అంతర పంటలతో ఆదాయం
ఒకటి దెబ్బతిన్నా.. మరొకటి ఆదుకుంటుంది
బీసీటీ కేవీకే శాస్త్రవేత్త బండి నాగేంద్ర ప్రసాద్
రాంబిల్లి: అంతర పంటలతో రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చునని బీసీటీ కేవీకే శాస్త్రవేత్త బండి నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. అంతర పంటలు వేసుకోవడం ద్వారా ఒక పంట దెబ్బతిన్నా మరోకటిఆదుకుంటుందన్నారు. ఒక వేళ రెండు పంటలు బాగుంటే మంచి ఆదాయాన్ని పొందడం ద్వారా రైతులు ఆర్థిక ప్రగతి సాధించవచ్చునన్నారు. పండ్ల తోటల్లోనూ నాలుగు ఐదు ఏళ్ల వరకు అంతర పంటలు వేసుకోవచ్చు. తద్వారా రైతుకు నిలకడ ఆదాయం వస్తుంది.అంతర పంటలు ప్రయోజనాలు, ఏయే పంటలు వేసుకుంటే లాభదాయకమన్నది వివరించారు.
ఇలా పంటల ఎంపిక...
నేల నుంచి నీరు, పోషకాలు తీసుకునే లోతులో వ్యత్యాసం ఉండే పంటలను ఎంపిక చేసుకోవాలిఒక పంటపై ఆశించిన పురుగుల నివారణకు మరో పంటపై ఆ పురుగులను తినే సహజ శత్రువులు వృద్ధి చెందడానికి తగిన అంతర పంటలు వేయాలి {పధాన పంట, అంతర పంటలు రెండింటిపైనా పురుగులు తెగుళ్లు ఆశిస్తే రెండు పంటలు నష్టపోవాల్సి వస్తుంది. అందుచేత పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఉహరణకు పత్తిలో పెసర, మినుము, కొర్ర, సోయా వంటి పంటలు పండిస్తే పత్తి పంటపై ఆశించే రసం పీల్చే పురుగులను తినడానికి ఉపయోగపడే అక్షింత పురుగులు, సాలీడులు వృద్ధి చెందుతాయి
కంది పంటకు అంతర పంటల్లో ప్రత్యేకత ఉంది. వేళ్లు లోతుగా పోయి భూమిలో తేమను, పోషకాలను లోపల పొరల నుంచి తీసుకోవడమేగాక పంటల నుంచి రాలిన ఆకులు రాలి నేలలో కుళ్లి భూసారం పెరుగుతుంది కంది 5-6 నెలల దీర్ఘకాలిక పంట కావున మొదటి 3 నెలలు పెసర, సోయా చిక్కుడు, వేరు శెనగ, మొక్కజొన్న, కొర్ర, పత్తి వంటి వాటిని అంతర పంటలుగా వేసుకోవచ్చు.
ఇవీ ప్రయోజనాలు
ఏక కాలంలో రెండు పంటల సాగుతో ఖర్చు తగ్గుతుంది. దిగుబడిబాగుంటే ఆర్థికంగా లాభపడవచ్చుఒక పంట నష్టపోతే మరోక పంట ద్వారా లబ్ధి చేకూరుతుంది కలుపు బెడద బాగా తగ్గుతుందిపోషకాల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది నేల కోతను అరికట్టి భూసారాన్ని పరిరక్షించవచ్చు చీడపురుగులు, తెగుళ్లు బెడద తగ్గుతుంది మిత్ర పురుగుల ఉనికి పెరుగుతుందిఅంతర పంటలు వల్ల కీటకాలు ఆహారాన్ని గుర్తించడం కష్టమవుతుంది భూమిలో తేమ నిల్వ పెరుగుతుంది.
పంటల నిష్పత్తి...
కంది-కొర్ర (1ః5)
కంది-మొక్కజొన్న(1ః2)
కంది-పెసర లేదా కంది-మినుము(1ః2)
కంది-వేరుశెనగ(1ః7)
కంది-పత్తి(1ః6)
చెరకు-మినుము(1ః2)
పండ్ల తోటల్లోనూ..
నిమ్మలో ఆకుకూరలు, వేరుశెనగ, రాగి, సజ్ఞ
మామిడిలో టమాటా, మిరప
బొప్పాయిలో పెసర, మినుము
కొబ్బరిలో కోకో, అనాస, అరటి, కంద , పసుపు
ఆయిల్‌పాంలో కూరగాయలు, కోకో, మిరియాలు, వేరుశనగ