గిద్దలూరు (ప్రకాశం) : పొలం పనులకు వెళ్తున్నానని.. ఇంట్లో చెప్పిన మహిళ శవమై కనిపించింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భార్య ఇస్లావత్ మంత్రీబాయి(42) సోమవారం మధ్యాహ్నం పొలం పనుల నిమిత్తం వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అయితే కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లేసరికి ఆమె శవమై పడి ఉండటం గమనించి పోలీసులకు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.