడాది జనవరి 6న ప్రాథమిక రాతపరీక్ష, ఫిబ్రవరి రెండో వారంలో దేహదారుఢ్య పరీక్ష, మార్చి మూడో వారంలో తుది పరీక్ష నిర్వహిస్తామని డీజీపీ చెప్పారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీలకు రూ.300, ఎస్సీ, ఎస్టీలకు రూ.150. కాగా, కానిస్టేబుళ్ల పదోన్నతుల కసరత్తు ఆఖరి దశలో ఉందని, వీలైనంత త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామని డీజీపీ వివరించారు. సమావేశంలో ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ పాల్గొన్నారు. -
చంద్రబాబుకు మూడింది.. ఇంకో 4 నెలల్లో..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం డ్రామా అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికే హత్యాయత్నమే అని రిమాండ్ రిపోర్టు వెల్లడించిందని రమేష్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు వంత పాడుతూ.. తప్పుడు ప్రకటన చేసిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెంపలేసుకోవాలనీ, ఉద్యోగానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీతో సహా అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ నాయకులు సిగ్గుతో తల దించుకోవాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పతనానికి ఇంకో నాలుగునెళ్లు మాత్రమే ఉందని జోస్యం చెప్పారు. ‘ఆపరేషన్ గరుడ’ అని సృష్టించింది చంద్రబాబేనని ఆరోపించారు. నటుడు శివాజీని పావుగా వాడుకుని బాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మతిలేని బాబూ.. చూడు వైఎస్ జగన్‌పై దాడి చేసింది ఆయన అభిమానే అని విష ప్రచారాలు చేస్తున్న మతి లేని ముఖ్యమంత్రి వాస్తవాలు తెలుసుకోవాలని రమేష్ హితవు పలికారు. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తేనని ఆయన ఉద్ఘాటించారు. శ్రీనివాసరావు పేరుతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఐడెంటిటీ కార్డును చూపారు. -
కేంద్రానికి గవర్నర్ సీక్రెట్ ఏజెంట్
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర గవర్నర్ డీజీపీకి ఫోన్ చేసి, ఘటన గురించి అడుగుతారా? అధికారులకు గవర్నర్ నేరుగా ఫోన్లు చేయవచ్చా? కేంద్రానికి గవర్నర్ సీక్రెట్ ఏజెంట్‌గా ఉండడం తప్ప ఆ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి?’’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద ప్రజావేదిక హాలులో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఐపీఎస్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గవర్నర్ ఎవరు? కేంద్రానికి గూఢచారిలా వ్యవహరించడం మినహా ఆయన ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. అందుకే గవర్నర్ వ్యవస్థనే వ్యతిరేకించానని చెప్పారు. జగన్‌పై దాడి జరగ్గానే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత వేగంగా స్పందించారని, తిత్లీ తుపాన్‌పై వారు ఎందుకు స్పందించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల నుంచి రౌడీలను తీసుకొస్తారు రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు కేంద్ర ప్రభుత్వ అండ ఉందని, అందుకే అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఈ సవాళ్లను నియంత్రించకపోతే అశాంతి తలెత్తుతుందని అన్నారు. ఎప్పుడో నాలుగు నెలల క్రితం ‘ఆపరేషన్ గరుడ’ స్క్రిప్ట్‌లో రాసింది రాసినట్టుగా ఇప్పుడు జరుగుతోందని చెప్పారు. సినీ నటుడు శివాజీ చెప్పినట్టే అంతా జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతపై కావాలనే ప్రాణహాని లేని దాడి చేసి రాష్ట్రమంతా అల్లర్లు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకున్నారని ఆరోపించారు. ఇంకా చాలా కుట్రలు చేస్తారని, దానికి మానసికంగా సిద్ధం కావాలని ఐపీఎస్ అధికారులకు సూచించారు. రానున్న కాలంలో అవసరమైతే బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి రౌడీలను తీసుకొచ్చి అల్లర్లు సృష్టిస్తారని, ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించి, రాష్ట్రపతి పాలన తెచ్చి తాము కోరుకున్న పార్టీని గెలిపించేలా కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఆలయాల దగ్గర కుట్రలు చేస్తారు రాష్ట్రంలో మూడోసారి మూకుమ్మడిగా ఆదాయపు పన్ను(ఐటీ) దాడులు చేస్తున్నారని, వ్యాపారుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వీళ్లు(కేంద్రం) చెప్పేవన్నీ చేయలేమన్న ఏపీ అధికారులను తొలగించి, ఉత్తరప్రదేశ్ నుంచి ఐటీ అధికారులను రప్పిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో దేవాలయాల దగ్గర కుట్రలు చేస్తారని, చర్చిలు, మసీద్లపైనా దాడులు జరుగుతాయని అన్నారు. తిరుమలను వివాదాస్పదం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని, రాష్ట్ర సర్కారును హిందువులకు వ్యతిరేకం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రమణ దీక్షితులు ద్వారా బురద జల్లించారని, నగలు మాయం అయ్యాయని అపోహలు రేకెత్తించారని విమర్శించారు. గతంలో ఇలాంటి ఘటనలు తలెత్తితే అణచివేశామని, భవిష్యత్తులోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్‌హెచ్ అధికారులపై కేసులు పెట్టండి రహదారి ప్రమాదాల నియంత్రణలో శాస్త్రీయ విధానాలు అనుసరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జాతీయ రహదారుల(ఎన్‌హెచ్) ఇంజనీరింగ్ అధికారులపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆయన శుక్రవారం ఉండవల్లి ప్రజాదర్బార్ హాలులో ఐపీఎస్ అధికారులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. ప్రజల ప్రాణాలను తీసే హక్కు ఎన్‌హెచ్ అధికారులకు ఎవరిచ్చారని అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో 2016లో 6,442 మంది, 2017లో 6,126 మంది, 2018లో ఇప్పటివరకు 5,653 మంది చనిపోయారని చెప్పారు. అనైతిక కార్యకలాపాలు, అరాచక శక్తుల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. ఆర్ధిక నేరాలను పూర్తిగా నియంత్రించాలని పేర్కొన్నారు. సైబర్ నేరాలే భవిష్యత్తులో అతిపెద్ద నేరాలు కానున్నాయని, వాటిని పూర్తిగా నియంత్రించాలని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగు ఆనవాళ్లు కనుగొనేందుకు డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఫొటోల మార్ఫింగ్‌కు అడ్డుకట్ట వేయాలి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడి ఫొటో పక్కన తన ఫొటో పెట్టి నిన్ననే మార్ఫింగ్ చేశారని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫొటో తీసుకునే మార్ఫింగ్ చేశారంటే అదే సైబర్ మార్ఫింగ్ అని పేర్కొన్నారు. దాన్ని అడ్డుకోలేకపోతే భవిష్యత్తులో అనేక అనర్థాలు సంభవిస్తాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అనుమతి లేకుండా విగ్రహాలు పెట్టడానికి వీల్లేదన్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాట్లాడారు. శాంతిభద్రతల ఏడీజీ హరీష్‌కుమార్ గుప్తా, పలువురు ఐపీఎస్ అధికారులు, 13 జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. -
జేబులో మడిచి పెట్టినా నలగని లేఖ!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కత్తితో హత్యాయత్నం చేసిన దుండగుడు శ్రీనివాసరావు వద్ద లభించిన లేఖ పోలీసుల సృష్టేనని స్పష్టమవుతోంది. దీనిపై పోలీసులు రోజుకో కథ అల్లుతుండడంతో ఆ లేఖ సృష్టించిందేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే.. - డీజీపీ ఠాకూర్ గురువారం మధ్యాహ్నం అమరావతిలో మీడియాకు ప్రకటించే వరకు అసలు లేఖ విషయమే ఎవరికీ తెలీదు. - అనంతరం లేఖ ఉందని చెబుతూ వచ్చిన పోలీసులు ముందు 8 పేజీలు.. ఆ తర్వాత 10 పేజీలు.. చివరికి 11 పేజీలకు పెంచారు. - అలాగే, మొత్తం 11పేజీల లేఖను శ్రీనివాసరావే రాశాడని ముందు ప్రకటించారు. లేఖలో ఉన్న దస్తూరి స్వయంగా అతనిదేనని కూడా స్పష్టంచేశారు. - కానీ, లేఖలో మూడు రకాల చేతిరాతలు ఉన్నాయి. - అలాగే, పదో తరగతి చదువుకున్న అతను రాజకీయ, సామాజిక అంశాలను విశ్లేషిస్తూ రాయడంపై సందేహాలు తలెత్తాయి. - ప్యాంటు జేబులో పెట్టుకున్న లేఖ ప్రతులు ఏమాత్రం నలగకుండా అప్పటికప్పుడు తాజా ఏ–4 షీట్లో రాసినట్లు ఉన్నాయి. ఆ లేఖ ముగ్గురు రాశారట! ఇదిలా ఉంటే.. ‘ఆ లేఖపై సందేహాలెన్నో’ శీర్షికన సాక్షిలో కథనం రావడంతో పాటు శుక్రవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు ప్లేటు ఫిరాయించారు. నిందితుడి వద్ద లభించిన లేఖ మొత్తం అతను రాసింది కాదని, అతనితోపాటు మరో ఇద్దరు రాశారని విశాఖ సీపీ లడ్హా శుక్రవారం చెప్పుకొచ్చారు. 11 పేజీల లేఖలో తొమ్మిది పేజీలను నిందితుడు తన సోదరి జె.విజయలక్ష్మితో, 10వ పేజీని తనతోపాటే రెస్టారెంట్లో పనిచేస్తున్న రేవతీపతి (19)తో రాయించాడని, చివరి పేజీలో ఉన్న లైన్లను నిందితుడు శ్రీనివాస్ స్వయంగా రాసినట్లు లడ్హా వివరించారు. వాస్తవానికి ఆ లేఖ ప్రతులను పరిశీలిస్తే ముగ్గురు రాసినట్టు ఉందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంవల్లే పోలీసులు మరో ఇద్దరి కొత్త పాత్రలను ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. అలాగే, వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో పార్టీ నేతలు నిందితుడ్ని చుట్టుముట్టిన సందర్భంలో కూడా అతని వద్ద ఎక్కడా లేఖ జాడలేదు. కానీ, ఆ తర్వాత నుంచి లేఖ ఉందంటూ ప్రచారం చేసి రాత్రికి విడుదల చేశారు. లేఖపై నోరెత్తని ఎయిర్‌పోర్టు అధికారులు ఏదైనా కేసు విషయమై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ దళాలు అదుపులో తీసుకున్న నిందితులను పోలీసులకు అప్పగించే సమయంలో పంచనామా చేస్తారు. అతని వద్ద స్వాధీనం చేసుకున్న వాటిలో ఆయుధాలు, వస్తువులు ఏమైనా ఉంటే ఉమ్మడిగా పంచనామా రాసి ఒక కాపీ సీఐఎస్ఎఫ్ వద్ద ఉంచుకుని మరో కాపీ పోలీసులకు అప్పగిస్తారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వరకు లేఖ విషయమై మాట్లాడని సీఐఎస్ఎఫ్, ఎయిర్‌పోర్టు అధికారులు రాత్రికి విడుదల చేసిన లేఖలో మాత్రం సంతకాలు చేయడం అనుమానాలకు తావిచ్చింది. పోలీసుల ప్రోద్బలంతో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి చెందిన ఓ అధికారి ఒత్తిడితోనే సీఐఎస్ఎఫ్ వారు లేఖపై సంతకం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే ఈ విషయమై మాట్లాడేందుకు శుక్రవారం సీఐఎస్ఎఫ్, ఎయిర్‌పోర్టు అధికారులు అంగీకరించలేదు. ‘తొలుత లేఖ విషయం ప్రస్తావించని మీరు.. సాయంత్రానికి లేఖలో ఎలా సంతకం చేశార’ని ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా.. ఆ విషయమై తాను మాట్లాడలేనని బదులిచ్చారు. -
ఘటన ప్రాంతం మా పరిధిలోది కాదు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగిన ప్రాంతం తమ పరిధిలోనిది కాదని, అది సీఐఎస్ఎఫ్ పరిధిలోనిదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌పై హత్యాయత్నం చేసిన జానిపల్లి శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా ఠానేలంక గ్రామానికి చెందినవాడన్నారు. ఎయిర్‌పోర్టులోని ప్యూజియన్ రెస్టారెంట్లో ఏడాది నుంచి చెఫ్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో సెల్ఫీ దిగేందుకు వచ్చి జగన్‌కు అత్యంత సన్నిహితంగా వెళ్లి కోడి కాలికి కట్టే కత్తితో దాడి చేశాడని చెప్పారు. ఈ దాడిలో జగన్ ఎడమ చేతికి గాయమైందన్నారు. వెంటనే జగన్ గన్మెన్లు దుండగుడిని పట్టుకుని సీఐఎఫ్ఎస్ అధికారులకు అప్పగించారని చెప్పారు. అతను జగన్ అభిమాని అని చెబుతున్నాడని, ఈ దాడి పబ్లిసిటీ కోసం అన్పిస్తోందని అన్నారు. పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్టు కనిపిస్తోందని, దీని వెనుక ఎవరున్నా రనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. అన్ని కోణాల్లో నూ ఈ కేసును దర్యాప్తు చేస్తామన్నారు. ఈ దాడికి సీఐఎస్ఎఫ్ సిబ్బందిదే పూర్తి బాధ్యత అని డీజీపీ పేర్కొన్నారు. దుండగుడు శ్రీనివాస్‌ను విచారించిన సీఐఎస్ఎఫ్ అధికారులు అనంతరం తమకు అప్పగించారని డీజీపీ తెలిపారు. సీఐఎస్ఎఫ్ రిపోర్టు ఆధారంగా ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. దాడికి పాల్పడిన శ్రీనివాస్ జేబులో ఒక లెటర్‌ను (తొమ్మిది, పది పేజీల లేఖ)ను కూడా సీఐఎస్ఎఫ్ సిబ్బంది తమకు అందించారని తెలిపారు. నిందితుడి ఎడమ చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కత్తి ఎయిర్‌పోర్టు లోపలికి ఎలా వెళ్లిందో తెలుసుకొనేందుకు సీఐఎస్ఎఫ్ అధికారులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. దాడికి గురైన ప్రతిపక్షనేత జగన్.. ప్రాథమిక చికిత్స అనంతరం విమానంలో హెదరాబాద్కు వెళ్లారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ కోరితే భద్రతను మరింత పెంచుతామని చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్టు డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం నార్త్ ఏసీపీ నాగేశ్వరరావు నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేస్తుందని వెల్లడించారు. దాడికి పాల్పడిన దుండగుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని భావంచే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో రాష్ట్ర పోలీసులు తప్పించుకునేలా దారులు వెదకడం విమర్శలకు తావిస్తోంది. హత్యాయత్నం వెనుక ఎవరున్నారు? ఎలా జరిగింది? గుండుసూదిని కూడా వెళ్లనివ్వని భద్రతా సిబ్బంది కత్తిని ఎలా పోనిచ్చారు? అనే వాటిపై దృష్టిపెట్టాల్సింది పోయి విమర్శలకు తావిచ్చేలా వ్యవహరిస్తున్నారు. సంచలనం రేపిన ఈ ఘటనపై డీజీపీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వానికి వత్తాసు పలికేలా ఉన్నాయని రాజకీయ పక్షాల నేతలు తప్పుపడుతున్నారు. భద్రతా వైఫల్యంతో విపక్ష నాయకునిపై హత్యాయత్నం జరిగితే ఏపీ పోలీసు బాస్ ఠాకూర్, సీఐఎస్ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్ పరస్పర విరుద్ధంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. విమానాశ్రయంలోకి వచ్చే ప్రయాణికులను పరిశీలించి పంపించడం వరకే తమ బాధ్యతని, వ్యక్తుల భద్రతాపరమైన అంశాలు తమ పరిధిలోకి రావని ఆనంద్ అంటే.. ఎయిర్‌పోర్టులో భద్రత తమకు సంబంధంలేదని సీఐఎస్ఎఫ్ చూసుకుంటుందని డీజీపీ మీడియాతో చెప్పారు. ఇదిలా ఉంటే.. విశాఖ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న రెండు ప్రధాన ఘటనల్లో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందని ప్రజలు ప్రస్తావిస్తున్నారు. 2017 జనవరి 26న ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు పలికేందుకు విశాఖకు వచ్చిన వైఎస్ జగన్‌ను అక్కడ విమానాశ్రయంలోని రన్‌వే పైనే అడ్డుకున్న వందలాది మందికి పైగా రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. తాజాగా.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యా యత్నం ఘటనలో మాత్రం ఎయిర్‌పోర్టు తమ పరిధిలో లేదని డీజీపీ చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు అప్పుడొకలా.. ఇప్పుడొకలా వ్యవహరించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. -
బాబు తొత్తునని నిరూపించుకున్నారు
సాక్షి, హైదరాబాద్: విపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో డీజీపీ ఠాకూర్ టీడీపీ నాయకులకన్నా హీనంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు తొత్తునని నిరూపించుకున్నారని వైఎస్సార్ సీపీ మండిపడింది. కత్తితో దాడి చేసిన నిందితుడి గురించి ప్రపంచానికి తెలిసేలోపే ముఖ్యమంత్రి కార్యాలయంలోని వ్యక్తులు పోస్టర్లు విడుదల చేయడం చూస్తుంటే పథకం ప్రకారం పన్నిన కుట్రేనని స్పష్టం అవుతోందని పేర్కొంది. పార్టీ నాయకులు ఈ మేరకు గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యమంత్రి, డీజీపీ, టీడీపీ నేతలకు పలు ప్రశ్నలు సంధించారు. ఆ వివరాలు ఇవీ.. - నిందితుడు వైఎస్సార్ సీపీ అభిమాని అయితే జగన్‌పై కత్తితో దాడిచేస్తాడా? లేక సాక్షాత్తూ ముఖ్యమంత్రి అండదండలతో అధికార యంత్రాంగం కథ నడిపితే దాడిచేస్తాడా? - దాడిచేసిన వ్యక్తి దగ్గర ఏదో ఉత్తరం దొరికిందని తర్వాత కొద్ది గంటల్లోనే డీజీపీ చెప్పారు. ఉత్తరం దొరికితే అదే క్షణంలో ఎందుకు విడుదల చేయలేదు? ఉత్తరం రాయడానికి టైం పట్టిందా? అందుకే అంత టైం తీసుకున్నారా? - దాడిచేసిన వ్యక్తితో పోలీసులు ఏం చెప్పించదలచుకున్నారు? ఏమీ చెప్పొద్దు, మాక్కావాల్సింది మేం చెప్పుకుంటాం అని నిందితుణ్ణి లోపల పెట్టింది నిజంకాదా? - జగన్‌పై దాడి జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగి మీడియా ఛానళ్లతో ప్రత్యేకించి కొన్ని ఛానళ్ల యాజమాన్యాలతో మాట్లాడి ఆపరేషన్ గరుడ, పోస్టర్ అంటూ రెండింటినీ హైలెట్ చేయాలని గట్టిగాఆదేశాలు ఇచ్చింది వాస్తవం కాదా? తదనుగుణంగా ఆ ఛానళ్లు వ్యవహరించడం ప్రజలు గుర్తించరని చంద్రబాబు అనుకుంటున్నారా? - హత్యాయత్నం చేసిన వ్యక్తి నోరు మెదపకముందే అతడి తరఫున ఇందుకే దాడిచేశాడంటూ హోంమంత్రి మొదలుకొని టీడీపీ మంత్రులు ఎలా మాట్లాడతారు? - నేరం చేసిన వాడికంటే ముందు, ఆ నేరాన్ని సమర్థిస్తూ టీడీపీ కేబినెట్ మొత్తం ఎందుకు రంగంలోకి దిగింది? దీని వెనుక మతలబు ఏమిటి? - సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంలా మాట్లాడారా? కుట్రదారుడిలా మాట్లాడారా? - అలిపిరి వద్ద దాడి జరిగిన వెంటనే చంద్రబాబు ఆస్పత్రికి వెళ్లారా? పోలీస్ స్టేషన్‌కు వెళ్లారా? శాంపిల్స్ తీసుకోమని, మెడికల్ సర్టిఫికెట్ తీసుకోమని లేక రోడ్డుమీదే ఏమైనా పడుకున్నారా? - అంత హడావుడిగా డీజీపీని రంగంలోకి ఎందుకు దింపారు? మాకు గుర్తున్నంతవరకూ డీజీపీగా ఉన్న ఠాకూర్ కడప ఎస్పీగా, రాయలసీమ ఐజీగా పనిచేశారు. అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డిమీద ఒక సందర్భంలో దాడిజరిగితే దాన్ని కూడా ఇదే ఠాకూర్ సానుభూతి కోసం చేయించుకున్న దాడిగా చంద్రబాబు ప్రోద్బలంతోనే చెప్పాడని కడపజిల్లా వాసులు, జగన్‌పై దాడి నేపథ్యంలో గుర్తు చేసుకుంటున్నారు. - చంద్రబాబుమీద అలిపిరిలో దాడి జరిగితే, అప్పటి విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుపతి వెళ్లి చంద్రబాబును ఎయిర్‌పోర్టులో పరామర్శించి దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుని ‘బాబూ... దేవుడు గొప్పవాడు, నిన్ను కాపాడాడు...’ అంటూ గొప్ప మానవతా వాదాన్ని కనబరిస్తే ఇప్పుడు చంద్రబాబు మాత్రం ఒక దిగజారిపోయిన రాజకీయ నాయకుడి మాదిరిగా తన మంత్రులుతో ఏంమాట్లాడించారు? ఆయన ఏం మాట్లాడారు? - చంద్రబాబు మాట్లాడించింది ఒక వంతు, ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియాలో చేయిస్తున్న దుష్ప్రచారం ఇంకోవంతు. ప్రారంభంలో ఒక ఫోర్క్‌తో దాడి జరిగినట్టుగా రాశారు. వెంటనే డీజీపీ కూడా అదే విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత అది ఫోర్క్కాదు, గొంతులు కోసే పదునైన కత్తి అని అందరూ చూసిన తర్వాత మాట మార్చారు. జగన్‌కు స్వల్ప గాయాలు అంటూ మొత్తంగా మాటలు మార్చేశారు. - డీజీపీ ఎందుకింత హడావిడిగా ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చింది. దాడిచేసిన వ్యక్తి కులాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది?ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ పరిధిలోని ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులను అంత రెడీగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వెంటనే దాడిచేసిన వ్యక్తిని తమ అదుపులోకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అతను వైయస్సార్ కాంగ్రెస్ అభిమాని అంటూ ఒక అబద్ధాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? - డీజీపీ చేసిన వ్యాఖ్యల ద్వారా ఆయన కాకీ బట్టులు కాదు పచ్చచొక్కాలు వేసుకున్నట్లు అనిపించడంలేదా? - పాదయాత్ర ప్రారంభం అవుతున్న సమయంలోనే దాడిచేసిన వ్యక్తి ఎయిర్‌పోర్టు క్యాంటీన్లో చేరాడంటే.. ఇందులో పథకం ఉందా? లేదా? గడచిన మూడు నెలలుగా జగన్ రాకపోకల్ని నిశితంగా గమనించి దాడి చేశాడంటే ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన దాడేనని అర్థం కావడంలేదా? - జగన్ ప్రభంజనం ఉందని జాతీయ సర్వేలు తేల్చిన నేపథ్యంలో భౌతికంగా జగన్‌ను లేకుండా చేయాలని కుట్ర పన్ని ఇలా చేశారు. - దాడి జరిగిన వెంటనే వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిగ్రహంతో , సంయమనంతో వివరాలు తెలుసుకుని స్పందించడానికి ప్రయత్నించింది. కానీ ఇది పచ్చిగా చంద్రబాబు గేమ్ ప్లాన్ అని తేలిపోతోంది. కాబట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద, ఆయన కొడుకుమీద, ఏపీ డీజీపీ మీద తక్షణం విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ విచారణను నిజాయితీ పరులైన అధికారుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో జరిపించాలని డిమాండు చేస్తున్నాం. -
ప్రభుత్వ ఘోర వైఫల్యం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించడంలో ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి చినరాజప్ప తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు పెద్ద సంఖ్యలో మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, యలమంచిలి రవి, నందిగం సురేష్ తదితరులు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను కలిశారు. సమగ్ర దర్యాప్తు జరిపి ఈ ఘటన వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయాలని, జగన్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. -
ఆ లేఖపై సందేహాలెన్నో!
సాక్షి, విశాఖపట్నం: ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడే వారు తమ చావుకు కారణాలను వివరిస్తూ లేఖ రాసి పెట్టుకుంటారు. ఆ లేఖ ఆధారంగానే అతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందో నిర్ధారణకు వస్తారు. కానీ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగుడు జనుపల్లి శ్రీనివాసరావును వైఎస్సార్సీపీకి వీరాభిమానిగా చిత్రీకరించేందుకు పోలీసులు ఆడిన ‘లేఖ’ నాటకం విస్మయానికి గురిచేస్తోంది. చేయి తిరిగిన రాతగాడిలా..: లేఖలో మొదటి పేజీ మొదలుకుని చివరి పేజీ వరకు ఒకే దస్తూరి క్రమపద్ధతిలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎంత చేయి తిరిగిన రాతగాడైనా చివరి పేజీలకొచ్చేసరికి రాత శైలి మారుతుంది. కానీ ఇక్కడ శ్రీనివాసరావు రాసినట్టు పోలీసులు చెబుతున్న లేఖను పరిశీలిస్తే ఎన్నో అనునానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అతను చదువుకున్నదేమో పదో తరగతి. కానీ లేఖలోని విషయాలు..భావుకత, సమాజం పట్ల నిర్ధిష్ట అవగాహన చూస్తుంటే నిజంగా అతను రాసిందేనా అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కచ్చితంగా ఈ లేఖ పోలీసులు సృష్టించిందేనన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. పైగా ఈ లేఖ చివరి పేజీలో సంబంధం లేకుండా ‘ఈ ఘటనలో నాకు ఏ ప్రాణహాని జరిగినా నా అవయవదానం చేయండి అమ్మా..నాన్నా’ అంటూ లేఖ ముగించడం చూస్తుంటే కావాలని పథకం ప్రకారమే ఈ లేఖ సృష్టించినట్టుగా స్పష్టమవుతోంది. లేఖ ఆద్యంతం చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు: ‘అన్నా ప్రజల హృదయంలో కొలువుండి ప్రజలు దైవంగా భావించిన వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే నాకు చాలా అభిమానం’అంటూ ప్రారంభమైన ఆ లేఖలో చంద్రబాబు పాలనలో ప్రజలు ఎంతో కష్టాలు పడుతున్నారంటూ విమర్శలు సాగాయి.అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరించారు. చివరి పేజిలో చంటి పేరిట సంతకం చేసి పక్కనే వేరే దస్తూరితో జనుపల్లె శ్రీనివాసరావు చిరునామా రాసి ఉంది. సీఐఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ సంతకాలతో విడుదల చేసిన ఈ లేఖ సర్వత్రా సందేహాలకు తావిచ్చేలా ఉంది. ఇదిలా ఉండగా డీజీపీ ఠాకూర్ అమరావతిలో ఘటనపై మాట్లాడుతూ దుండగుడు వైఎస్ జగన్‌కు వీరాభిమాని అంటూ ప్రకటించారు. అంతే కాదు.. వైఎస్సార్సీపీ అభిమాని అని తేల్చేందుకు అతని జేబులో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నామంటూ చెప్పుకొచ్చిన అనంతరం పోలీసులు లేఖను విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. పోలీసుల హైడ్రామా..: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో దారుణంగా విఫలమైన పోలీసులు.. చివరికి ఆయనపై జరిగిన హత్యాయత్నాన్ని ఓ సాధారణ యాధృచ్ఛిక ఘటనగా చిత్రీకరించేందుకు చేస్తున్న యత్నాలు విస్తుగొలుపుతున్నాయి. అత్యంత భద్రతా బలగాల పర్యవేక్షణలో ఉన్న విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో క్యాబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నేతపై కత్తితో హత్యాయత్నం జరిగితే పోలీసులు స్పందించిన తీరు, నిర్లక్ష్య వైఖరి అత్యంత వివాదాస్పదమవుతోంది. హర్షను విచారించని పోలీసులు! దుండగుడు పనిచేస్తున్న ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని, టీడీపీ నేత హర్షను పోలీసులు కనీసంగా ప్రశ్నించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యూజన్ ఫుడ్స్ బ్రాంచిని సొంతంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. -
వారి త్యాగం వెలకట్టలేనిది : డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు త్యాగం వెలకట్టలేనిదని తెలంగాణ డీజీపీ మహేందర్ అన్నారు. నగరంలోని గోషా మహల్ సెంటర్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేందర్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, సీపీ అంజన్ కుమార్‌లు పాల్గొని అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుల సేవలను కొనియాడారు. దేశ వ్యాప్తంగా దాదాపు 414 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోగా, తెలంగాణలో ఇద్దరు పోలీసులు మరణించారని మహేందర్‌రెడ్డి గుర్తుచేశారు. వారి త్యాగం మరువలేనిదని, వారి కుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశ సరిహద్దులో, శాంతి భద్రతలను కాపాడేది పోలీసులు మాత్రమేనని అన్నారు. విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవసభలో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని అమరువీరుల స్తూపానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం చినరాజప్ప, నివాళి అర్పించారు. పొలీసుల కుటుంబాల సంక్షేమం తన బాధ్యత అని చంద్రబాబు అన్నారు. ప్రతి స్టేషన్‌కు కొత్త వాహానాలను అందిస్తామని హామీ ఇచ్చారు. నేరాలను అదుపు చేయడానికి టెక్నాలజీని మరింత వాడాలని సూచించారు. -
పోలీసులకు వెల్నెస్, ఫిట్నెస్ సెంటర్లు : డీజీపీ
సాక్షి, విజయవాడ : విధి నిర్వహణలో అమరులైన వారి సంస్మరణ కోసం రేపు విజయవాడలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ డీజీపీ ఆర్వీ ఠాకూర్ తెలిపారు. ప్రతీ ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. దానిలో భాగంగానే గత వారం రోజులుగా రాష్ట్రంలో విద్యార్థులకు వ్యసరచన వంటి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. దేశ వ్యాప్యంగా ఈ ఏడాది వివిధ ఘటనల్లో 440 మందికి పైగా మృతి చెందారని.. వీరిలో ఆరుగురు తెలుగు వారు ఉన్నారని డీజీపీ ప్రకటించారు. అమరులైన కుటుంబాలకు 3.85 కోట్లు అందజేశామని తెలిపారు. పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నామని, హెల్త్ క్యాంపులను నిర్వహించి అనేక మందికి ఆరోగ్యాలను కాపాడే చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. హోంగార్డ్స్ సంక్షేమం కోసం, ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలో పోలీస్ వెల్నెస్ సెంటర్లు, ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. -
250 మంది నిందితులు గుర్తింపు
పథకం ప్రకారమే విధ్వంసం: అదనపు డీజీపీ ఆర్పీ ఠాకూర్ వెల్లడి సాక్షి, తుని/పాయకరావుపేట: తునిలో కాపు గర్జన సందర్భంగా పక్కా పథకం ప్రకారమే అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయని లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన తుని రూరల్ పోలీస్ స్టేషన్, అక్కడ దగ్ధమైన వాహనాలను ఆయన సోమవారం పరిశీలించారు. తుని పట్టణ పోలీస్ స్టేషన్లో ఉత్తర కోస్తా ఐజీ కుమార్ విశ్వజిత్, నాలుగు జిల్లాల ఎస్పీలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు గర్జన సభ నిర్వహించేందుకు అనుమతులు లేవని, సభలో నుంచి ఒక్కసారిగా జనం బయటకు వచ్చి రైలు ఆపి విధ్వంసం సృష్టించారని తెలిపారు. విధ్వంసకారులు పోలీసులను టార్గెట్ చేశారని, పోలీసులు సంయమనం పాటించారని చెప్పారు. దాడుల్లో పోలీసులు 15 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. ఐదు వేలమంది పోలీసులను రంగంలోకి దించామని, తూర్పు గోదావరి జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని వివరించారు. కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసంలో ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేసినట్టు తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. వీడియో పుటేజ్‌ల ద్వారా గుర్తించిన మేరకు ప్రాథమికంగా కేసులు నమోదైనట్టు ఆయన వివరించారు. ఆందోళనకారుల దాడుల్లో రైల్వే, పోలీస్, పబ్లిక్ తదితర ఆస్తులకు సంబంధించి సుమారు రూ.103 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు గుర్తించామన్నారు. ఇప్పటివరకు సుమారు 250 మంది నిందితులను గుర్తించినట్టు సమాచారం.