- ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఖాళీలు త్వరలో భర్తీ
- ఓటర్ల జాబితా రూపొందిస్తున్న అధికారులు
- నెలాఖరులోఈసీ నోటిఫికేషన్
- జిల్లాలో రెండు సీట్లపై కన్నేసిన టీడీపీ
- మంత్రుల ద్వారా సీనియర్ల పైరవీలు
సాక్షి,విశాఖపట్నం: అన్నిరకాల ఎన్నికలు ముగిసిపోయాయనుకుంటున్న తరుణంలో జిల్లాలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో రాజకీయ సందడి సంతరించుకోనుంది. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వచ్చిన స్థానికసంస్థల ఎన్నికలు పూర్తయి, పాలకవర్గాలు కూడా కొలువుదీరాయి. ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. అధికారులు
ఓటర్ల జాబితా తయారీకి చర్యలు చేపట్టారు.
కొద్దిరోజుల్లో జిల్లాలోని రెండు స్థానాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. జెడ్పీటీసీ,ఎంపీటీసీ సభ్యులు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీవారు గెలుపొందడంతో ఆ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీగా నెగ్గడం సులువనే భావనంతో ఎలాగైనా ఎమ్మెల్సీ సీట్లు దక్కించుకోవాలని టీడీపీలో సీనియర్ నేతలు,ఆశావహులు అప్పుడే పోటాపోటీగా ప్రయత్నాలు ప్రారంభించారు.
ముఖ్యం గా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్‌చార్జులుగా ఉండి టిక్కెట్లు దక్కని నేతలు ఎలాగైనా ఈసారి పట్టు విడవకూడదని వ్యూహాలకు పదునుపెడుతున్నా రు. అటు సీనియర్ నేతలు సైతం తమకు ఎలాగూ టి క్కెట్లు ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్సీలు ఇవ్వాలని వాదిస్తున్నారు. ఇంతవరకూ ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా వ్యవహరించిన దాడి వీరభద్రరావు,డీవీ సూర్యనారాయణరాజుల స్థానాల్లో కొత్తగా ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. వీరిని జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు ఎన్నుకోనున్నారు.
ఈ కోటాలో సీటుకోసం సీనియర్ నేతలు గాజువాక నుంచి కోనతాతారావు,యలమంచిలి నుంచి సుందరపు విజయ్‌కుమార్‌లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో వీరికి టిక్కెట్లు రానందున చంద్రబాబు సైతం ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వీరికి హామీ ఇచ్చారు. దీంతో వీరిద్దరు ఈ స్థానాలపై చాలా ఆశలుపెట్టుకున్నారు. ఒకానొకదశలో రెబల్‌గా పోటీకి సుందరపు ప్రయత్నించడంతో చంద్రబాబు నేరుగా బుజ్జగించి పదవి ఖాయమని చెప్పారు.
కోనతాతారావుకూడా బాబు హామీతో రెబల్ గా నిలబడకుండా ఉండిపోయారు. దీంతో ఇద్దరూ రెండుసీట్లకోసం ప్రయత్నిస్తున్నారు. కోనతాతారావు కు చంద్రబాబుతో సాన్నిహిత్యం, మంత్రి అయ్యన్న మద్దతు ఉండడంతో సులువుగానే సీటు వస్తుందని భా విస్తున్నారు. అటుసీనియర్ నేతలు పప్పల చలపతిరా వు, ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజులు మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వీరుకాక పలువురు ఆశావహులు సైతం టిక్కెట్ రేసులో ఉన్నారు. అయితే ఇచ్చిన మాటపై చంద్రబాబు నిలబడతారా?లేదా అ నూహ్యం గా ఎవరినైనా కొత్త నేతలను తెరపైకి తీసుకువస్తారా? అనేది పార్టీ నేతలకు అంతుపట్టడంలేదు.
పై గా ఎన్నికలముందు హామీతో మెత్తబడ్డ కోన తాతారావు,సుందరపులు మాత్రం ఎలాగైనా సీటు తమదేనని ధీమా వ్య క్తం చేస్తున్నారు. అటు సీనియర్ నేతలు కూ డా తమ దే పైచేయి అవుతుందనే నమ్మకం తో ఉన్నా రు. ప్రస్తు త పరిస్థితుల్లో పోటీ ఎక్కువగా ఉండడంతో ఆశావహులు ఎవరికివారే తమకు తెలిసిన పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతూనే బాబును కలి సేందుకు ప్ర యత్నిస్తున్నారు. ఇచ్చినమాట బాబు నిల బెట్టుకుం టారా? అనేదే ఇప్పుడు పార్టీ నేతలకు అంతుపట్టని విషయం.