విస్తారంగా వర్షాలు
♦ జిల్లా సగటు వర్షపాతం 24.8 మి.మీ
♦ వర్షాలతో రైతుల్లో ఆనందం
మచిలీపట్నం : జిల్లాలో శనివారం విస్తారంగా వర్షం కురిసింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. కలిదిండిలో అత్యధికంగా 84.7 మిల్లీమీటర్లు, చాట్రాయిలో అత్యల్పంగా 0.1 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 24.8 మిల్లీమీటర్లుగా ఉంది. వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. పొలాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై వర్షం కురవటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
మచిలీపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఎ.కొండూరు 33.4 మిల్లీమీటర్లు, ఆగిరిపల్లి 2.3, అవనిగడ్డ 51.2, బంటుమిల్లి 42.2, బాపులపాడు 1.9, చల్లపల్లి 5.8, చందర్లపాడు 16.4, జి.కొండూరు 5.5, గంపలగూడెం 44.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గన్నవరం 5.6, ఘంటసాల 8.6, గుడివాడ 47.1, గుడ్లవల్లేరు 36.0, గూడూరు 31.4, ఇబ్రహీంపట్నం 5.6, జగ్గయ్యపేట 11.5, కైకలూరు 55.2, కలిదిండి 62.4, కంచికచర్ల 4.9, కంకిపాడు 30.6, కోడూరు 25.2, కృత్తివెన్ను 24.4 మిల్లీమీటర్లు, మచిలీపట్నం 16.0, మోపిదేవి 15.0, మొవ్వ 12.0, ముదినేపల్లి 6.8, ముసునూరు 1.2, మైలవరం 3.6, నాగాయలంక 44.5, నందిగామ 5.0, నందివాడ 59.9, పెనమలూరు 33.2, పెనుగంచిప్రోలు 15.6, రెడ్డిగూడెం 12.7, తోట్లవల్లూరు 52.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉంగుటూరు 6.5, వత్సవాయి 33.1, వీరులపాడు 1.1, విజయవాడ రూరల్ 40.0, విజయవాడ అర్బన్ 73.2, విస్సన్నపేట 0.4, ఉయ్యూరు 31.7 మిల్లీమటర్ల వర్షపాతం నమోదైంది.