స్పష్టం చేసిన ఎస్‌ఎల్‌బీసీ వెనక్కు తగ్గిన సర్కారు
ఆన్‌లైన్ ఫార్మాట్‌లో మళ్లీ మార్పులు!
హైదరాబాద్ ఏ పంట వేశారనే వివరాలను చెప్పడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. : రైతులు ఏ సర్వే నంబర్‌లో దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. సంబంధిత ఫార్మాట్ నుంచి ఆ అంశాన్ని తొలగించింది. రైతులు బంగారం కుదువ పెట్టి తీసుకున్న రుణాల మాఫీకి సంబంధించి.. ఏ సర్వే నంబర్‌లో ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారో వివరించాలని సూచిస్తూ ఆ మేరకు ఆన్‌లైన్ ఫార్మాట్‌లో పొందుపరిచారు. అయితే రెండురోజుల క్రితం ఆర్థిక శాఖ జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపైనే చాలాసేపు చర్చ జరిగింది. ఏ సర్వే నంబర్‌లో ఏ పంట వేశారనేది రైతులకే తెలియదని, అలాంటి సమాచారం తాము ఏ విధంగా ఇవ్వగలమని బ్యాంకర్లు పేర్కొన్నారు. తమ భూమిలో ఒకపక్క ఒక పంట, మరోపక్క మరో పంట వేసినట్లు రైతులకు తెలుసునని, సర్వే నంబర్ల వారీగా అంటే మాత్రం రైతులే చెప్పలేరని బ్యాంకు అధికారులు వివరిస్తున్నారు. ఆన్‌లైన్ ఫార్మాట్‌లో ఆ అంశాన్ని పూరిస్తే గానీ మిగతా సమాచారం సైతం ప్రభుత్వానికి రాదని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాట్ నుంచి సదరు అంశాన్ని తొలగిస్తూ అందులో మార్పులను చేసింది.
ఏ బ్యాంకు నుంచీ చేరని సమాచారం
ఇప్పటివరకు ఏ బ్యాంకు నుంచి కూడా పూర్తి స్థాయిలో రుణాల వివరాలకు సంబంధించిన సమాచారం ఆన్‌లైన్ ఫార్మాట్‌లో ప్రత్యేక వెబ్‌సైట్‌కు చేరలేదు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం రోజుకో, రెండురోజులకో ఒకసారి కొత్త కొత్త షరతులు విధిస్తూ, అందుకు అనుగుణంగా ఆన్‌లైన్ ఫార్మాట్‌లో మార్పులు చేయడమేనని బ్యాంకర్లు అంటున్నారు. ఆగస్టు 14వ తేదీన రుణ మాఫీ మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం.. 14 రోజుల్లో మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రుణాల వివరాలను అందజేయాలని పేర్కొంది. ఆ 14 రోజులు ముగిసిన తరువాత ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. ఆ మార్పుల మేరకు ఆన్‌లైన్ ఫార్మాట్‌ను రూపొందించారు. ఈ నెల 15వ తేదీలోగా సమాచారాన్ని ఇవ్వాలని బ్యాంకులకు సూచించారు. తిరిగి 15వ తేదీన బంగారం రుణాల మాఫీకి సంబంధించి ఏ సర్వే నంబర్‌లో ఏ పంట వంటి కొత్తగా మరో మూడు షరతులను విధిస్తూ అందుకు అనుగుణంగా ఆన్‌లైన్ ఫార్మాట్‌లో మార్పులు చేసింది. ఈ నెల 25వ తేదీలోగా తాజా మార్పులకు అనుగుణంగా రైతుల రుణ వివరాలను అందజేయాలని ప్రభుత్వం పేర్కొంది. తాజాగా రైతులు ఏ సర్వే నంబర్‌లో ఏ పంట వేశారనే వివరాలు ఇవ్వలేమని బ్యాంకర్లు స్పష్టం చేయడంతో సోమవారం మళ్లీ ఫార్మాట్‌లో మార్పులు చేసింది. అందుకు అనుగుణంగా బ్యాంకర్లు వివరాలను అందజేయాల్సి ఉంది.
ఎక్కడ ఏ పంట వేశారో ఎలా చెప్పగలం?
Published Tue, Sep 23 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement