Additional income
-
చిటికెలో చాయ్.. బిస్కెట్!
క్విక్ కామర్స్ రంగంలో పోటీ హీటెక్కుతోంది. దీంతో కంపెనీలు అధిక మార్జిన్ల కోసం సగటు ఆర్డర్ విలువ (ఏఓవీ)ను పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా టీ, కాఫీ, సమోసా, బిస్కెట్లు, ఇతరత్రా బేకరీ ఉత్పత్తులను కూడా కార్ట్‌లోకి చేరుస్తున్నాయి. ప్రత్యేకంగా కేఫ్ విభాగాలను ఏర్పాటు చేస్తూ... కస్టమర్లకు రెడీ–టు–ఈట్ ఆహారోత్పత్తులను ఫటాఫట్ డెలివరీ చేస్తున్నాయి. గ్రోసరీతో పాటు వీటిని కూడా కలిపి ఇన్‌స్టంట్‌గా అందిస్తున్నాయి. ఉదాహరణకు, జెప్టో ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలో ప్రయోగాత్మకంగా జెప్టో కేఫ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ బాగా క్లిక్ కావడంతో బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని అందుబాటులోకి తెచి్చంది. ఇతర ప్రధాన నగరాలకు క్రమంగా విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఇక స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సైతం పైలట్ ప్రాతిపాదికన బెంగళూరులో ఇన్స్టాకేఫ్ను తెరిచింది. ఇక్కడ ప్రధానంగా టీ, కాఫీతో పాటు సూపర్ మార్కెట్లలో రూ.30–300 రేంజ్లో లభించే రెడీ–టు–ఈట్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లకు భిన్నం... తక్షణం కోరుకునే ఆహారోత్పత్తులను కస్టమర్లకు అందించడం కోసమే క్విక్ కామర్స్ కంపెనీలు ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అమెరికాలో 7–ఎలెవన్ స్టోర్స్ మాదిరిగా కస్టమర్లు వెళ్తూ వెళ్తూ కాఫీ లేదా కొన్ని రెడీ–టు–ఈట్ స్నాక్స్‌ను తీసుకెళ్లడం లాంటిదే ఈ మోడల్ అని జెప్టో కో–¸ûండర్ ఆదిత్ పలీచా చెబుతున్నారు. అయితే, అక్కడ మనమే ఉత్పత్తులను తీసుకెళ్లాల్సి ఉంటే, ఇక్కడ ఇన్‌స్టంట్‌గా హోమ్ డెలివరీ చేయడం వెరైటీ అంటున్నారు. కస్టమర్ల నుంచి ఈ కొత్త ప్రయత్నానికి మంచి స్పందనే వస్తోందట! స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల మాదిరి కాకుండా, కిరాణా సరుకులతో పాటు స్నాక్స్, టీ, కాఫీ వంటి ఉత్పత్తులను కూడా ఒకేసారి ఆర్డర్ పెట్టుకునే ఆప్షన్ ఉండటం గమనార్హం. అదనపు ఆదాయం... ఇతర దేశాల్లో కూడా ఉదాహరణకు, అమెరికాలో గోపఫ్, యూకేలో డెలివరూ.. లాటిన్ అమెరికాలో రప్పీ వంటి యాప్‌లు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం స్నాక్స్‌ను కూడా డెలివరీ చేస్తున్నాయి. మన దగ్గర కూడా క్విక్ కామర్స్ సంస్థలు దీన్ని ఫాలో అవుతున్నాయి. కస్టమర్లు కార్ట్‌లోకి మరిన్ని ఉత్పత్తులను జోడించేలా చేయడం ద్వారా ట్రాన్సాక్షన్ విలువను పెంచుకోవడమే వాటి లక్ష్యం. ‘పదేపదే, ఎక్కువ సంఖ్యలో వచ్చే ఇలాంటి ఆర్డర్ల వల్ల కస్టమర్లకు యాప్‌తో అనుబంధం కూడా పెరుగుతుంది. ఆఫ్‌లైన్ బేకరీలు, కాఫీ షాప్‌లను కూడా నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్ల నుంచి కొంత వాటాను దక్కించుకోవడానికి వీలవుతుంది’ అని జిప్పీ ఫౌండర్, సీఈఓ మాధవ్ కస్తూరియా పేర్కొన్నారు. డార్క్ స్టోర్ల ద్వారా ఈ స్టార్టప్ దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ బ్రాండ్ల కోసం ఇన్స్టంట్ డెలివరీ సేవలు అందిస్తోంది.అధిక మార్జిన్లు... క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తమ రోజువారీ గ్రోసరీ విభాగానికి స్నాక్స్‌ను జోడించడం వల్ల వాటి స్థూల ఆర్డర్ విలువ (జీఓవీ) పెంచుకోవడానికి దోహదం చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రోసరీ ఉత్పత్తులతో పోలిస్తే రెడీ–టు–ఈట్లో మార్జిన్లు కూడా మెరుగ్గా ఉండటం మరో ప్లస్. ‘ప్రస్తుతం క్విక్ కామర్స్‌లో 60 శాతం ఆర్డర్లు కిరాణా ఇతరత్రా గ్రోసరీ విభాగం నుంచే వస్తున్నాయి. స్నాక్స్ ద్వారా 25–30 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. అధిక విలువ గల ప్రోడక్టుల వాటా 10 శాతంగా ఉంటుంది’ అని ఆర్థా వెంచర్ ఫండ్ మేనేజింగ్ అనిరుధ్ దమానీ అభిప్రాయపడ్డారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Moonlighting: మూన్‌లైటింగ్... తప్పా, ఒప్పా?
మూన్‌లైటింగ్. ఇటీవలి కాలంలో అందరి నోళ్లలోనూ బాగా నానుతున్న పేరు. విప్రో సంస్థ ఇటీవల ఏకంగా 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడంతో మరోసారి ఈ పేరు బాగా తెరపైకి వచ్చింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయంటూ మరో బడా ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులకు హెచ్చరిక మెయిల్స్ పంపింది. మూన్‌లైటింగ్ అనైతికమని, దీన్ని సుతరామూ ఆమోదించబోమని అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం కూడా స్పష్టం చేసింది. స్వల్ప లాభాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే ఉద్యోగులు కెరీర్‌నే రిస్కులో పెట్టుకుంటున్నారంటూ టీసీఎస్ కూడా పేర్కొంది. బడా ఐటీ సంస్థలను ఇంతగా ప్రభావితం చేస్తున్న మూన్‌లైటింగ్ తప్పా, ఒప్పా అంటూ ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది... అనైతికమా? ఒక సంస్థలో పర్మనెంట్ ఉద్యోగిగా ఉంటూ ఖాళీ సమయాల్లో, వారాంతాల్లో ఇతర సంస్థలకు పని చేయడాన్ని మూన్‌లైటింగ్‌గా పిలుస్తున్నారు. నిజానికి అదనపు ఆదాయం కోసం పని వేళల తర్వాత చాలామంది ఇతర పనులు చేయడం కొత్తేమీ కాదు. బడుగు జీవులు వేతనం చాలక ఇలా చేస్తే ఏమో గానీ భారీ జీతాలు తీసుకునే ఐటీ ఉద్యోగులు మాత్రం ఇతర సంస్థలకు, అదీ తమ ప్రత్యర్థులకు పని చేయడం అనైతికమన్నది ఐటీ సంస్థల వాదన. బెంగళూరులో ఓ ఐటీ సంస్థ ఉద్యోగికి ఏకంగా ఏడు పీఎఫ్ ఖాతాలున్నట్టు తేలడం సంచలనం సృష్టించింది. చిన్నాదా, పెద్దదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా పీఎఫ్ ఖాతా తప్పనిసరి కావడం తెలిసిందే. విప్రో కూడా మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న తమ ఉద్యోగులను పీఎఫ్ ఖాతాల ద్వారానే గుర్తించిందని స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్ రాజీవ్ మెహతా చెప్పడం సంచలనంగా మారింది. ఈ ఒరవడి మనకు కాస్త కొత్తగా అన్పించినా అమెరికాలో మాత్రం 2018లోనే బహుళ ఉద్యోగాలు చేసేవారి సంఖ్య 7.2 శాతం పెరిగిందట. అక్కడ మహిళలు అధికంగా మూన్‌లైటింగ్ చేస్తున్నట్టు తేలింది. సమర్థకులే ఎక్కువ... మూన్‌లైటింగ్‌పై ఐటీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అనైతికమే గాక సంస్థ పట్ల పచ్చి మోసమేనంటారు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ. టీసీఎస్ అధిపతి గణపతి సుబ్రమణ్యం దీన్ని నైతిక సమస్యగా అభివర్ణించారు. ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్‌పాయ్ మాత్రం ఇందులో మోసమేముందని ప్రశ్నస్తున్నారు. ‘‘నిర్ణీత సమయం పాటు సంస్థలో పని చేస్తానంటూ ఉద్యోగి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత అతను ఏ పని చేస్తే సంస్థకేంటి?’’ అన్నది ఆ్న ప్రశ్న. టెక్‌మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ అయితే ఓ అడుగు ముందుకేసి తమ ఉద్యోగులు పనివేళల తర్వాత ఇతర ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఓ విధానమే రూపొందిస్తామని ప్రకటించారు. మూన్‌లైటింగ్‌కు అనుమతించిన తొలి సంస్థగా ఆన్లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ నిలిచింది. ఫిన్‌టెక్, యూనికార్న్, క్రెడ్ సంస్థలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా మూన్‌లైటింగ్‌ను సమర్థించారు. మింట్ సర్వేలో 64.5 శాతం మూన్‌లైటింగ్‌ను సమర్థించారు. అనైతికమన్న వారి సంఖ్య కేవలం 23.4 శాతమే. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
అంతర పంటలతో అదనపు ఆదాయం
అనంతపురం అగ్రికల్చర్ : ఏకపంట విధానానికి స్వస్తి పలికి ప్రధాన పంటలో అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. ఖరీఫ్ ఆరంభం కావడంతో వర్షాలు కూడా కురుస్తుండటంతో రైతులు పంటల సాగుకు సమాయత్తం కావాలని సూచించారు. అంతర పంటల ప్రాధాన్యత జిల్లాలో ప్రధానంగా వేరుశనగ అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది. అయితే చాలా మంది రైతులు కేవలం వేరుశనగ మాత్రమే వేస్తున్నందున నష్టపోతున్నారు. అందులో అంతర పంటలు వేసుకోవడం వల్ల తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది. వీటి వల్ల పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్లు కూడా తగ్గుతాయి. 7:1 లేదా 11:1 లేదా 15:1 నిష్పత్తిలో వేరుశనగలో అంతర పంటగా కంది వేసుకోవడం బాగుంటుంది. బెట్ట ఏర్పడినా వేరుశనగ దెబ్బతిన్నా కంది పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏకపంటగా కంది పంట వేసుకోవడం జరుగుతోంది. కంది సాళ్ల మధ్య 1:4 లేదా 1:7 నిష్పత్తిలో పెసర, కొర్ర పంటలు వేసుకోవచ్చు. పెసర పంట 70 రోజుల్లో చేతికి వస్తుంది. తర్వాత కంది సాళ్ల మధ్య ఉలవ కూడా వేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు. ఎర్రనేలలు 1:4 నిష్పత్తిలో కంది+కొర్ర సాగుకు అనుకూలం. నల్లరేగడి భూముల్లో చాలా మంది కేవలం పప్పుశనగ మాత్రమే వేస్తున్నారు. పప్పుశనగ పంట వేసే ముందు కొర్ర వేసుకోవచ్చు. ఆముదం+ప్రత్తి వేసే రైతులు అంతర పంటగా కంది 4:1 లేదా 7:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. నవధాన్యపు పంటలు వేసుకోవడం మరచిపోకూడదు. వేరుశనగ ప్రధాన పొలం చుట్టూ జొన్న, సజ్జ లాంటి పంటలు నాలుగైదు వరుసలు వేసుకోవడం వల్ల అదనపు ఆదాయంతో పాటు చీడపీడలు, పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. బీటీ ప్రత్తి పంట వేసే రైతులు పొలం చుట్టూ నాన్‌బీటీ విత్తనాలు వేసుకోవాలి. దీని వల్ల ప్రమాదకరమైన గులాబీరంగు కాయతొలచు పురుగు ఉనికి, ఉధృతిని నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఆముదం, కందికి అనుకూలం దుక్కులు చేసుకుని సిద్ధంగా ఉన్న రైతులు ఈ వర్షాలకు కంది, ఆముదం పంటలు విత్తుకోవచ్చు. నీటి వసతి కింద అయితే వేరుశనగ పంట సాగు చేయవచ్చు. వర్షాధారంగా అయితే వేరుశనగ పంట సాగుకు జూలై మంచి సమయం. విత్తే ముందు సిఫారసు చేసిన విధంగా విత్తనశుద్ధి పాటించాలి. విత్తుకున్న 24 లేదా 48 గంటల్లోగా సిఫారసు చేసిన విధంగా కలుపు నివారణ మందులు పిచికారీ చేసుకుంటే 30 రోజుల పాటు పంటకు కలుపు సమస్య ఉండదు. -
అంతర పంటలతో ఆదాయం
ఒకటి దెబ్బతిన్నా.. మరొకటి ఆదుకుంటుంది బీసీటీ కేవీకే శాస్త్రవేత్త బండి నాగేంద్ర ప్రసాద్ రాంబిల్లి: అంతర పంటలతో రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చునని బీసీటీ కేవీకే శాస్త్రవేత్త బండి నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. అంతర పంటలు వేసుకోవడం ద్వారా ఒక పంట దెబ్బతిన్నా మరోకటిఆదుకుంటుందన్నారు. ఒక వేళ రెండు పంటలు బాగుంటే మంచి ఆదాయాన్ని పొందడం ద్వారా రైతులు ఆర్థిక ప్రగతి సాధించవచ్చునన్నారు. పండ్ల తోటల్లోనూ నాలుగు ఐదు ఏళ్ల వరకు అంతర పంటలు వేసుకోవచ్చు. తద్వారా రైతుకు నిలకడ ఆదాయం వస్తుంది.అంతర పంటలు ప్రయోజనాలు, ఏయే పంటలు వేసుకుంటే లాభదాయకమన్నది వివరించారు. ఇలా పంటల ఎంపిక... నేల నుంచి నీరు, పోషకాలు తీసుకునే లోతులో వ్యత్యాసం ఉండే పంటలను ఎంపిక చేసుకోవాలిఒక పంటపై ఆశించిన పురుగుల నివారణకు మరో పంటపై ఆ పురుగులను తినే సహజ శత్రువులు వృద్ధి చెందడానికి తగిన అంతర పంటలు వేయాలి {పధాన పంట, అంతర పంటలు రెండింటిపైనా పురుగులు తెగుళ్లు ఆశిస్తే రెండు పంటలు నష్టపోవాల్సి వస్తుంది. అందుచేత పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఉహరణకు పత్తిలో పెసర, మినుము, కొర్ర, సోయా వంటి పంటలు పండిస్తే పత్తి పంటపై ఆశించే రసం పీల్చే పురుగులను తినడానికి ఉపయోగపడే అక్షింత పురుగులు, సాలీడులు వృద్ధి చెందుతాయి కంది పంటకు అంతర పంటల్లో ప్రత్యేకత ఉంది. వేళ్లు లోతుగా పోయి భూమిలో తేమను, పోషకాలను లోపల పొరల నుంచి తీసుకోవడమేగాక పంటల నుంచి రాలిన ఆకులు రాలి నేలలో కుళ్లి భూసారం పెరుగుతుంది కంది 5-6 నెలల దీర్ఘకాలిక పంట కావున మొదటి 3 నెలలు పెసర, సోయా చిక్కుడు, వేరు శెనగ, మొక్కజొన్న, కొర్ర, పత్తి వంటి వాటిని అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఇవీ ప్రయోజనాలు ఏక కాలంలో రెండు పంటల సాగుతో ఖర్చు తగ్గుతుంది. దిగుబడిబాగుంటే ఆర్థికంగా లాభపడవచ్చుఒక పంట నష్టపోతే మరోక పంట ద్వారా లబ్ధి చేకూరుతుంది కలుపు బెడద బాగా తగ్గుతుందిపోషకాల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది నేల కోతను అరికట్టి భూసారాన్ని పరిరక్షించవచ్చు చీడపురుగులు, తెగుళ్లు బెడద తగ్గుతుంది మిత్ర పురుగుల ఉనికి పెరుగుతుందిఅంతర పంటలు వల్ల కీటకాలు ఆహారాన్ని గుర్తించడం కష్టమవుతుంది భూమిలో తేమ నిల్వ పెరుగుతుంది. పంటల నిష్పత్తి... కంది-కొర్ర (1ః5) కంది-మొక్కజొన్న(1ః2) కంది-పెసర లేదా కంది-మినుము(1ః2) కంది-వేరుశెనగ(1ః7) కంది-పత్తి(1ః6) చెరకు-మినుము(1ః2) పండ్ల తోటల్లోనూ.. నిమ్మలో ఆకుకూరలు, వేరుశెనగ, రాగి, సజ్ఞ మామిడిలో టమాటా, మిరప బొప్పాయిలో పెసర, మినుము కొబ్బరిలో కోకో, అనాస, అరటి, కంద , పసుపు ఆయిల్పాంలో కూరగాయలు, కోకో, మిరియాలు, వేరుశనగ -
‘చీప్’ ట్రిక్స్
ఎక్సైజ్ సుంకం, వ్యాట్ పేరుతో గారడీ చీప్ లిక్కర్ ధరలు తగ్గింపు బీరు, మిగిలిన బ్రాండ్ల ధరలు పెంపు మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి, అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేస్తోంది. అసలు రేటును పెంచేసి వాటిపై డిస్కౌంట్లు ఇచ్చే వాణిజ్య సూత్రాన్ని పాటిస్తోంది. అంతేకాదు డిమాండ్ సప్లై నిబంధనను కూడా అనుసరిస్తోంది. వస్తు వినిమయ సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటోంది. సింపుల్‌గా చెప్పాలంటే ఎకనామిక్స్‌తో ‘చీప్’ ట్రిక్ ప్లే చేస్తోంది. ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్ను(వ్యాట్)లను ప్రయోగించింది. అల్పాదాయ వర్గాల వారు సేవించే తక్కువ రేటు మద్యం చీప్ లిక్కర్ ధరలో రూ.10 డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం దసరా మరుసటి రోజు ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే అమలులోకి వచ్చిన ఈ ఉత్తర్వుల ప్రకారం చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ ధర రూ.60 నుంచి రూ.50 కి తగ్గింది. దీంతో పేదలకు మద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చినట్టయ్యింది. ఇక్కడ గమనించాల్సిన సూత్రమేమిటంటే ధర తగ్గడం వల్ల అమ్మకాలు పెరుగుతాయి. దీని వల్ల ప్రభుత్వానికి లాభం. కాకపోతే కొత్తగా మరికొంత మంది మద్యానికి బానిసలవుతారు. మరోవైపు మధ్య తరగతి వారి నుంచి మరింత ఆదాయాన్ని రాబాట్టేందుకు ‘బి’ కేటగిరి బాటిల్ మద్యంపై రూ.40 నుంచి రూ.100 వరకూ ధర పెరిగింది. బీర్లు ఎక్కువగా తాగుతున్నారని తెలియడంతో దానిపైనా పన్నువేశారు. దీంతో బీరు బాటిల్‌పై రూ.5 వరకూ ధర పెరగనుంది. ఇలా పన్నుల పేరుతో ధరలను సవరించి ప్రభుత్వం సొమ్ము చేసుకోవాలనుకుంటోంది. -
అదనపు ఆదాయం .. ఇలా ఉపయోగిద్దాం..!
కాస్త ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే బోనస్‌లో, జీతాల పెంపు రూపంలోనో లేదా మరో రూపంలో వచ్చే అదనపు ఆదాయాన్ని సద్వినియోగపర్చుకోవచ్చు. పొదుపు మొత్తాన్ని పెంచండి: జీతంలో ఇంత మొత్తం అని కాకుండా ఇంత శాతాన్ని పొదుపు చేయాలని నిర్దేశించుకుంటే దానికి తగ్గట్లుగా ఖర్చులను నియంత్రించుకోవచ్చు. భవిష్యత్ కోసం జాగ్రత్తపడొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్: అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు డబ్బుల కోసం తడుముకోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇప్పటిదాకా ఇలాంటి ఏర్పాటు చేసుకోకపోతే.. కొత్తగా చేతికొచ్చే అదనపు ఆదాయాన్ని ఇందుకోసం ఉపయోగించండి. మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్య, మీ వయస్సు, ఆర్థిక స్థితిగతులను బట్టి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇందులో ఉంచడం మంచిది. అప్పులుంటే తీర్చేయండి: అప్పుల భారం మోయగలిగే స్థాయిని మించి ఉంటే.. ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యే ప్రమాదం ఉంది. పెపైచ్చు వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంటే భారం మరింత పెరిగిపోతుంది. కాబట్టి.. ముందుగా అప్పులను క్లియర్ చేసేందుకు ప్రయత్నించాలి. తద్వారా వడ్డీ భారం తగ్గుతుంది. మిగిలిన దానిని ప్రయోజనకరమైన పెట్టుబడులకు మళ్లించవచ్చు. ఇన్వెస్ట్మెంట్: స్టాక్‌మార్కెట్లు, వాటి అనుబంధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు పరిజ్ఞానం లేనివారికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. నెలకు రూ. 500 కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయచ్చు. -
అదనపు ఆదాయంపై ‘మోనో’ దృష్టి
సాక్షి, ముంబై: ‘మోనో’ దృష్టి ప్రకటనలపై పడింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైలుకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) యోచిస్తోంది. ఇందులో భాగంగా టెండర్లను పిలి చేందుకు యత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రయాణికులు లేక సంస్థకు ఆదాయానికి గండిపడుతోంది. ఫలితంగా మోనోకు ప్రతీరోజు దాదాపు రూ.1.5 లక్షల నుంచి రూ.రెండు లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. మరోపక్క ప్రకటనల ద్వారా రావాల్సిన అదనపు ఆదాయం కూడా రాకపోవడంతో ఆందోళనలో పడిపోయింది. ప్రస్తుతం మోనో రైలు చెంబూర్-వడాలా మధ్య 8.8 కి.మీ. నడుస్తోంది. ఆరు స్టేషన్లు ఉండగా 355 స్థంబాలున్నాయి. ఈ స్థంబాలు రాజకీయ పార్టీలు, విద్యా సంస్థల ప్రకటనలతో నిండిపోయి ఉన్నాయి. వాటిపై ఉన్న అక్రమ బ్యానర్లను తొలగించాలని ఇప్పటికే ముంబై హై కోర్టు ఆదేశించింది. కాని వాటిపై చర్యలు తీసుకునేందుకు తగినంత సిబ్బంది తమవద్ద లేరని ఎమ్మెమ్మార్డీయే అధికారులు చేతులెత్తేశారు. ఇదిలా ఉండగా, ఆయా స్థంభాలపై బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసేందుకు అధికారికంగా అనుమతినిస్తామని ఎమ్మెమ్మార్డీయే ప్రకటించింది. అందుకు టెండర్లను ఆహ్వానించి అర్హతగల ఏజన్సీకి బాధ్యతలు అప్పగించాలని ఆరు నెలల కిందటే నిర్ణయం తీసుకుంది. కాని అప్పటికి మోనో రైలు ప్రారంభం కాకపోవడంతో టెండరు వేసేందుకు ఏ ఏజన్సీ కూడా ముందుకు రాలేదు. కాని ప్రస్తుతం మోనో రైలు నడుస్తోంది. దీంతో టెండర్లు వేసేందుకు ఏజన్సీలు ముందుకు వస్తాయని ఎమ్మెమ్మార్డీయే ప్రాజెక్టు డెరైక్టరు దిలీప్ కవట్కర్ అభిప్రాయపడ్డారు. ఆసక్తిగల సంస్థల నుంచి ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించేందుకు జూలై 22 వరకు గడువు ఇచ్చింది. కాని స్థంబాలపై ప్రకటనలు ఏర్పాటు చేయడంవల్ల మోనోకు పెద్దగా ఆదాయం రాదని, వాటివల్ల ఒరిగేదేమీ ఉండదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.