మళ్లీ రెచ్చిపోయిన మానవ మృగాలు! | woman Sexual assault on Auto driver | Sakshi
Sakshi News home page

మళ్లీ రెచ్చిపోయిన మానవ మృగాలు!

Jul 12 2015 12:59 AM | Updated on Sep 3 2017 5:19 AM

మళ్లీ మానవ మృగాళ్లు రెచ్చిపోయాయి. డెంకాడ మండలంలో శనివారం జరిగిన దారుణంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

 నిశిరాత్రిలో
 మహిళను కాటేసిన కామాంధులు
 డెంకాడలో మహిళపై ఆటోడ్రైవర్, మరో వ్యక్తి లైంగికదాడి
 జిల్లాలో పెరుగుతున్న లైంగికదాడులు

 
 విజయనగరం కంటోన్మెంట్/ డెంకాడ: మళ్లీ మానవ మృగాళ్లు రెచ్చిపోయాయి. డెంకాడ  మండలంలో శనివారం జరిగిన దారుణంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జిల్లాలో ఏటా ఏదో ఒక సంఘటన జరుగుతునే ఉంది. జిల్లా కేంద్రంలో మొదటి ఆట బాహుబలి సినిమాకు వెళ్లిన   భార్యాభర్తలు సినిమా పూర్తికాగానే, ఎత్తు బ్రిడ్జి వద్దకు వచ్చారు.  భర్తకు విజయనగరంలో వేరే పని ఉండడంతో రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో  ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు కదా అన్న ధైర్యంతో   భార్యను తగరపువలస వెళ్లే  ఆటో ఎక్కించారు.  ఆ ధైర్యమే ఆ మహిళను కామపిశాచులకు బలిచేసింది.  జొన్నాడ వద్దకు వచ్చే సరికి ఆటోలో ఉన్న వారంతా దిగిపోయారు. ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి మాత్రమే ఉన్నారు.
 
 ఇదే అదునుగా వారు ఆటోను దారి మళ్లించి మోపాడ సంతతోటలోకి తీసుకుని వెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. అంతే కాదు విషయం బయటకు చెబితే హత్య చేస్తామని ఆమెను వారు బెదిరించారు.   ఆమె శనివారం మధ్యాహ్నం భర్తతో కలసి  డెంకాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగుచూసింది.  పరువుకోసమో, చంపేస్తారని భయపడో ఆమె మౌనంగా ఉండిపోతే ఘటన వెలుగులోకి వచ్చేది కాదు. లైంగిక దాడుల్లో కొన్ని మాత్రమే వెలుగుచూస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న సంఘటనలే దీనిని రూఢి  చేస్తున్నాయి. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని  మానవ మృగాలు లైంగిక దాడికి దిగుతున్నాయి. నిందితుల్లో ఎక్కువ మంది ఆటో, ట్రక్కు, టాటా ఏస్, జీపు తదితర వాహనాల  డ్రైవర్లే ఉంటున్నారు.  
 
 మద్యం మత్తులోనే...
 మద్యం మత్తు మగాళ్లను మృగాళ్లుగా మార్చేస్తోంది. జిల్లాలో జరిగిన ఎక్కువ దాడులు మద్యం మత్తులో చేసినవే.  మద్యం తాగిన తర్వాత విచక్షణను కోల్పోవడంతో ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు.  
 
 గతంలో జరిగిన  సంఘటనలు
మండలంలోని ధర్మపురి గ్రామంలో ఐదేళ్ల బాలికను  యువకుడు అత్యాచారం చేసి నీళ్లకుండిలో ముంచి హత్యచేశాడు
గంట్యాడ మండలం పెణసాం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి సీతంనాయుడు అదే గ్రామానికి  చెందిన యువతిని అత్యాచారం చేసి,  కొంతమంది చూడడంతో తలపై బండరాయి మోది హత్యచేశాడు   గంట్యాడ మండలం చంద్రపేట గ్రామానికి చెందిన యువతిపై  అదే గ్రామానికి చెందిన  యువకుడు అత్యాచారం చేశాడు.
 
మెంటాడ మండలం పేదమేడపల్లి గ్రామానికి చెందిన యువతి జిల్లా కేంద్రానికి గ్రూపు-2  పరీక్ష రాయడానికి వచ్చినపుడు  ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద టాటా ఏస్  వ్యాన్ ఎక్కిన తర్వాత చాలా రోజుల కనిపించలేదు. అమెపై  డెంకాడ మండలం సింగవరం వద్ద అత్యాచారం చేసి దారుణంగా చెట్టుకు వేలాడదీశారు. గుమ్మలక్షీపురం గ్రామంలో తీర్థానికి వెళ్లి వచ్చిన  మహిళలను అర్ధరాత్రి ఐదుగురు దుండుగులు అత్యాచారం చేసి చంపేశారు.  ఈ ఘటనల్లో నిందితులెవరికీ ఇంకా శిక్ష లు పడలేదు.
 
 శిక్షలు కఠినంగా ఉంటాయి
అత్యాచారాలు,   హత్యలు చేసిన వారికి శిక్షలు కఠి నంగా ఉంటాయి. ప్రస్తుతానికి కేసులు విచారణలో ఉన్నాయి.  శిక్షలు పడితే  కామాంధులు  భయపడతారు. జిల్లాలో  అత్యాచారాలు జరగకుండా ప్రజల్లో అవగాహన  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
  - పి.వి.రత్నం విజయనగరం డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement