
పీఎస్ ఎదుట ఆందోళన చేస్తున్న నిందితుల బంధువులు
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని పెంటపాడు పోలీస్ స్టేషన్‌లో అర్థరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెంటపాడు మండలం పరిమెళ్ళ గ్రామంలో కోడి పందెల నిర్వాహాకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసినవారిలో టీడీపీకి చెందిన తాడేపల్లి గూడెం ఏఎంసీ డైరెక్టర్ సత్యనారాయణతో పాటు మరో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అరెస్టైన వారిని స్టేషన్‌లో దారుణంగా కొట్టారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నిందితుల బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అదుపులోకి తీసుకున్న నిందితులతోనే ఏఏంసీ డైరెక్టర్‌ని కొట్టించారని ఆయన బంధువులు గందరగోళం సృష్టించారు. మరోవైపు పోలీసుల వారి నుంచి పన్నెండు ద్విచక్ర వాహనాలు, రూ. 9600 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment