ఏలూరు : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరువుకు నష్టం కలిగించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నరంటూ ఆ పార్టీ నాయకులు పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సత్రంపాడు పంచాయతీ వార్డు సభ్యుడు కోండూరి ఎస్‌ఎస్‌ఎస్ సుబ్బారావు అనే వ్యక్తి కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే ఉండి పోలీస్‌స్టేషన్‌లో మండల టీడీపీ అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు ఫిర్యాదు చేయగా, పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో ఆ పార్టీ నాయకులు షేక్ ముస్తాఫా అనే వ్యక్తి కేసీఆర్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో కేసీఆర్ పై నాలుగు చోట్ల కేసులు
Published Mon, Jun 8 2015 7:39 PM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM
Advertisement
Advertisement