
రుణమాఫీపై ప్రభుత్వంతో పోరాడతాం
నెల్లూరు పర్యటనలో రైతులకు జగన్ భరోసా
నెల్లూరు: రుణమాఫీ అమలు జరిగేంతవరకు ప్రభుత్వంతో పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు భరో సా ఇచ్చారు. ఆయన శనివారం నెల్లూరులో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి జగన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు, నెల్లూరుపాలెం, సంగంలలో పార్టీశ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు రుణమాఫీ హామీ తుంగలోతొక్కి రైతులను నట్టేట ముంచారని రైతులు జగన్ దృష్టికితెచ్చారు.