సాక్షి, అమరావతి : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం అడుగడునా అడ్డుతగులుతోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు డీజీపీ ఠాకూర్ భేటీ అయ్యారు.
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై జరిగిన హత్య కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం, హైకోర్టులో వేసిన పిటిషన్ చర్చించినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం రేపు హైకోర్టులో పిటిషన్ వేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన విచారణకు ఏపీ సిట్ అధికారులు సహకరించకపోవడంపై ఆగ్రహించిన ఎన్‌ఐఏ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment