
కోడి పందాలు మా సంప్రదాయం.. కొనసాగిస్తాం!
కోడిపందాలు ఏనాటినుంచో వస్తున్న సంప్రదాయమని, వాటిని కొనసాగించి తీరుతామని ఉండి ఎమ్మెల్యే శివరామరాజు అన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లయినా సరే కోడిపందాలు ఆడి తీరుతామన్నారు. తమ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఎవరు అడ్డుపడినా ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఆడటంపై కోర్టు కూడా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
అయితే.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఇందుకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మలికిపురం మండలంలోని చింతలమోరి, రామరాజులంక ప్రాంతాల్లో బరులు ఏర్పాటుచేస్తున్నారు.