భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి | Woman died after her husband passed away | Sakshi
Sakshi News home page

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

Published Thu, Dec 5 2013 6:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

భర్త మరణించిన కొన్ని గంటల్లోనే భార్య మృతి చెందిన ఈ విషా ద సంఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది.

మెదక్ టౌన్, న్యూస్‌లైన్ : భర్త మరణించిన కొన్ని గంటల్లోనే భార్య మృతి చెందిన ఈ విషా ద సంఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. పట్టణంలోని రషీద్ కాలనీకి చెందిన ఎండీ ఖాజీం హుస్సేన్ (55) మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. కాగా భర్త మృతిని తట్టులేక అతని భార్య సరియా బేగం (45) బుధవారం గుండెపోటుకు గురై మృతి చెందింది. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొడుకు లిద్దరూ సౌదీఅరేబియాలో ఉన్నారు. వారు వచ్చాకే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. వీరి మృతి పట్ల మత పెద్దలు ఆరీఫ్ హుస్సేన్, అల్తాఫ్ హుస్సేన్, మహ్మద్ హుస్సేన్, నవాబ్ భాయ్, నహీంబేగ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు బట్టి జగపతి, సావిత్రి సురేందర్‌గౌడ్‌లు సంతాపం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement