35 నక్షత్ర తాబేళ్ల పట్టివేత
వాల్మీకిపురం : చిత్తూరు జిల్లా వయల్పాడు మండల కేంద్రంలో.. ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న 35 నక్షత్ర తాబేళ్లను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు ఓ కేసు విచారణలో భాగంగా వెళుతుండగా వాయల్పాడులో గౌరమ్మ(28) అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. ఆమెను విచారించగా... సరైన వివరాలు చెప్పకపోవడంతో పోలీసులకు సందేహం వచ్చింది. ఆమె వద్దనున్న ఓ ప్లాస్టిక్ బుట్టను పరిశీలించగా అందులో 35 నక్షత్ర తాబేళ్లు కనిపించాయి. దీంతో పోలీసులు తాబేళ్లతోపాటు గౌరమ్మను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వారు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.