
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం డ్రామా అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికే హత్యాయత్నమే అని రిమాండ్ రిపోర్టు వెల్లడించిందని రమేష్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుకు వంత పాడుతూ.. తప్పుడు ప్రకటన చేసిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెంపలేసుకోవాలనీ, ఉద్యోగానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీతో సహా అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ నాయకులు సిగ్గుతో తల దించుకోవాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పతనానికి ఇంకో నాలుగునెళ్లు మాత్రమే ఉందని జోస్యం చెప్పారు. ‘ఆపరేషన్ గరుడ’ అని సృష్టించింది చంద్రబాబేనని ఆరోపించారు. నటుడు శివాజీని పావుగా వాడుకుని బాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
మతిలేని బాబూ.. చూడు
వైఎస్ జగన్‌పై దాడి చేసింది ఆయన అభిమానే అని విష ప్రచారాలు చేస్తున్న మతి లేని ముఖ్యమంత్రి వాస్తవాలు తెలుసుకోవాలని రమేష్ హితవు పలికారు. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తేనని ఆయన ఉద్ఘాటించారు. శ్రీనివాసరావు పేరుతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఐడెంటిటీ కార్డును చూపారు.
Comments
Please login to add a commentAdd a comment